- Home
- Sports
- Cricket
- రెండో ఓవర్‌లో బ్యాటింగ్‌కి రావాలని రెడీ అయ్యా! రోహిత్ నన్ను కూర్చోబెట్టి... దినేశ్ కార్తీక్ కామెంట్స్..
రెండో ఓవర్‌లో బ్యాటింగ్‌కి రావాలని రెడీ అయ్యా! రోహిత్ నన్ను కూర్చోబెట్టి... దినేశ్ కార్తీక్ కామెంట్స్..
టీమిండియా పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోవడానికి ముందు విరాట్ కోహ్లీ మ్యారేజ్ సమయంలో తాత్కాలిక సారథిగా వ్యవహరించాడు రోహిత్ శర్మ. ఈ సమయంలోనే ఆసియా కప్ 2018తో పాటు నిదహాస్ ట్రోఫీ గెలిచాడు...

Image credit: Getty
బంగ్లాదేశ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ ఆఖరి బంతికి ఉత్కంఠ విజయం అందుకుంది టీమిండియా. 2 బంతుల్లో 5 పరుగులు కావాల్సిన దశలో విజయ్ శంకర్ అవుట్ కావడంతో మ్యాచ్ గెలిచినట్టు, ఆఖరి బంతికి ముందే సెలబ్రేట్ చేసుకుంది బంగ్లాదేశ్...
Dinesh Karthik
అయితే చివరి బంతికి సిక్స్ కొట్టిన దినేశ్ కార్తీక్, మ్యాచ్‌ని ముగించాడు. దినేశ్ కార్తీక్ కెరీర్‌లో బెస్ట్ ఇన్నింగ్స్ అంటే ఇదే. టీ20ల్లో ఆఖరి బంతికి సిక్సర్ బాది, విజయాన్ని అందించిన మొట్టమొదటి భారత ప్లేయర్‌గా నిలిచాడు దినేశ్ కార్తీక్...
Image credit: PTI
8 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 29 పరుగులు చేసిన దినేశ్ కార్తీక్, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచాడు. ఐదేళ్ల తర్వాత ఈ మ్యాచ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు దినేశ్ కార్తీక్..
Dinesh Karthik
‘లీగ్ స్టేజీలో శ్రీలంక మొదటి రెండు మ్యాచుల్లో గెలిచింది. అయితే ఆ తర్వాత రెండు మ్యాచుల్లో ఓడిపోవడంతో వాళ్లు ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయారు. లంక ఓటమితో బంగ్లాదేశ్ ఫైనల్ చేరింది..
ఫైనల్ మ్యాచ్ ఫస్టాఫ్‌లో భారత బౌలర్లు చాలా బాగా బౌలింగ్ చేశారు. అయితే 10 ఓవర్ల తర్వాత భారీగా పరుగులు ఇచ్చారు. బ్యాటింగ్‌లోనూ అంతే. తొలి 10 ఓవర్లు బాగానే ఆడాం. ఆ తర్వాతే వరుస వికెట్లు కోల్పోవడంతో కష్టాల్లో పడ్డాం...
విజయానికి 2 ఓవర్లలో 34 పరుగులు కావాల్సిన సమయంలో నేను బ్యాటింగ్‌కి వచ్చా. నిజానికి నేను రెండో, మూడో ఓవర్‌లో బ్యాటింగ్‌కి వద్దామని ప్యాడ్స్ కట్టుకుని రెడీగా ఉన్నా. అయితే రోహిత్ మాత్రం ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు అని కూర్చోబెట్టాడు..
15వ ఓవర్‌లో వికెట్ పడిన తర్వాత నేను బ్యాటింగ్‌కి వెళ్లాలని అనుకున్నా. అప్పుడు కూడా రోహిత్ వద్దని చెప్పాడు. 18వ ఓవర్‌లో మనీశ్ పాండే అవుట్ కావడంతో నేను బ్యాటింగ్‌కి వెళ్లా. 2 ఓవర్లు, 34 పరుగులు... ఎన్ని బంతులు ఆడతావో ఆడు అని చెప్పాడు...
Dinesh Karthik
నేను వెళ్లగానే షాట్స్ ఆడడం మొదలెట్టా. 2 ఓవర్లలో 34 పరుగులు కావాలంటే ఏ పొజిషన్‌లో షాట్స్ ఆడాలా? అని ఆలోచిస్తాం. నేను కూడా అదే చూశా. మంచి పొజిషన్స్ సెలక్ట్ చేసుకుని, మంచి షాట్స్ ఆడా...
నేను అలా ఆడతానని వాళ్లు అనుకోలేదు. యార్కర్లు వేసి ఇబ్బంది పెట్టారు. అయితే అందులో ఓ యార్కర్ లక్కీగా బౌండరీకి వెళ్లింది. అక్కడి నుంచి ఎలా ఆడాలని వచ్చానో అలా ఆడి మ్యాచ్ ఫినిష్ చేశా... వాళ్లు మ్యాచ్ తమదేనని ఫిక్స్ అయిపోయి, నాగినీ డ్యాన్స్ చేశారు. మ్యాచ్ మేం గెలిచాం...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్..