- Home
- Sports
- Cricket
- మా నాన్నకి మాటిచ్చా, అందుకే కోట్లు ఇస్తామని చెప్పినా ఆ పని మాత్రం చేయలేదు.. - సచిన్ టెండూల్కర్...
మా నాన్నకి మాటిచ్చా, అందుకే కోట్లు ఇస్తామని చెప్పినా ఆ పని మాత్రం చేయలేదు.. - సచిన్ టెండూల్కర్...
టీవీలు, మొబైళ్లు, సోషల్ మీడియా లేని రోజుల్లోనే యావత్ భారతాన్ని తన ఆటతో కట్టిపడేసిన క్రికెటర్ సచిన్ టెండూల్కర్. టెండూల్కర్ బ్యాటింగ్ చేస్తుంటే చాలామంది పనులు మానుకుని మరీ టీవీలకు అతుక్కుపోయేవాళ్లు...

Sachin Tendulkar
90ల్లోనే తిరుగులేని స్టార్ స్టేటస్ సంపాదించిన సచిన్ టెండూల్కర్, రెండు దశాబ్దాలకు పైగా క్రికెట్ కెరీర్‌ని కొనసాగించాడు. అయితే ఎప్పుడూ పొగాకు, అల్కహాల్ వంటి ఆరోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తులకు సచిన్ ఎప్పుడూ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించలేదు...
Sachin Tendulkar
తాజాగా మే 31న వరల్డ్ నో టొబాకో రోజున ముంబైలో ఓ ఈవెంట్‌లో పాల్గొన్న సచిన్ టెండూల్కర్, కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు. ‘నేను టీమిండియాకి ఆడడం మొదలెట్టిన రోజుల్లో, నాకు చాలా అడ్వటైజ్‌మెంట్ ఆఫర్లు వచ్చాయి..
sachin tendular
అప్పుడే నా స్కూల్ అయిపోయింది. నాకోసం చాలా మంది ఇంట్లో ఎదురుచూస్తూ ఉండేవాళ్లు. మా నాన్న ఓ రోజు పిలిచి ఎప్పుడూ పొగాకు ఉత్పత్తులను ప్రమోట్ చేయకూడదని మాట తీసుకున్నారు.. అందుకే నాకు ఎన్ని ఆఫర్లు వచ్చినా వాటిని మాత్రం ఒప్పుకోలేదు...
Image credit: PTI
నేను మా నాన్నకు మాట ఇచ్చా. నేను చాలామందికి రోల్ మోడల్‌ని, ఎంతో మంది నన్ను ఫాలో అవుతారని నాన్న నాతో అన్నారు. అందుకే పొగాకు, అల్కహాల్ వంటి ఉత్పత్తులను ప్రమోట్ చేయవద్దని మాట తీసుకున్నారు. అందుకే ఎన్ని కోట్లు ఇస్తామని చెప్పినా ఆ పని మాత్రం చేయకూడదని నిర్ణయం తీసుకున్నా..
Image credit: PTI
1990ల్లో నా బ్యాటు మీద స్టిక్కర్ ఉండేది కాదు, ఎందుకంటే నాకు కాంట్రాక్ట్ లేదు. టీమ్‌లో మిగిలన వాళ్లంతా రెండు బ్రాండ్లకు ప్రమోట్ చేసేవారు. విల్స్ అండ్ ఫోర్ స్క్వైర్.. నాన్నకిచ్చిన మాట కోసం నా బ్యాటు మీద అవి ఉండనిచ్చేవాడిని కాదు...’ అంటూ కామెంట్ చేశాడు సచిన్ టెండూల్కర్..