జస్ప్రిత్ బుమ్రా ఆశ చూపి, మోసం చేశాడు... శ్రేయాస్ అయ్యర్ కామెంట్స్...
రోహిత్ శర్మ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒక్క ఓటమి కూడా లేకుండా వరుస విజయాలతో దూసుకుపోతోంది భారత జట్టు. రోహిత్ లేని భారత జట్టు, సౌతాఫ్రికాలో ఒకే ఒక్క విజయం అందుకుంటే, స్వదేశంలో మాత్రం ప్రత్యర్థిని చీల్చిచెండాడేస్తున్నారు భారత క్రికెటర్లు...

న్యూజిలాండ్, వెస్టిండీస్‌లపై వార్ వన్‌సైడ్ చేసి, క్లీన్ స్వీప్స్ అందుకున్న భారత జట్టు... ఇప్పుడు శ్రీలంకపై తన పంజా విసురుతోంది...
తొలి టీ20 మ్యాచ్‌లో అటు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అదిరిపోయే పర్పామెన్స్ ఇచ్చిన టీమిండియా, ఫీల్డింగ్‌లో మాత్రం కొన్ని క్యాచులు జారవిడిచి నిరాశపరిచింది...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి జట్టును తయారుచేయడమే లక్ష్యంగా పెట్టుకున్న రోహిత్ శర్మ, ప్రతీ బ్యాటర్ బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉండేలా తయారుచేస్తున్నాడు...
టూ డౌన్ బ్యాటర్‌గా సూపర్ సక్సెస్ అయిన శ్రేయాస్ అయ్యర్, విరాట్ కోహ్లీ గైర్హజరీలో వన్‌డౌన్ వస్తూ ఆకట్టుకుంటున్నాడు...
టూ డౌన్ బ్యాటర్‌గా సూపర్ సక్సెస్ అయిన శ్రేయాస్ అయ్యర్, విరాట్ కోహ్లీ గైర్హజరీలో వన్‌డౌన్ వస్తూ ఆకట్టుకుంటున్నాడు..
శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 57 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్... మ్యాచ్ అనంతరం బుమ్రా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు...
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో కూడా అతికించినట్టుగా ఐదుగురు బౌలర్లతోనే బౌలింగ్ వేయించిన భారత జట్టు, లంకతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఏకంగా ఏడుగురు ప్లేయర్లకు బౌలింగ్ ఇచ్చింది...
రెగ్యూలర్ ఫాస్ట్ బౌలర్లు జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్ అందుబాటులో ఉన్నప్పటికీ వెంకటేశ్ అయ్యర్, దీపక్ హుడాలకు కూడా మూడేసి ఓవర్లు ఇచ్చాడు రోహిత్ శర్మ...
ఎప్పటి నుంచో బౌలింగ్ చేసే అవకాశం కోసం ఆశగా ఎదురుచూస్తున్న శ్రేయాస్ అయ్యర్ కూడా ఈ విషయంలో బాగా డిస్సపాయింట్ అయ్యాడట...
‘16వ ఓవర్ తర్వాత జస్ప్రిత్ బుమ్రా వచ్చి, ఎవరెవరు బౌలింగ్ చేస్తారో చెప్పండని అడిగాడు. నేను నాకు బౌలింగ్ ఇస్తారేమో అని చూశా...
నేను వేస్తానంటూ చెయ్యి పైకి ఎత్తా. అయితే బుమ్రా మాత్రం నన్ను పట్టించుకోలేదు...బుమ్రాకి లంచం ఇవ్వాలని చూసినా కూడా వర్కవుట్ కాలేదు...’ అంటూ కామెంట్ చేశాడు శ్రేయాస్ అయ్యర్...