- Home
- Sports
- Cricket
- నా నెక్స్ట్ టార్గెట్ అదే.. త్వరలోనే సాధిస్తా.. నయా పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ ఆసక్తికర వ్యాఖ్యలు
నా నెక్స్ట్ టార్గెట్ అదే.. త్వరలోనే సాధిస్తా.. నయా పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ ఆసక్తికర వ్యాఖ్యలు
Umran Malik: ఐపీఎల్ సంచలనం, సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున గతేడాది సంచలన స్సెల్స్ వేసిన జమ్మూకాశ్మీర్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్.. తన తర్వాత లక్ష్యాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

గతేడాది ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) తరఫున ఆడుతూ 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు విసిరి సంచలనాలు సృష్టించిన జమ్మూకాశ్మీర్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్.. రాబోయే ఐపీఎల్ లో మరిన్ని రికార్డులు సృష్టించడానికి సిద్ధమవుతున్నాడు.
రంజీలలో ప్రస్తుతం జమ్మూకాశ్మీర్ తరఫున ఆడుతున్న ఉమ్రాన్ మాలిక్.. టీమిండియాకు ఆడటం తన లక్ష్యమని, త్వరలోనే ఆ కలను నెరవేర్చుకుంటానని అన్నాడు.
ఓ జాతీయ వెబ్ ఛానెల్ తో మాలిక్ మాట్లాడుతూ.. ‘జమ్మూ కాశ్మీర్ జట్టుకు ఆడటానికి గత రెండేండ్లుగా చాలా కష్టపడుతున్నాను. ఆ సమయంలో ఐపీఎల్ వంటి టోర్నీలలో ఆడే అవకాశం రావడం చాలా సంతోషంగా అనిపించింది.
ఇదే విధంగా టీమిండియాకు కూడా ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నాను. నా తర్వాత లక్ష్యం కూడా అదే.. దానికోసం నా శక్తిమేర ప్రయత్నిస్తున్నాను...’ అని అన్నాడు.
ఇక ఐపీఎల్-2022 కోసం స్టార్ ఆటగాళ్లను కూడా పక్కనబెట్టి తనను రిటైన్ చేసుకోవడంపై స్పందిస్తూ.. ‘చాలా మంది స్టార్ ఆటగాళ్లను కాదని ఎస్ఆర్హెచ్ నన్ను రిటైన్ చేసుకుంది. అందుకు నాకు గర్వంగా ఉంది. నా తొలి ఐపీఎల్ సీజన్ (2021) లో మూడు మ్యాచులు మాత్రమే ఆడినా నన్ను రిటైన్ చేసుకోవడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా..’ అని తెలిపాడు.
తన బౌలింగ్ పై ఇర్ఫాన్ పఠాన్ ప్రభావం ఎంతో ఉందని ఉమ్రాన్ చెప్పాడు. ‘ఇర్ఫాన్ భాయ్ జమ్మూ కాశ్మీర్ మెంటర్ కమ్ కోచ్ గా తన జర్నీని ప్రారంభించినప్పుడు నేను నెట్స్ లో బౌలింగ్ చేయడం చూసేవాడు. అప్పుడు నా స్కిల్స్ మరింత మెరుగవడానికి సాయం చేశాడు.
నేను బౌలింగ్ చేసిన వీడియోలను ఇర్ఫాన్ అన్నకు పంపేవాడిని. వాటిని చూసి అతడు ఏమైనా తప్పొప్పులు ఉంటే చెప్పేవాడు. ఆ సూచనలు నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి..’ అని మాలిక్ చెప్పుకొచ్చాడు.