భారత్ vs ఇంగ్లాండ్ సిరీస్ పూర్తి షెడ్యూల్, స్క్వాడ్స్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవిగో
India vs England: ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు ఇంగ్లాండ్ తో ఆడే సిరీస్ భారత్ కు చాలా కీలకం. ఇంగ్లాండ్ తో జరిగే టీ20, వన్డే సిరీస్‌లకు భారత జట్టును ఇంకా ప్రకటించనప్పటికీ, బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, సెలక్షన్ కమిటీ త్వరలో నిర్ణయం తీసుకోనుంది.
India vs England: భారత క్రికెట్ జట్టు 2025లో చాలా ముఖ్యమైన సిరీస్‌లు ఆడనుంది. ఆ జట్టు తొలి సిరీస్ ఇంగ్లండ్‌తో ఆడనుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత జట్టుకు ఈ సిరీస్ చాలా కీలకమైందని చెప్పాలి. జనవరి 22 నుంచి ఇంగ్లాండ్ తో భారత్ 5 మ్యాచ్‌ల టీ20, మూడు వన్డేల సిరీస్ ఆడనుంది.
2025 ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఈ వన్డే సిరీస్ భారత్‌కు చాలా కీలకం కానుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడిన ఆటగాళ్లకు ఈ సిరీస్‌లో అవకాశం కల్పించవచ్చని, ఈ సిరీస్‌లో ప్రదర్శన ఆధారంగా భారత జట్టును ఎంపిక చేయవచ్చనే చర్చ సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సెలక్షన్ కమిటీ పూర్తి దృష్టి ఈ సిరీస్ పైనే ఉండే అవకాశముంది.
ఇంగ్లాండ్ సిరీస్ కోసం భారత జట్టులో సీనియర్ ప్లేయర్లకు చోటు దక్కేనా?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు ఇంగ్లాండ్ తో ఆడే సిరీస్ భారత్ కు చాలా కీలకమైందని చెప్పాలి. ఇంగ్లాండ్ తో జరిగే టీ20, వన్డే సిరీస్‌లకు భారత జట్టును ఇంకా ప్రకటించనప్పటికీ, బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, సెలక్షన్ కమిటీ త్వరలో జట్టును ప్రకటించనుంది.
అయితే, ఇటీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత ఆటగాళ్లు పరుగులు చేయడంలో చాలా ఇబ్బందిపడ్డారు. దీంతో ఆసీస్ చేతిలో ఘోరంగా ఓడిపోయి సిరీస్ ను కోల్పోయారు. మరీ ముఖ్యంగా సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఆశించిన స్థాయిలో ప్రదర్శనలు ఇవ్వలేకపోయారు. ఇంగ్లాండ్ తో జరిగే సిరీస్ లో వీరు జట్టులో ఉంటారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.
భారత్-ఇంగ్లాండ్ మధ్య టీ20 సిరీస్ పూర్తి షెడ్యూల్
భారత జట్టు 22 జనవరి 2025న కోల్‌కతాలో ఇంగ్లాండ్‌తో తన మొదటి T20 మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:00 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ ఇంగ్లండ్ భారత పర్యటన ఇరు జట్లకు ఎంతో కీలకం. ఈ సిరీస్ లో రెండో టీ20 మ్యాచ్ జనవరి 25న చెన్నైలో, మూడో టీ20 మ్యాచ్ జనవరి 28న రాజ్ కోట్ లో, నాలుగో టీ20 మ్యాచ్ జనవరి 31న పుణెలో జరుగుతుంది.
ఇక ఈ సిరీస్ లో చివరి, ఐదో టీ20 మ్యాచ్ ఫిబ్రవరి 2న ముంబైలో జరుగుతాయి. అయితే టీ20 సిరీస్ కు భారత జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఉండరు. ఇప్పటికే వీరు పొట్టి ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా కొనసాగనున్నాడని సమాచారం.
India vs England
భారత్-ఇంగ్లాండ్ వన్డే సిరీస్ పూర్తి షెడ్యూల్
ఇంగ్లాండ్ తో భారత క్రికెట్ జట్టు మూడు వన్డేల సిరీస్‌ను కూడా ఆడనుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఈ సిరీస్ చాలా ముఖ్యమైనదని చెప్పాలి. ఫిబ్రవరి 6న నాగ్‌పూర్‌లో భారత్ తొలి వన్డే ఆడనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో మ్యాచ్ ఫిబ్రవరి 9న కటక్‌లో, ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 12న అహ్మదాబాద్‌లో జరగనుంది.
దీని తర్వాత భారత జట్టు ఫిబ్రవరి 14 లేదా 15న దుబాయ్‌కి వెళ్లే ఛాన్స్ ఉంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో భారత జట్టు తన మొదటి ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ ఆడుతుంది. అలాగే, భారత జట్టు ఫిబ్రవరి 23న ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌తో ఆడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంగ్లండ్‌తో జరిగే ఈ సిరీస్ భారత జట్టుకు చాలా కీలకం.
భారత పర్యటనకు ఇంగ్లండ్ టీ20 జట్టు:
హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, జాకబ్ బెథెల్, లియామ్ లివింగ్‌స్టోన్, రెహాన్ అహ్మద్, జామీ ఓవర్‌టన్, బ్రైడన్ కార్సే, జోస్ బట్లర్, జామీ స్మిత్, ఫిలిప్ సాల్ట్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, సాకిబ్ మహమూద్
లైవ్ టెలికాస్ట్ - స్ట్రీమింగ్ వివరాలు
భారత్ vs ఇంగ్లండ్ టీ20 సిరీస్‌కి సంబంధించి టాస్ సాయంత్రం 6:30 గంటలకు IST ప్రారంభమవుతుంది. మ్యాచ్ లు రాత్రి 7:00 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఇండియా vs ఇంగ్లండ్ T20 సిరీస్ భారతదేశంలోని స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అలాగే, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంటుంది.