MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Sports
  • Cricket
  • భారత క్రికెటర్లంటే దేశవాళీలో వందల మ్యాచ్‌లు ఆడి వస్తారు.. మనకు అలా కాదుగా.. పాక్ మాజీ సారథి కామెంట్స్

భారత క్రికెటర్లంటే దేశవాళీలో వందల మ్యాచ్‌లు ఆడి వస్తారు.. మనకు అలా కాదుగా.. పాక్ మాజీ సారథి కామెంట్స్

టీ20 ప్రపంచకప్ లో సంచలన ప్రదర్శనలతో ప్రత్యర్థుల ప్రశంసలు కూడా అందుకుంటున్న టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా అతడిపై పాకిస్తాన్ మాజీ సారథి షాహిద్ అఫ్రిది కూడా  ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

2 Min read
Author : Srinivas M
Published : Nov 08 2022, 03:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టీమిండియాలోకి ఇప్పుడు చోటు దక్కించుకోవడం ఎంత కష్టమో ఔత్సాహిక క్రికెటర్లకు తెలుసు.  దేశవాళీలో టన్నుల కొద్ది పరుగులు చేసినా జాతీయ జట్టులోకి అవకాశం రానివాళ్లు చాలామంది ఉన్నారు. ఐపీఎల్ పుణ్యమా అని  ఆ లీగ్ లో మెరిసినా జాతీయ జట్టులో రాణించక తిరిగి మళ్లీ దేశవాళీకే పరిమితమైనవాళ్లూ ఉన్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అయితే ఒకసారి కుదురుకుని.. వరుసగా మెరుగైన ప్రదర్శనలతో నిలకడగా ఆడితే మాత్రం వారికి తిరుగుండదు. అలా వచ్చిన వారిలో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఒకడు. గడిచిన ఏడాది కాలంగా అత్యంత  భీకరమైన ఫామ్ లో ఉన్న  సూర్య తాజాగా టీ20 ప్రపంచకప్ లో రాణిస్తున్నాడు. 

36

సూర్య ఆటపై పాకిస్తాన్ మాజీ సారథి, ఆ జట్టుకు ఆల్ రౌండర్ గా సేవలందించిన షాహిద్ అఫ్రిది తాజాగా  స్పందించాడు. భారత ఆటగాళ్ల మాదిరిగా  పాకిస్తాన్ క్రికెటర్లు దేశవాళీలో  రాణించడం తక్కువని.. సూర్య ఆట చూస్తేనే అది అర్థమవుతుందని చెప్పాడు. 

46

పాకిస్తాన్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..  తాను తన గేమ్ ప్లాన్ ను మార్చుకోనని, అలా చేస్తే ప్రత్యర్థులకు తాను దొరికిపోతానని త్వరగా ఔట్ అవ్వాల్సి వస్తుందని  కామెంట్స్ చేశాడు. దీనికి కౌంటర్ గా పాకిస్తాన్ కు చెందని సామా టీవీతో అఫ్రిది మాట్లాడుతూ.. ‘అవును. వాళ్లు (ఇండియా) జాతీయ జట్టులోకి రాకముందు కనీసం రెండు వందల వరకు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడి  వస్తారు. 
 

56

జాతీయ జట్టులోకి రాకముందు సూర్య కూడా వందలాది దేశవాళీ మ్యాచ్ లు ఆడి  అంతర్జాతీయ క్రికెట్ లోకి వచ్చాడు. తన ఆటేంటో అతడికి తెలుసు.  మంచి బంతులను కూడా షాట్లు ఆడగల సమర్థుడు అతడు. ఎందుకంటే ఇంతకముందే దేశవాళీలో అతడు అలాంటి షాట్లు వందలాదిగా ఆడి ఉంటాడు. 

66

టీ20లలో ఒకే తీరుగా ఆడుతానంటే కుదరదు. ఆటకు తగ్గట్టుగా మనను మనం మలుచుకోవాలి. కొత్త షాట్లను ఆడాలి...’అని రిజ్వాన్ కు చురకలంటించాడు. ఈ  టోర్నీ కి ముందు రిజ్వాన్, సూర్య ఐసీసీ నెంబర్ వన్ ర్యాంకు కోసం పోటీ పడ్డారు. కానీ సూర్య  నిలకడగా రాణించి నెంబర్ వన్ కు చేరుకోగా రిజ్వాన్ మాత్రం  వరుసగా విఫలమై  విమర్శల పాలవుతున్నాడు. 

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Recommended image2
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Recommended image3
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved