- Home
- Sports
- Cricket
- ప్రాక్టీస్ కంటే పార్టీలకు ఎక్కువ వెళ్లేవాడు.. అందుకే అతడిని తీసేశాం: సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్
ప్రాక్టీస్ కంటే పార్టీలకు ఎక్కువ వెళ్లేవాడు.. అందుకే అతడిని తీసేశాం: సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్
Virender sehwag about David Warner: టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. తన సహచర ఆటగాడు డేవిడ్ వార్నర్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. అతడు ప్రాక్టీస్ కంటే పార్టీలకు ఎక్కువ వెళ్లేవాడని వ్యాఖ్యానించాడు.

ఐపీఎల్ లో తన 2009 నుంచి 2013 వరకు ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున ఆడాడు డేవిడ్ వార్నర్. ఆ సమయంలో ఢిల్లీకి వీరేంద్ర సెహ్వాగ్ కెప్టెన్ గా పనిచేశాడు. 2009 లో సెహ్వాగ్ తో పాటు వార్నర్ ఓపెనింగ్ చేసేవాడు.
అయితే జట్టులో చేరిన కొత్తలో వార్నర్ ప్రవర్తన మిగిలిన ఆటగాళ్ల కంటే భిన్నంగా ఉండేదని వీరూ చెప్పుకొచ్చాడు. అతడు జట్టు ప్రాక్టీస్ సెషన్ల కంటే పార్టీలకు ఎక్కువ వెళ్లేవాడని వీరూ అన్నాడు.
తాజాగా ఓ క్రీడా ఛానెల్ తో వీరూ మాట్లాడుతూ.. ‘నేను ఢిల్లీకి కెప్టెన్ గా ఉన్నప్పుడు సారథిగా ఉండే ఒత్తిడితో కొంత మంది ఆటగాళ్లపై అరిచేవాడిని. వాళ్లలో వార్నర్ కూడా ఒకడు.
అతడు కొత్తగా జట్టులోకి వచ్చినప్పుడు ప్రాక్టీస్ సెషన్స్ కు రావడం మ్యాచులు ఆడటం కంటే పార్టీలకే ఎక్కువ వెళ్తుండేవాడు. అంతేగాక మొదటి సంవత్సరం (2009) లో అతడు మా జట్టుకు చెందిన ఒకరిద్దరితో వ్యక్తిగత గొడవకూ దిగాడు.
<p>Virender Sehwag</p>
దాంతో అందుకే అతడిని వెనక్కి పంపించాం. ఆ సీజన్ లో ఢిల్లీ ఆడిన చివరి రెండు మ్యాచులలో వార్నర్ ను ఆడించలేదు. ఒక్కోసారి ఇలా జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఆటగాళ్లకు గుణపాఠం చెప్పాలంటే ఇలా చేయక తప్పదు.
అతడు (వార్నర్) జట్టులోకి కొత్తగా వచ్చాడు. అతడేం జట్టుకు ప్రత్యేకమైన వ్యక్తి కాదు.. ఇతరులలాగే ఒక ఆటగాడు మాత్రమే అని అతడికి తెలిసేలా చేసేందుకే అలా చేశాం. అతడు లేకున్నా మాకు మ్యాచులు గెలవడానికి మిగతా ఆటగాళ్లు కూడా ఉన్నారు. మేము గెలిచి చూపించాం..’ అని చెప్పుకొచ్చాడు.
2009 నుంచి 2013 వరకు ఢిల్లీ డేర్ డెవిల్స్ తో ఉన్న వార్నర్.. 2014 నుంచి 2021 వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ లో భాగమయ్యాడు. ఇక మళ్లీ 2022 వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ కే వెళ్లాడు. తాజాగా సన్ రైజర్స్ తో ఇటీవలే ముగిసిన మ్యాచ్ లో 92 పరుగులతో నాటౌట్ గా నిలవడమే గాక తన మాజీ జట్టుపై ప్రతీకారం కూడా తీర్చుకోవడం గమనార్హం.