విదేశాల్లో 15 సెంచరీలు చేశా! ఇవన్నీ ఎందుకూ పనికి రావు... విరాట్ కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్...
2018 డిసెంబర్‌లో ఆస్ట్రేలియాలో టెస్టు సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ, ఐదేళ్ల తర్వాత వెస్టిండీస్‌లో ఫారిన్ టెస్టు సెంచరీ అందుకున్నాడు.. మూడున్నరేళ్ల తర్వాత స్వదేశంలో టెస్టు సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ, విండీస్‌తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 121 పరుగులు చేసి అవుట్ అయ్యాడు..
‘నేను ఈ ఇన్నింగ్స్‌ని పూర్తిగా ఎంజాయ్ చేశాడు. నేను ఏ రిథమ్‌లో ఉండాలని కోరుకుంటానో అలాగే ఆడాను. టీమ్ తరుపున నిలబడడం ఓ అవకాశంగా చూస్తాను. బ్యాటింగ్‌కి వెళ్లిన తర్వాత రిథమ్ అందుకోవడానికి కాస్త సమయం తీసుకున్నా. టెస్టుల్లో ఆ సదుపాయం ఉంటుంది..
Virat Kohli Ravindra Jadeja
విదేశాల్లో 15 సెంచరీలు చేశాను. స్వదేశంలో కంటే విదేశాల్లోనే ఎక్కువ సెంచరీలు చేశాను. అది చెత్త రికార్డు ఏమీ కాదు. నా సత్తాను పూర్తిగా వాడుకోవడానికి దొరికిన ప్రతీ అవకాశాన్ని వాడుకోవాలని అనుకుంటాను..
Virat Kohli
ఈ ఐదేళ్లలో విదేశాల్లో 30 మ్యాచులు ఆడలేదు. ఎక్కువ మ్యాచులు స్వదేశంలోనే జరిగాయి. విదేశాల్లో జరిగిన మ్యాచుల్లో కూడా కొన్ని హాఫ్ సెంచరీలు చేశాను. 50 కొట్టినప్పుడు సెంచరీ రాలేదని ఉంటుంది, సెంచరీ కొట్టి 120 దాటాక డబుల్ సెంచరీ చేయలేదని అనిపిస్తుంది..
ఈ లెక్కలు, మైలురాళ్లు అన్నీ ఈ 15 ఏళ్ల నా కెరీర్‌లో దేనికి పనికి రావు. జనాలకు గుర్తుండేది ఒక్కటే, టీమ్ విజయంలో ఎంత ఇంపాక్ట్ చూపించామనేదే. టీమిండియా తరుపున 500 మ్యాచులు ఆడే అవకాశం దక్కడం గర్వకారణం. నేను ఇన్ని మ్యాచులు ఆడతానని ఎప్పుడూ అనుకోలేదు..
అయితే ఇది అంత ఈజీగా వచ్చేయలేదు. ఎంతో కష్టపడ్డాను. ఆటపై మనం చూపించే కమిట్‌మెంట్‌పైన ఆధారపడి ఉంటుంది. 10 బంతుల్లో ఎన్ని వీలైతే అన్ని బౌండరీలు కొట్టేసి స్ట్రైయిక్ రేటు మెరుగుపర్చుకోవాలనుకునే టైపు బ్యాటర్‌ని కాదు నేను. సింగిల్స్, టూడీస్ తీసే అవకాశాన్ని కూడా అస్సలు వదులుకోకూడదని అనుకుంటా..
Virat Kohli
నేను 6 బౌండరీలు కొట్టి, 90 పరుగుల వద్ద ఉంటే నేను ప్రెషర్‌లోనే ఉంటా. 300 బాల్స్ ఆడగల సత్తా నాలో ఉంది. నాకు కరేబియన్‌లో ఈ గ్రౌండ్ చాలా ఇష్టం. ఆస్ట్రేలియాలో ఆడిలైడ్, సౌతాఫ్రికాలో ది బుల్‌రింగ్‌లాగే ఇది కూడా నా హోం గ్రౌండ్‌లా ఫీలవుతా...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ..