- Home
- Sports
- Cricket
- 14 ఫాస్టెస్ట్ డెలివరీలు.. రెండు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచులు.. ఈ సీజన్ లో ఉమ్రాన్ సంపాదించింది ఎంత..?
14 ఫాస్టెస్ట్ డెలివరీలు.. రెండు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచులు.. ఈ సీజన్ లో ఉమ్రాన్ సంపాదించింది ఎంత..?
IPL 2022: ఐపీఎల్-2022 సీజన్ లో ఇండియాకు దొరికిన పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్. తన పేస్ తో దేశం మొత్తాన్ని తనవైపునకు తిప్పుకున్న ఈ జమ్మూ ఎక్స్ప్రెస్ ఈ సీజన్ లో ఎంత సంపాదించాడంటే..

2021 ఐపీఎల్ సీజన్ లో నెట్ బౌలర్ గా వచ్చి సన్ రైజర్స్ ఆటగాడు టి. నటరాజన్ గాయపడటంతో జట్టులోకి వచ్చాడు ఉమ్రాన్ మాలిక్. ఆ సీజన్ లో ఆడింది మూడు మ్యాచులే అయినా తాను ఏంటో ప్రపంచానికి చెప్పుకున్నాడు.
ఆ సీజన్ లో ఉమ్రాన్ లో విషయముందని గుర్తించిన సన్ రైజర్స్ యాజమాన్యం.. అతడిని 2022 సీజన్ కోసం ఏకంగా రూ. 4 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఈ సీజన్ లో అన్ని మ్యాచులు ఆడించింది.
సన్ రైజర్స్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఉమ్రాన్ ఎప్పుడూ వమ్ము చేయలేదు. ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడిన ప్రతి మ్యాచ్ లో ఫాస్టెస్ట్ డెలివరీ మాలిక్ దే. ఆదివారం ముగిసిన ఐపీఎల్-15 లో అతడు.. 14 మ్యాచులలో 22 వికెట్లు తీశాడు.
ఐపీఎల్-15 లో ఉమ్రాన్ కు ఎస్ఆర్హెచ్ రిటెన్షన్ ద్వారా వచ్చిన డబ్బులను పక్కనబెడితే అతడు..మరో రూ. 29 లక్షలు అదనంగా పొందాడు. వాటి వివరాలు కింది విధంగా ఉన్నాయి.
ప్రతి మ్యాచ్ లో ఫాస్టెస్ట్ డెలివరీ ద్వారా ఉమ్రాన్ మాలిక్.. రూ. 14 లక్షలు (ఒక్కోటి రూ. 1 లక్ష) పొందాడు. ఇక రెండు సార్లు అత్యుత్తమ ప్రదర్శన (గుుజరాత్ టైటాన్స్ పై 5-25, పంజాబ్ కింగ్స్ పై 4-28) చేసినందుకు గాను రెండు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు సొంతం చేసుకున్నాడు. వీటికి తలా లక్ష. రూ. 14 లక్షలకు మరో రూ. 2 లక్షలు కలిపితే రూ. 16 లక్షలు
ఇవే గాక గుజరాత్, పంజాబ్ తో మ్యాచ్ లలో ప్రదర్శనకు గాను గేమ్ ఛేంజర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ల ద్వారా మరో రెండు లక్షలు పొందాడు. పంజాబ్ తో మ్యాచ్ లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా ఉమ్రాన్ నే వరించింది. దీనికి ఓ లక్ష. మొత్తంగా రూ. 3 లక్షలు
ఈ రూ. 3 లక్షలకు పైనున్న రూ. 16 లక్షలు కలిపితే మొత్తంగా రూ. 19 లక్షలు వచ్చాయి. వీటికి తోడు ఆదివారం ముగిసిన ఫైనల్ అనంతరం అతడికి ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు (రూ. 10 లక్షలు) దక్కాయి. మొత్తం కలిపితే రూ. 29 లక్షలు.
వీటితో పాటు మరో రూ. 10 లక్షలు కూడా వచ్చుండేవి. కానీ గుజరాత్-రాజస్తాన్ మ్యాచ్ లో లాకీ ఫెర్గూసన్ ఫాస్టెస్ట్ డెలివరీ (157.3 కి.మీ) విసరడంతో ఇది కాస్తా మిస్ అయింది. అంతకుముందు చెన్నైతో మ్యాచ్ లో ఉమ్రాన్.. 157 కి.మీ. వేగంతో బంతులు విసిరి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వేగవంతమైన రెండో బంతిని విసిరాడు. ఫైనల్ తర్వాత అది మూడో వేగవంతమైన బంతి అయింది.