- Home
- Sports
- Cricket
- ఐపీఎల్‌లో మనీ నాకవసరం లేదు.. ఆస్ట్రేలియానే ముఖ్యమంటున్న స్టార్క్.. ఈ కాస్త లాజిక్ రోహిత్, కోహ్లీలకు ఉండుంటే!
ఐపీఎల్‌లో మనీ నాకవసరం లేదు.. ఆస్ట్రేలియానే ముఖ్యమంటున్న స్టార్క్.. ఈ కాస్త లాజిక్ రోహిత్, కోహ్లీలకు ఉండుంటే!
WTC Final 2023: ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో మరోసారి ఆ జట్టుకు కీలక బౌలర్ గా సేవలందించాడు. స్టార్క్ ఐపీఎల్ లో ఆడడు.

ప్రపంచవ్యాప్తంగా బిగ్గెస్ట్ క్రికెట్ లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడాలని ఎవరు మాత్రం కోరుకోరు..? వరల్డ్ లోనే రిచెస్ట్ క్రికెట్ బోర్డుగా ఉన్న బీసీసీఐ.. ఆటగాళ్లకు కోటానుకోట్లు చెల్లించి వారిని ఐపీఎల్ ఆడిస్తున్నది. ఒక్కటి, రెండు సీజన్లు బాగా ఆడితే ఐపీఎల్ లో లైఫ్ టైమ్ సెటిల్మెంట్ చేసుకునేంత సంపాదించొచ్చు.
Image credit: Getty
ప్రపంచ క్రికెట్ లో చాలా మంది స్టార్లు ఈ లీగ్ లో ఒక్కసారైనా పాలు పంచుకోవాలని చూసినవాళ్లే. కానీ ఇందుకు ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ మాత్రం మినహాయింపు. ఆధునిక క్రికెట్ లో బెస్ట్ బౌలర్ గా గుర్తింపు పొందిన స్టార్క్ ఐపీఎల్ లో ఆడే అవకాశం వచ్చినా.. కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నా అతడు దానికి దూరంగా ఉంటున్నాడు. జాతీయ జట్టుకు ఆడటమే తన ప్రాధాన్యమని.. లీగ్ లలో మనీ గురించి తనకు పెద్దగా ఆసక్తి లేదని తేల్చి చెప్పాడు.
తాజాగా డబ్ల్యూటీసీ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత కూడా స్టార్క్ ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు. స్టార్క్ మాట్లాడుతూ.. ‘ఐపీఎల్ లో ఆడటాన్ని నేను ఆస్వాదించేవాడిని. పదేండ్ల క్రితం యార్క్‌షైర్ కు ఆడేప్పుడు నేను చాలా ఎంజాయ్ చేసేవాడిని. కానీ ఇప్పుడు లీగ్ లకు ఆడకపోయినందుకు నాకేం దిగులు లేదు.
డబ్బులు వస్తాయి పోతాయి. కానీ నాకు మాత్రం ఆస్ట్రేలియా జట్టుకు ఆడటమే ముఖ్యం. వివిధ లీగుల నుంచి ఆడేందుకు నాకు అవకాశాలు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ నా ప్రాధాన్యం ఆస్ట్రేలియాకు ఆడటమే. గడిచిన వందేళ్ల ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో నాకు తెలిసి 500 మంది కంటే ఎక్కువ మంది ప్లేయర్లు జాతీయ జట్టుకు ఆడి ఉండరు. అందులో నేను ఒకడిని .అది నాకు చాలా ప్రత్యేకం.
నా అభిప్రాయం ప్రకారం చాలా మంది యువ ఆటగాళ్లు ఇప్పటికీ తమ జాతీయ జట్టు తరఫున టెస్టు క్రికెట్ ఆడేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని నేను నమ్ముతున్నా. ఫ్రాంచైజీ క్రికెట్ లో వచ్చేదంతా ఈజీ మనీ. అదంతా ఫాస్ట్ ట్రాక్ లో వచ్చి పోయేది. గతంలో నేను ఐపీఎల్ కు ఆడినా నా గోల్ మాత్రం ఆస్ట్రేలియాకు ఆడటమే. అది ఏ ఫార్మాట్ అన్నది సంబంధంలేదు..’ అని గార్డినయన్ కు ఇచ్చిన ఇంటర్వ్యలో చెప్పాడు.
2014లో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన స్టార్క్.. చాలా తక్కువ మ్యాచ్ లు ఆడి 2021 వరకూ ఈ లీగ్ లో కొనసాగాడు. 2021 వేలంలో కోల్కతా నైట్ రైడర్స్ అతడిని రూ. 5.25 కోట్లకు సొంతం చేసుకుంది. ఆ ఏడాది స్టార్క్ కేకేఆర్ తరఫున రెండు మ్యాచ్ లు ఆడి వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నాడు. మొత్తంగా ఐపీఎల్ లో 26 మ్యాచ్ లు ఆడి 41 వికెట్లు పడగొట్టాడు.
కాగా స్టార్క్ డెడికేషన్ చూసి టీమిండియా ఫ్యాన్స్ కూడా స్పందిస్తున్నారు. జాతీయ జట్టు కోసం ఫ్రాంచైజీ క్రికెట్ ను వదిలేసుకున్న స్టార్క్ ను చూసి కోహ్లీ, రోహిత్ వంటి వాళ్లు నేర్చుకోవాలని సూచిస్తున్నారు. ఈ ఏడాది బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ ముగిసిన తర్వాత జూన్ లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఉందని .. అది భారత్ కు చాలా ప్రత్యేకమని తెలిసినా రెండు నెలల పాటు సాగిన ఐపీఎల్ - 16 ఆడారు.
Image credit: IPL
ఐపీఎల్ కు రెస్ట్ ఇవ్వాలని పలువురు సూచించినా ఈ ఇద్దరితో పాటు డబ్ల్యూపీఎల్ లో భారత్ తరఫున ఏ ఒక్క క్రికెటర్ (పుజారా తప్ప) వినలేదు. రోహిత్ అయితే ఐపీఎల్ - 16 లో వర్క్ లోడ్ మేనేజ్మెంట్ పాటిస్తామని, ఎన్సీఏ ఆధ్వర్యంలో అన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఈ విషయాన్ని చెప్పామని గతంలో చెప్పాడు. కానీ స్వయంగా రోహితే.. ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్ లు కూడా ఆడాడు. ఆర్సీబీ ప్లేఆఫ్స్ కు అర్హత సాధించకపోయినా కోహ్లీ 14 మ్యాచ్ లు ఆడాడు. వీళ్లిద్దరూ డబ్బులకు కాకుండా జాతీయ జట్టు గురించి ఆలోచించి ఉంటే ఓవల్ లో ఫలితం మరోలా ఉండేదని భారత అభిమానులు అనుకుంటున్నారు.