- Home
- Sports
- Cricket
- ICC Cricket World Cup 2023 : పాకిస్థాన్ తో ఆటకంటే అమ్మతో మాటే నాకు ముఖ్యం : జస్ప్రిత్ బుమ్రా
ICC Cricket World Cup 2023 : పాకిస్థాన్ తో ఆటకంటే అమ్మతో మాటే నాకు ముఖ్యం : జస్ప్రిత్ బుమ్రా
ఐసిసి వన్డే వరల్డ్ కప్ 2023 లో భాగంగా అహ్మదాబాద్ లో రేపు భారత్, పాకిస్థాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. తన సొంత గడ్డపై జరుగుతున్న ఈ మ్యాచ్ కు ముందు టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

ind vs pak
అహ్మదాబాద్ : స్వదేశంలో జరుగుతున్న ప్రపంచ కప్... అందులోనూ పుట్టిపెరిగిన గడ్డపై చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో హైవోల్టేజ్ మ్యాచ్... క్రికెట్ ఫ్యాన్స్ మాత్రమే కాదు యావత్ దేశం ఈ మ్యాచ్ కోసం, సొంత మైదానంలో అతడి ఆటకోసం ఎదురుచూస్తున్నారు... కానీ టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ సింగ్ బుమ్రా మాత్రం ఈ మ్యాచ్ కోసం కంటే తల్లి కోసమే ఎక్కువగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. ఇలా తనను నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టిన ఆట కంటే అమ్మ ప్రేమే ముఖ్యమని చాటిచెప్పాడు బుమ్రా.
Bumrah
అహ్మదాబాద్ టీమిండియా బౌలర్ బుమ్రా స్వస్థలం. ఇలా అతడు పుట్టిపెరిగిన నగరంలోనే ఐసిసి వన్డే ప్రపంచ కప్ 2023 మెగా టోర్నీలోనే హైవోల్టేజ్ మ్యాచ్ ఇండియా-పాకిస్థాన్ మద్య జరగనుంది. అక్టోబర్ 14న అంటే రేపు ఈ మ్యాచ్ జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే భారత్, పాకిస్థాన్ ఆటగాళ్లు అహ్మదాబాద్ చేరుకున్నాయి.
Bumrah
ఇలా సొంతగడ్డపై అడుగుపెట్టిన స్టార్ బౌలర్ బుమ్రా మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. పాకిస్థాన్ తో మ్యాచ్ కోసం అందరిలాగే తానుకూడా ఎదురుచూస్తున్నానని... కానీ అంతకంటే ముందు తన తల్లిని చూడాలని మనసు కోరుకుంటోందని అన్నాడు. కాబట్టి పాకిస్థాన్ తో మ్యాచ్ కంటే తల్లిని చూడటమే తనకు ముఖ్యమన్నాడు. ఇలా తనకు కన్నతల్లిపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు బుమ్రా.
BUMRAH
తనకు ఆట కంటే అమ్మ ప్రేమే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందని బుమ్రా అన్నారు. కాబట్టి మొదట ఇంటికి వెళ్లి అమ్మను చూస్తానని... ఆమె చేతివంట తింటానని తెలిపాడు. ఇదే తనకు సంతోషం కలిగించే మొదటి విషయమని బుమ్రా పేర్కొన్నాడు.
bumrah
బుమ్రా చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. దీంతో అతడికి అన్నీ తానే అయ్యింది తల్లి దల్జీత్. బుమ్రాతో పాటు మిగతా పిల్లలను కూడా ఎంతో కష్టపడి పెంచింది. ఆమె ఓ స్కూల్లో ఉపాధ్యాయురాలు అయినప్పటికి బుమ్రాను చదువు పేరిట ఇబ్బందిపెట్టలేదు. కొడుకు ఇష్టాన్ని గుర్తించి క్రికెట్ శిక్షణ ఇప్పించింది. ఇలా టీమిండియాకు బుమ్రా లాంటి టాలెంటెడ్ బౌలర్ ను అందించింది ఆ తల్లి.
Bumrah and Sanjana
చిన్నప్పుడే తండ్రి ప్రేమకు దూరమైన బుమ్రా ఇటీవలే తండ్రయ్యాడు. 2021 లో సంజనా గణేషన్ ను బుమ్రా పెళ్లాడగా ఇటీవలే ఆమె ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇలా ఓ బిడ్డకు తండ్రయినా తన తల్లి ప్రేమకోసం తహతహలాడుతున్నాడు టీమిండియా స్టార్ బౌలర్.