- Home
- Sports
- Cricket
- ఇగోను వదిలేయ్.. లేకుంటే కష్టం.. ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ కు ఇర్ఫాన్ పఠాన్ సూచన
ఇగోను వదిలేయ్.. లేకుంటే కష్టం.. ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ కు ఇర్ఫాన్ పఠాన్ సూచన
TATA IPL 2022: ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో వంద లోపే ఐదు వికెట్లు కోల్పోయిన తరుణంలో క్రీజులోకి వచ్చిన ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ ఆదుకుంటాడనుకుంటే దారుణంగా విఫలమయ్యాడు.

ముంబై ఇండియన్స్ కు ఈ సీజన్ లో ఏదీ కలిసిరావడం లేదు. వరుసగా ఏడు మ్యాచులు ఓడిన ఆ జట్టు వైఫల్యాల కంటే ఆటగాళ్ల ఆటతీరు అభిమానులను ఎక్కువగా బాధిస్తున్నది. ముఖ్యంగా కోట్లకు కోట్లు పోసి దక్కించుకున్న రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, కీరన్ పొలార్డ్ ల వైఫల్యం ముంబై అభిమానులకు మింగుడుపడటం లేదు.
గతంలో మాదిరి ఆల్ రౌండర్ బాధ్యతలు పోషించకున్నా కేవలం బ్యాటర్ కే పరిమితమవుతున్న పొలార్డ్ అయితే అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు. గురువారం చెన్నై సూపర్ కింగ్స్ తో జరరిగిన కీలక మ్యాచ్ లో కూడా అతడు విఫలమయ్యాడు. ధోని-జడేజా పన్నిన వలలో అతడు చిక్కాడు. పొలార్డ్ వీక్ నెస్ తెలిసిన ఈ ద్వయం.. అతడిని బుట్టలో వేసేందుకు మాస్టర్ ప్లాన్ వేసింది.
తన ఇగో కారణంగానే పొలార్డ్ వరుస మ్యాచుల్లో విఫలమవుతున్నాడని అది వదిలిపెట్టనంత కాలం అతడు రాణించడని క్రికెట్ పండితులు, ముంబై ఫ్యాన్స్ సూచిస్తున్నారు.
తాజా ఇదే విషయమై భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ.. ‘స్ట్రెయిట్ షాట్లు ఆడటం పొలార్డ్ బలం. అయితే దానినే బలహీనతగా మార్చుకుంది సీఎస్కే. పొలార్డ్ తప్పకుండా అక్కడికే కొడతాడని భావించి.. దూబేను అక్కడ ఫీల్డర్ గా పెట్టాడు ధోని. ఈ సమయంలో పొలార్డ్ కాస్త ఆచితూచి ఆడాల్సింది.
కానీ పొలార్డ్ మాత్రం వెనక్కి తగ్గలేదు. ధోని ఫీల్డ్ చేసిన మాదిరిగానే స్ట్రెయిట్ కు భారీ షాట్ కు యత్నించినా.. అది వెళ్లాల్సిన గమ్యం చేరలేదు. తీరా వెళ్లి దూబే చేతులలో పడింది. దీంతో పొలార్డ్ భారీ మూల్యం చెల్లించక తప్పలేదు..’ అని చెప్పుకొచ్చాడు.
85 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన క్రమంలో క్రీజులోకి వచ్చిన పొలార్డ్ ఆఖర్లో ఫినిషర్ అవతారం ఎత్తుతాడని, ముంబై కి భారీ స్కోరు అందిస్తాడని అంతా ఊహించారు. అయితే పొలార్డ్ మాత్రం 14 పరుగులే చేసి ఔటయ్యాడు.
అతడిని ఔట్ చేసేందుకు ధోని.. ప్రత్యేకంగా ఫీల్డ్ సెట్ చేశాడు. మహేశ్ తీక్షణ బౌలింగ్ లో వేసిన క్యారమ్ బాల్ ను పొలార్డ్.. భారీ హిట్టింగ్ కు దిగాడు. కానీ అది కాస్తా డీప్ లో ఉన్న శివమ్ దూబే చేతుల్లో పడింది. అంతకుముందే దూబే ను అక్కడే ఉంచి తీక్షణ తో దూబే వైపు కొట్టేలా బంతి వేయించాడు ధోని. అతడికి కౌంటర్ ఇవ్వాలని పొలార్డ్ చూసినా అది బెడిసికొట్టింది.
పొలార్డ్ ఇలా తన ఇగో తో గతంలో కూడా ఓసారి వికెట్ సమర్పించుకున్నాడు. 2010 ఐపీఎల్ ఫైనల్లో.. సీఎస్కేతో మ్యాచ్ లో పొలార్డ్ ను ఇలాగే ఔట్ చేయించాడు ధోని. మిడాఫ్ లో మాథ్యూ హెడెన్ ను ఫీల్డర్ గా పెట్టి మోర్నీ మోర్కెల్ చేత అటువైపే బంతిని విసిరమని చెప్పాడు.
మోర్కెల్ అదే చేశాడు. ఫలితంగా పొలార్డ్ కొట్టిన బంతి హెడెన్ చేతుల్లో పడింది. ఈ మ్యాచ్ లో సీఎస్కే.. 22 పరుగుల తేడాతో విజయం సాధించి టైటిల్ ఎగరేసుకుపోయింది.