- Home
- Sports
- Cricket
- కోహ్లీ, నీ వల్ల నా ఫ్రెండ్ మళ్లీ దూరమయ్యాడు... ఆర్‌సీబీ కెప్టెన్‌పై మ్యాక్స్‌వెల్ ఆరోపణలు...
కోహ్లీ, నీ వల్ల నా ఫ్రెండ్ మళ్లీ దూరమయ్యాడు... ఆర్‌సీబీ కెప్టెన్‌పై మ్యాక్స్‌వెల్ ఆరోపణలు...
విరాట్ కోహ్లీ, ఆన్ ఫీల్డ్‌లో మోస్ట్ అగ్రెసివ్. క్యాచ్ వదిలేసినా, మిస్ ఫీల్డ్ చేసినా తన జట్టు ప్లేయర్లపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అలాంటిది ప్రత్యర్థి ప్లేయర్లతో ఎలా ఉంటాడో చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే ఆఫ్ ఫీల్డ్ మాత్రం విరాట్ కోహ్లీ చాలా కూల్...

ఇంగ్లాండ్ టూర్ ముగించుకుని, యూఏఈ చేరుకున్న విరాట్ కోహ్లీ... ఆరు రోజుల క్వారంటైన్ పీరియడ్ ముగించుకుని ఆర్‌సీబీ క్యాంపులో చేరాడు...
విరాట్ కోహ్లీ క్యాంపులోకి రాగానే తన ఆప్త మిత్రుడు, ఆత్మీయ స్నేహితుడు ఏబీ డివిల్లియర్స్‌ను కౌగిలించుకున్నాడు. దీంతో కోహ్లీపై మ్యాక్స్‌వెల్ ఓ ఫన్నీ కామెంట్ చేశాడు...
‘కోహ్లీ, నీ వల్ల మళ్లీ నా ఫ్రెండ్ నాకు దూరమయ్యాడు... ఇది ఛీటింగ్’... అంటూ కోహ్లీని చూసి కామెంట్ చేశాడు మ్యాక్స్‌వెల్... దానికి విరాట్ కోహ్లీ కూడా తన స్టైల్‌లోనే సమాధానం ఇచ్చాడు...
‘మేము ఆఫ్ స్క్రీన్ ఎప్పుడో కలిశాం... ఇది కేవలం కెమెరాల కోసం మాత్రమే’ అంటూ రిప్లై ఇచ్చాడు విరాట్ కోహ్లీ... కోహ్లీ రాకతో ఏబీ డివిల్లియర్స్‌తో తనతో ఎక్కువ సేపు మాట్లాడడం, గడపడం ఉండదనే ఉద్దేశంతో మ్యాక్స్‌వెల్ ఈ కామెంట్ చేశాడు...
ఆర్‌సీబీ క్యాంపులోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలంక ప్లేయర్ వానిందు హసరంగను కూడా కలిసిన విరాట్ కోహ్లీ, అతనికి ఆల్ ది బెస్ట్ చెబుతూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు...
ఐపీఎల్ 2021 సీజన్‌లో వరుసగా నాలుగు విజయాలు అందుకున్న ఆర్‌సీబీ, ఆ తర్వాత మూడు మ్యాచుల్లో రెండింట్లో ఓడి... 10 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది...
ఐపీఎల్ 2021 ఫేజ్ 2లో సోమవారం కేకేఆర్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ మ్యాచ్‌లో కోవిద్ ఫ్రంట్ లైన్ వారియర్స్‌కి ధన్యవాదాలు తెలుపుతూ బ్లూ కలర్ జెర్సీలో ఆడనుంది ఆర్‌సీబీ...
మిగిలిన ఏడు మ్యాచుల్లో మూడు విజయాలు అందుకుంటే, మిగిలిన ఫ్రాంఛైజీలతో సంబంధం లేకుండా ప్లేఆఫ్ చేరుకుంటుంది ఆర్‌సీబీ...