- Home
- Sports
- Cricket
- బాబర్ ఆజమ్‌ని పెళ్లి చేసుకుంటా! పీసీబీ మాజీ ఛైర్మెన్ రమీజ్ రాజా షాకింగ్ కామెంట్స్...
బాబర్ ఆజమ్‌ని పెళ్లి చేసుకుంటా! పీసీబీ మాజీ ఛైర్మెన్ రమీజ్ రాజా షాకింగ్ కామెంట్స్...
ప్రస్తుతం లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్న పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్, గాలే టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 59 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 104 పరుగులు చేసి సెంచరీ అందుకున్నాడు. టీ20 కెరీర్‌లో బాబర్ ఆజమ్‌కి ఇది 10వ సెంచరీ...

Babar Azam
మొత్తంగా 264 టీ20 మ్యాచులు ఆడిన బాబర్ ఆజమ్, 10 సెంచరీలతో 9412 పరుగులు చేశాడు. బాబర్ ఆజమ్‌కి ముందు క్రిస్ గేల్ మాత్రమే టీ20ల్లో 10కి పైగా సెంచరీలు చేసిన ప్లేయర్‌గా ఉన్నాడు..
Babar Azam
463 టీ20 మ్యాచులు ఆడిన వెస్టిండీస్ మాజీ క్రికెటర్, ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్, 22 సెంచరీలతో ఈ లిస్టులో టాప్‌లో ఉన్నాడు. మైకేల్ క్లింగర్, డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ, ఆరోన్ ఫించ్ టీ20ల్లో 8 సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నారు..
బాబర్ ఆజమ్‌ని ఎంతగానో అభిమానిస్తూ, ప్రోత్సహిస్తూ వచ్చిన పాక్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మెన్ రమీజ్ రాజా, ప్రస్తుతం లంకప్రీమియర్ లీగ్‌కి కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. బాబర్ ఆజమ్ సెంచరీ తర్వాత రమీజ్ రాజా చేసిన కామెంట్లు, తెగ వైరల్ అవుతున్నాయి..
‘క్లాస్, క్వాలిటీ, కామ్‌నెస్‌తో కూడిన ఇన్నింగ్స్. ఎలాంటి పరిస్థితుల్లో అయినా టీమ్ కోసం ఆడే ప్లేయర్ అతను. ఇంతో ఎంతో విలువైన ఇన్నింగ్స్. నాకు బాబర్ ఆజమ్ అంటే ఎంతో ప్రేమ. నేను అతన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా..’ అంటూ నోరుజారాడు రమీజ్ రాజా..
బాబర్ ఆజమ్ మీద ఇష్టంతో రమీజ్ రాజా ఈ విధంగా కామెంట్లు చేసినా, వాటి అర్థం మారిపోవడంతో ఈ ఇద్దరినీ ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో మీమ్స్, స్ఫూఫ్ వీడియోలు ప్రత్యేక్షమయ్యాయి.