- Home
- Sports
- Cricket
- నేను బాగానే ఆడుతున్నా, మీరెవ్వరు అలా చెప్పడానికి... పేలవ ఫామ్ గురించి విరాట్ కోహ్లీ కామెంట్..
నేను బాగానే ఆడుతున్నా, మీరెవ్వరు అలా చెప్పడానికి... పేలవ ఫామ్ గురించి విరాట్ కోహ్లీ కామెంట్..
ఆసియా కప్ 2022 ఆరంభానికి ముందు టీమిండియా ఫ్యాన్స్‌ని తీవ్రంగా కలవరబెడుతున్న విషయం మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేలవ ఫామ్. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత తన రేంజ్ ఒక్క ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయాడు విరాట్ కోహ్లీ. ఇంగ్లాండ్ పర్యటనలో అయితే 20+ మార్కుని కూడా దాటలేకపోయాడు. తాజాగా తన పేలవ ఫామ్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు విరాట్ కోహ్లీ...

Image credit: Getty
‘2014 ఇంగ్లాండ్ పర్యటనలో సరిగ్గా ఆడలేకపోయారు. పరుగులు చేయడానికి చాలా కష్టపడ్డాడు. అది నా తప్పులను గ్రహించడానికి నాకు దొరికిన అవకాశం. వాటిని సరిచేసుకోవడానికి చాలా వర్క్ చేశాను. ఎంతో కష్టపడ్డాను... అయితే ఇప్పుడు అలాంటి పొజిషన్‌లో లేను...
Virat Kohli 2012
నేను ఇక్కడ తప్పు చేస్తున్నా అని ఎత్తి చూపించడానికి ఏమీ లేదు. ఈసారి నేను ఫామ్‌లోకి రావడం చాలా ఈజీ. నేను రిథమ్ వచ్చిందని ఫీల్ అయితే చాలు...మళ్లీ మునుపటిలా పరుగులు చేయగలను. నాకు తెలిసి నేను బాగానే ఆడుతున్నా... పరుగులు కూడా చేస్తున్నా...
Virat Kohli 2012 Asia Cup
కాబట్టి నా బ్యాటింగ్‌లో ఎలాంటి సమస్య లేదు. నాలో టాలెంట్ లేకపోతే ఇన్ని పరుగులు చేసి, ఇక్కడిదాకా వచ్చే ఉండేవాడిని కాదు. నా కెరీర్‌లో ఇలాంటివి చాలా చూశాను. చాలాసార్లు విపత్కర పరిస్థితులను తట్టుకుని నిలబడ్డాను. ఈసారి అలాంటి పరిస్థితుల్లో నేను లేను... ఎందుకంటే ఇప్పుడు నేను బాగానే పరుగులు చేస్తున్నా..
virat kohli
ప్రతీ క్రికెటర్ జీవితంలో ఎత్తుపల్లాలు సహజం. ఇప్పుడు నేను పెద్దగా పరుగులు చేయలేకపోవచ్చు కానీ ఒక్క సారి రిథమ్‌లోకి వస్తే మళ్లీ మునుపటిలా నిలకడ చూపించగలను... నా గత అనుభవాలు, నాకు ఎన్నో పాఠాలు నేర్పాయి...
Virat Kohli-Babar Azam
నా స్టాండర్డ్స్ ఏంటో నాకు తెలుసు. ఓ వ్యక్తిగా నాకు నేను ఎప్పుడూ ఎక్కువ విలువ ఇచ్చుకోలేదు. క్రికెటర్‌గానే ప్రాధాన్యం ఇచ్చాను... క్రికెటర్‌గా నా విలువెంటో నాకు తెలుసు... దాన్ని ఎవ్వరూ తక్కువ చేయలేరు...’ అంటూ వ్యాఖ్యానించాడు భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ...