- Home
- Sports
- Cricket
- అప్పుడు మిస్ అయ్యింది! ఈసారి వస్తున్నాం, కొడుతున్నాం... వరల్డ్ కప్‌పై ట్రెంట్ బౌల్ట్ కామెంట్..
అప్పుడు మిస్ అయ్యింది! ఈసారి వస్తున్నాం, కొడుతున్నాం... వరల్డ్ కప్‌పై ట్రెంట్ బౌల్ట్ కామెంట్..
పెద్దగా అంచనాలు లేకుండా ఐసీసీ టోర్నీల్లో అడుగుపెట్టి, ఫైనల్ దాకా దూసుకెళ్లడం న్యూజిలాండ్‌కి బాగా అలవాటు. 2015 వన్డే వరల్డ్ కప్‌లో, 2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో ఫైనల్ చేరినా... టైటిల్ గెలవలేకపోయింది న్యూజిలాండ్.. అయితే ఈసారి పక్కా టైటిల్ మాదే అంటున్నాడు న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్...

2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతుల్లో సూపర్ ఓవర్‌లో ఓడింది కివీస్. టైగా ముగిసిన మ్యాచ్‌లో ఫలితం తేల్చేందుకు సూపర్ ఓవర్‌ని నిర్వహించారు అంపైర్లు..
అయితే సూపర్ ఓవర్‌లో కూడా ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో న్యూజిలాండ్ కంటే ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లాండ్ జట్టు, విశ్వ విజేతగా నిలిచింది. అంతకుముందు 2015లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతుల్లో పరాజయం పాలైంది..
Image credit: Getty
ఫ్రాంఛైజీ క్రికెట్‌కి అందుబాటులో ఉండేందుకు వీలుగా న్యూజిలాండ్ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకున్న ట్రెంట్ బౌల్ట్, న్యూజిలాండ్ వరల్డ్ కప్ టీమ్‌లో ప్రధాన బౌలర్‌గా ఉండబోతున్నాడు. 2019 వరల్డ్ కప్ సెమీస్‌లోనూ టీమిండియా టాపార్డర్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు బౌల్ట్..
Trent Boult
‘వన్డే వరల్డ్ కప్ గెలవాలనేది మా అందరి కల. దీనికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. లాస్ట్ ఎడిషన్‌లో మేం ఫైనల్ దాకా వచ్చినా, టైటిల్ గెలవలేకపోయాం. అయితే అది మా ఆకలిని మరింత పెంచింది. ఈసారి నేను, వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాలని అనుకుంటున్నా..
అందంగా మెరిసిపోయే వరల్డ్ కప్ ట్రోఫీని ఎత్తుతున్నట్టు ఇప్పటికే కలలు కూడా కంటున్నా. గత వరల్డ్ కప్‌లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. అయితే ఆ అనుభవం ఎప్పటికీ మరిచిపోలేను. అప్పుడు మిస్ అయ్యింది, ఈసారి వస్తున్నాం, కప్పు కొడుతున్నాం..’ అంటూ కామెంట్ చేశాడు ట్రెంట్ బౌల్ట్..
2019 వన్డే వరల్డ్ కప్‌లో లూకీ ఫర్గూసన్ 8 మ్యాచుల్లో 18 వికెట్లు తీయగా, 9 మ్యాచుల్లో 17 వికెట్లు తీసిన ట్రెంట్ బౌల్ట్.. కీలకమైన విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వికెట్లు తీశాడు. అయితే ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్‌లో బౌల్ట్ వికెట్ తీయకపోగా 10 ఓవర్లలో 67 పరుగులు సమర్పించాడు..
Trent Boult
2021 టీ20 వరల్డ్ కప్‌లోనూ ఫైనల్ చేరిన న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతుల్లో ఓడింది. 2021 ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియా ఓడించి, 20 ఏళ్ల తర్వాత మొట్టమొదటి ఐసీసీ టైటిల్ సొంతం చేసుకుంది న్యూజిలాండ్...
2003 వన్డే వరల్డ్ కప్ తర్వాత ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్‌పై ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది టీమిండియా. 2019 వరల్డ్ కప్ సెమీస్‌లో న్యూజిలాండ్ చేతుల్లో ఓడిన భారత జట్టు, 2021 టీ20 వరల్డ్ కప్‌లోనూ సేమ్ సీన్ రిపీట్ చేసింది..