ఆ రోజు విరాట్ ముఖంలో నవ్వు లేదు! అంత దుఃఖాన్ని మోస్తూ, బ్యాటింగ్ చేశాడు... ఇషాంత్ శర్మ కామెంట్స్..
2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు విరాట్ కోహ్లీ. అప్పటి నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా టాప్‌లో నిలిచాడు. 76 అంతర్జాతీయ సెంచరీలతో సచిన్ టెండూల్కర్ తర్వాతి స్థానంలో నిలిచిన కోహ్లీ, ఈ తరంలో 500లకు పైగా మ్యాచులు ఆడిన ప్లేయర్‌గా నిలిచాడు..
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో 500 అంతర్జాతీయ మ్యాచులు పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ కంటే వేగంగా 76 అంతర్జాతీయ సెంచరీలు అందుకున్నాడు..
సచిన్ టెండూల్కర్, తన తండ్రి చనిపోయిన తర్వాత కూడా వచ్చి టీమిండియా తరుపున ఆడితే... విరాట్ కోహ్లీ కూడా తన తండ్రి మరణం తర్వాత దేశవాళీ టోర్నీల్లో పాల్గొన్నాడు. ఈ సమయంలో జరిగిన విషయాలను తాజాగా బయటపెట్టాడు ఢిల్లీ క్రికెటర్ ఇషాంత్ శర్మ..
‘నేను, విరాట్ కోహ్లీ కలిసి పెరిగాం, కలిసి క్రికెట్ ఆడాం. అయితే అప్పటిదాకా విరాట్ కోహ్లీ ఏడవడం నేనెప్పుడూ చూడలేదు. తన తండ్రి చనిపోయిన సమయంలో విరాట్ కోహ్లీ తన జీవితంలో విషాదకర క్షణాలను ఎదుర్కొన్నాడు...
ఆ సమయంలో కర్ణాటకతో రంజీ మ్యాచ్ ఆడుతున్నాం. ఆ రోజు రాత్రంతా విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తూనే ఉన్నాడు. విరాట్ మ్యాచ్‌కి వెళ్లేటప్పుడు నన్ను ఎక్కించుకుని వెళ్లేవాడు. పటేల్ నగర్ నుంచి ఫిరోజ్ షా కోట్లాకి వెళ్లేవాళ్లం...
ఆ రోజు విరాట్ కోహ్లీ చాలా సీరియస్‌గా ఉన్నాడు. మాతో పాటు వీడియో అనాలసిస్ట్ కూడా ఉన్నాడు. ఎందుకు అంత సీరియస్‌గా ఉన్నావని అడిగాను. కానీ కోహ్లీ రిప్లై ఇవ్వలేదు. నేను సరదాగా తన తలపై కొట్టాను. అయినా పట్టించుకోలేదు..
అప్పుడు తన పక్కనున్న వీడియో అనాలసిస్ట్, కోహ్లీ తండ్రి చనిపోయాడని చెప్పాడు. నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియలేదు. అప్పుడు మా వయసు 17 ఏళ్లు. ఆ రోజు విరాట్ బ్యాటింగ్ చేసి 80 పరుగులు చేశాడు. నాకు అలాంటి సంఘటన జరిగి ఉంటే, గ్రౌండ్‌కి కూడా వెళ్లేవాడిని కాదు..
క్రికెట్‌కి ఇది సమయం కాదని నేను విరాట్‌తో అన్నాను. ‘‘మా నాన్న, నేను క్రికెట్ ఆడాలని కోరుకున్నారు. క్రికెటర్ కావాలని కలలు కన్నారు..’’ అని కోహ్లీ సమాధానం చెప్పాడు.
Ishant Sharma
ఆ వయసులోనే విరాట్ కోహ్లీకి ఉన్న క్లారిటీ చూసి ఆశ్చర్యమేసింది. అప్పుడే కోహ్లీ, ఎదో ఒకరోజు లెజెండరీ క్రికెటర్ అవుతాడని నాకు అనిపించింది..’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా క్రికెటర్ ఇషాంత్ శర్మ..