- Home
- Sports
- Cricket
- నాకు అవకాశం వస్తుందని నేను కూడా అనుకోలేదు... విండీస్ టూర్‌లో చోటు దక్కడంపై నవ్‌దీప్ సైనీ...
నాకు అవకాశం వస్తుందని నేను కూడా అనుకోలేదు... విండీస్ టూర్‌లో చోటు దక్కడంపై నవ్‌దీప్ సైనీ...
వెస్టిండీస్ టూర్‌లో టెస్టు సిరీస్‌కి ప్రకటించిన జట్టులో అందర్నీ ఆశ్చర్యపరిచిన పేరు నవ్‌దీప్ సైనీ. ఐపీఎల్ కూడా పెద్దగా కనిపించకుండా పోయిన నవ్‌దీప్ సైనీకి చోటు దక్కడంపై అతను కూడా ఆశ్చర్యం వ్యక్తం చేయడం విశేషం..

Navdeep Saini
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2020-21 టోర్నీలో టెస్టు ఎంట్రీ ఇచ్చిన నవ్‌దీప్ సైనీ, బ్రిస్బేన్ టెస్టులో గాయపడి రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ కూడా చేయలేదు. సిడ్నీ టెస్టులో 4 వికెట్లు తీసిన నవ్‌దీప్ సైనీ, బ్రిస్బేన్ టెస్టులో వికెట్లు తీయలేకపోయాడు..
Navdeep Saini
దాదాపు రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ టెస్టు టీమ్ నుంచి పిలుపు దక్కించుకున్నాడు నవ్‌దీప్ సైనీ. కౌంటీ ఛాంపియన్‌షిప్ ఆడేందుకు లండన్‌కి వెళ్లిన నవ్‌దీప్ సైనీ, టీమిండియా నుంచి పిలుపు రావడం విశేషం..
‘నేను కౌంటీ మ్యాచులు ఆడేందుకు లండన్‌కి వచ్చాను. ఇక్కడికి రాగానే ఎయిర్‌పోర్ట్‌లోనే వెస్టిండీస్ టూర్‌కి సెలక్ట్ అయినట్టు వార్త విన్నాను. నిజం చెప్పాలంటే నాకు అవకాశం వస్తుందని నేను కూడా అస్సలు ఊహించలేదు..
వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి నెట్ బౌలర్‌గా లేదా స్టాండ్ బై బౌలర్‌గా సెలక్ట్ అవుతానేమోనని ఐపీఎల్‌లో డ్యూక్ బాల్స్‌తో ప్రాక్టీస్ చేశాను... ఐపీఎల్‌లో కూడా పెద్దగా ఆడకపోవడంతో నాకు టీమ్‌లో చోటు దక్కడం నిజంగానే ఆశ్చర్యాన్ని కలిగించింది..
వెస్టిండీస్ టూర్‌కి పోవడానికి ముందు కౌంటీల్లో ఒక మ్యాచ్ ఆడతానని అనుకుంటున్నా. టెస్టులకు ముందు ఇక్కడ వేసే బౌలింగ్ మంచి ప్రాక్టీస్‌గా ఉపయోగపడుతుంది.. నిజానికి విండీస్ టూర్‌కి వెళ్లడం ఇది రెండోసారి..
ఇంతకుముందు ఓసారి వెస్టిండీస్ టూర్‌కి వెళ్లా, కానీ నాకు అవకాశం దక్కలేదు. ఈసారి ఛాన్స్ వస్తుందనే అనుకుంటున్నా. అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో, పరిస్థితుల గురించి కూడా నాకు అవగాహన ఉంది...’ అంటూ కామెంట్ చేశాడు భారత ఫాస్ట్ బౌలర్ నవ్‌దీప్ సైనీ..