- Home
- Sports
- Cricket
- నేనైతే కెఎల్ రాహుల్ కోసం కొట్లాడేవాడిని.. మంచి ప్లేయర్లను అలా వదులుకుంటారా..? : ఆసీస్ మాజీ కెప్టెన్ కామెంట్స్
నేనైతే కెఎల్ రాహుల్ కోసం కొట్లాడేవాడిని.. మంచి ప్లేయర్లను అలా వదులుకుంటారా..? : ఆసీస్ మాజీ కెప్టెన్ కామెంట్స్
INDvsAUS: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి రెండు టెస్టులలో దారుణంగా విఫలమైన టీమిండియా ఓపెనర్ కెఎల్ రాహుల్ ను మూడో టెస్టుకు పక్కనబెట్టిన విషయం తెలిసిందే.

టీమిండియా వెటరన్ బ్యాటర్ కెఎల్ రాహుల్ పేలవ ఫామ్ తో సతమతమవుతున్న నేపథ్యంలో టీమ్ మేనేజ్మెంట్.. ఇండోర్ లో అతడిని తప్పించింది. రోహిత్ తో ఓపెనర్ గా పరిమిత ఓవర్లలో సూపర్ ఫామ్ లో ఉన్న శుభ్‌మన్ గిల్ ను ఆడిస్తున్నది.
అయితే ఇండోర్ మ్యాచ్ లో రాహుల్ ను ఆడించటంపై టీమిండియా ఫ్యాన్స్ తో పాటు మాజీ క్రికెటర్లు (ప్రత్యేకించి వెంకటేశ్ ప్రసాద్) కూడా హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ సారథి మైఖేల్ క్లార్క్ మాత్రం అందుకు భిన్నంగా స్పందించాడు. రాహుల్ కు మద్దతుగా నిలిచుంటే బాగుండేదని.. తానైతే అతడి కోసం టీమ్ మేనేజ్మెంట్ తో కొట్టాడేవాడినని చెప్పాడు.
రెవ్ స్పోర్ట్స్ తో క్లార్క్ మాట్లాడుతూ... ‘నాకు కెఎల్ రాహుల్ బ్యాటింగ్ అంటే చాలా ఇష్టం. అతడు చాలా టాలెంటెడ్ క్రికెటర్. ప్రస్తుతం బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భారత్ రెండు టెస్టులు గెలిచింది. సిరీస్ ను దక్కించుకునేందుకు కూడా ఆ జట్టుకు అవకాశముంది.
ఈ నేపథ్యంలో రాహుల్ ను తప్పించడం ఎందుకు..? నేనే టీమిండియా కెప్టెన్ ను అయితే మాత్రం కచ్చితంగా టీమ్ మేనేజ్మెంట్ తో రాహుల్ కోసం కొట్లాడేవాడిని. ప్రస్తుతం రాహుల్ స్థాయికి తగ్గ రీతిలో పరుగులు చేయలేకపోవచ్చు. కానీ భారత్ మ్యాచ్ లు గెలుస్తుంది కదా..
Image credit: Getty
రాహుల్ ఔట్ అయ్యే విధానంపై క్లార్క్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రస్తుతం అతడి ఫామ్ కారణంగా రాహుల్ ఎలా ఆడినా విమర్శలు ఎదుర్కుంటున్నాడని త్వరలోనే అతడు తిరిగి తన ఫామ్ ను అందుకుంటాడని క్లార్క్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఇదిలాఉండగా రెండో టెస్టులో భారత్ తడబాటు కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ స్పిన్నర్ల ధాటికి 109 పరుగులకే ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్.. 197 పరుగులు చేసింది. తద్వారా 88 పరుగుల కీలక ఆధిక్యం దక్కింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో కూడా భారత బ్యాటర్ల వైఫల్యం కొనసాగుతోంది.