- Home
- Sports
- Cricket
- నేను విరాట్ కోహ్లీ కాళ్లు లాగి కింద పడేస్తా! అతను నా జాన్ జిగిరి దోస్త్... శిఖర్ ధావన్ కామెంట్స్...
నేను విరాట్ కోహ్లీ కాళ్లు లాగి కింద పడేస్తా! అతను నా జాన్ జిగిరి దోస్త్... శిఖర్ ధావన్ కామెంట్స్...
ఒకానొక సమయంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో సమానంగా పోటీపడ్డాడు శిఖర్ ధావన్. అయితే పేలవ ఫామ్‌తో తొలుత టీ20ల్లో, ఆ తర్వాత వన్డేల్లో కూడా చోటు కోల్పోయాడు గబ్బర్. వన్డే వరల్డ్ కప్ 2023 ఆడాలనుకున్న ధావన్, ఇప్పుడు ఆ టోర్నీ నుంచి కూడా దూరమైనట్టే...

శుబ్‌మన్ గిల్ వన్డేల్లో నిలకడైన ప్రదర్శన ఇస్తూ, రోహిత్ శర్మతో కలసి ఓపెనర్‌గా ప్లేస్ కన్ఫార్మ్ చేసుకున్నాడు. ఇషాన్ కిషన్ కూడా వన్డేల్లో ఓపెనర్‌గా డబుల్ సెంచరీ బాదేశాడు. ఈ ఇద్దరి కారణంగా శిఖర్ ధావన్ కెరీర్ దాదాపు ముగిసిపోయినట్టే...
Virat Kohli, Shikhar Dhawan,
‘విరాట్ కోహ్లీ నాకు చాలా మంచి స్నేహితుడు. మా ఇద్దరి మధ్య ఎన్నో ఏళ్లుగా సాన్నిహిత్యం ఉంది. అతను టీమిండియాలో సీనియర్ ప్లేయర్. నేను విరాట్ కోహ్లీ కాళ్లు లాగి కింద పడేస్తా... ఇద్దరం అల్లరి చేస్తాం. టీమ్‌లోని మిగిలిన ప్లేయర్లు ఎవ్వరికీ విరాట్‌కి ఇంత చనువు ఉండదు..
kohli dhawan
యంగ్ ప్లేయర్లు అయితే విరాట్ కోహ్లీతో మాట్లాడడానికి కూడా భయపడుతూ ఉంటారు. అతను చాలా పెద్ద ప్లేయర్ అని, ఫీల్డ్‌లో అగ్రెసివ్‌గా ఉంటాడని బయట కూడా అలాగే ఉంటాడని అనుకుంటారు. అయితే విరాట్ కోహ్లీకి మంచి హ్యూమర్ ఉంది. మేం ఇద్దరం కలిసి ఉంటే ఎన్నో జోక్స్ చెప్పుకుంటూ ఉంటాం.. టీమ్‌లో అతను నా బెస్ట్ ఫ్రెండ్..
ఒక్కో కెప్టెన్‌కి ఒక్కో స్టైల్ ఉంటుంది. ధోనీ చాలా కామ్. ప్లేయర్లను సపోర్ట్ చేయడంలో ధోనీ ముందుంటాడు. చాలా కూల్ పర్సనాలిటీ. చాలా తక్కువ సార్లు ధోనీకి కోపం వస్తుంది. అతను వికెట్ల వెనకాల ఉండి గేమ్‌ని అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, ప్రతీ ఫీల్డింగ్ పొజిషన్‌ని అర్థం చేసుకుంటాడు..
ఎక్కడ ఏ ఫీల్డర్‌ని పెడితే వికెట్ వస్తుందో ధోనీకి తెలిసినట్టు ఎవ్వరికీ తెలీదు. ధోనీతో పోలిస్తే విరాట్ చాలా డిఫరెంట్ కెప్టెన్. అతను ఎప్పుడూ అగ్రెసివ్ బ్యాటర్‌గానే ఆలోచిస్తాడు. విరాట్ క్యారెక్టర్‌లో నాయకుడు ఉన్నాడు..
Image credit: Getty
ఇగో ఉంటే భారత జట్టులో ఆడలేం. ఎందుకంటే నా కంటే చిన్న వయసు ఉన్నవాడు చెబితే నేనెందుకు వినాలని అనుకుంటే... ఇన్ని మ్యాచులు ఆడలేను. నేను ఎప్పుడూ ఇగోలకు పోలేదు. అందుకే కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ వంటి యంగ్ ప్లేయర్ల కెప్టెన్సీలో కూడా ఆడాను..’ అంటూ చెప్పుకొచ్చాడు భారత సీనియర్ వికెట్ కీపర్ శిఖర్ ధావన్..