MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cricket
  • IPL: ఐపీఎల్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్..? కేంద్ర హెచ్చరికలతో అప్రమత్తమైన మహా సర్కారు.. వాళ్లకు అనుమతి డౌటే..?

IPL: ఐపీఎల్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్..? కేంద్ర హెచ్చరికలతో అప్రమత్తమైన మహా సర్కారు.. వాళ్లకు అనుమతి డౌటే..?

IPL 2022: గత రెండు సీజన్లుగా టీవీలకే పరిమితమైన  ఐపీఎల్.. ఈసారైనా స్టేడియాల్లో ప్రేక్షకుల మధ్య జరుగుతుంది అనుకున్న అభిమానులకు మళ్లీ నిరాశే మిగిల్చే సూచనలు కనిపిస్తున్నాయి.   కేంద్ర ప్రభుత్వం తాజా హెచ్చరికలు కూడా ఇందుకు ఆజ్యం పోస్తున్నాయి. 

2 Min read
Author : Srinivas M
Published : Mar 20 2022, 09:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్  (ఐపీఎల్) అభిమానులకు మహారాష్ట్ర సర్కారు షాక్ ఇవ్వనున్నదా..? గత రెండేళ్ల మాదిరిగానే ప్రేక్షకులు లేకుండానే  ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్ మ్యాచులు జరుగుతాయా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

కేంద్ర తాజా హెచ్చరికలు  దీనిని రుజువు చేస్తున్నాయి.  యూరోపియన్ దేశాలతో పాటు  చైనా సహా పలు దక్షిణాసియా దేశాలలో కూడా మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో  కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది.  

310

అప్రమత్తంగా ఉండాలని, కేసులు పెరిగే అవకాశం ఉండటంతో భారీ  జన సందోహాలకు,   పెద్ద స్థాయిలో నిర్వహించే మీటింగుల పట్ల  జాగ్రత్తగా ఉండాలని రాష్ట్రాలకు హెచ్చరికలు పంపింది. 

410

దీంతో మరో వారం రోజుల్లో మొదలుకాబోయే ఐపీఎల్-2022 సీజన్ కోసం 50 శాతం ప్రేక్షకులతో నిర్వహించుకోవచ్చునని  గతంలో అనుమతులిచ్చిన  మహారాష్ట్ర సర్కారు ఇప్పుడు వాటిపై పునరాలోచనలో పడింది. 

510

ఇంకా ఐపీఎల్ కు మరో 6 రోజులు మాత్రమే గడువు ఉంది. ఈనెల 26న చెన్నై సూపర్ కింగ్స్.. కోల్కతా నైట్ రైడర్స్ తో తొలి మ్యాచులో తలపడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం తాజా హెచ్చరికలు..  మహారాష్ట్ర ప్రభుత్వానికి కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. 

610

స్టేడియంలొకి  ప్రేక్షకులను అనుమించే విషయమై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే విషయమై మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే మాట్లాడుతూ ... ‘యూరోపియన్ దేశాలతో పాటు చైనాలో కొత్త కేసులు పెరగడంతో  కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు హెచ్చరికలు అందాయి.  ఈ మేరకు కేంద్రం అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది.  దీంతో  మేము జిల్లా అధికారులకు కూడా జాగ్రత్తగా ఉండాలని లేఖలు రాశాం.

710

అయితే  ఐపీఎల్  మ్యాచులలో ప్రేక్షకులకు సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. దీనిపై ఇప్పుడే ఏం కామెంట్స్ చేయలేను..’ అని తెలిపారు. 

810

ఐపీఎల్ పై మంత్రి సమాధానం దాటవేసినా..   స్టేడియంలోకి ప్రేక్షకుల ఎంట్రీ పై మాత్రం  రాష్ట్ర ప్రభుత్వం కూడా  ఆలోచనలో పడిందని సమాచారం. గత అనుభవాల దృష్ట్యా   జన సమూహాలు లేకుండా ఖాళీ స్టేడియాల్లోనే  ఐపీఎల్ ను నిర్వహిస్తే మంచిదని ప్రభుత్వ వర్గాలు బీసీసీఐ అధికారులకు సూచిస్తున్నట్టు సమాచారం. 

910

రాబోయే రెండు మూడు రోజుల్లో దీనిపై త్వరలోనే కీలక నిర్ణయం వెలువడనున్నది.  ముంబై లోని వాంఖడే, బ్రబోర్న్, డీవై పాటిల్ స్టేడియాలతో పాటుగా పూణెలోని ఎంసీఎ లో కూడా ఐపీఎల్ నిర్వహించనున్నారు.  

1010

ఈ సీజన్ లో 10 జట్లు 70 లీగ్ మ్యాచులు ఆడనున్నాయి. అయితే ప్లే ఆఫ్స్ ఎక్కడ నిర్వహిస్తారనే దానిమీద ఇంకా స్పష్టత లేదు.    
 

About the Author

SM
Srinivas M
ఇండియన్ ప్రీమియర్ లీగ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved