MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • అతడు భారత్ తరఫున ఆడతాడు.. కానీ ఇప్పుడే కాదు.. ఇంకా సానబెట్టాలి : ఎస్ఆర్హెచ్ బౌలర్ పై మాజీ క్రికెటర్ కామెంట్స్

అతడు భారత్ తరఫున ఆడతాడు.. కానీ ఇప్పుడే కాదు.. ఇంకా సానబెట్టాలి : ఎస్ఆర్హెచ్ బౌలర్ పై మాజీ క్రికెటర్ కామెంట్స్

Umran Malik: ఈ ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున  అత్యంత వేగంతో  బంతులు విసురుతూ సంచలన ప్రదర్శనలు  నమోదు చేసిన ఉమ్రాన్ మాలిక్ పై  టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కామెంట్స్ చేశాడు. 

2 Min read
Author : Srinivas M
Published : May 13 2022, 03:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

వరుసగా 12 మ్యాచుల నుంచి  గంటకు 150 కిలోమీటర్ల కంటే వేగంగా బంతులు విసురుతూ  ప్రత్యర్థులను తన వేగంతో కట్టడి  చేస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ను భారత జట్టులోకి తీసుకోవాలని దిగ్గజ క్రికెటర్  సునీల్ గవాస్కర్ వంటి ప్రముఖ ఆటగాళ్లు కోరుతున్న విషయం తెలిసిందే. 

29

అయితే సన్నీ వ్యాఖ్యలకు భిన్నంగా స్పందించాడు  మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా మాత్రం అందుకు విరుద్ధంగా వ్యాఖ్యానించాడు.  అతడు  మెరుగైన ఆటగాడే అని కానీ ఇప్పుడే భారత జట్టులోకి తీసుకోవడం అంటే కష్టమని అన్నాడు. 

39

తాజాగా  ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చోప్రా మాట్లాడుతూ..‘ఉమ్రాన్ మాలిక్ ను ఇప్పుడే టీమిండియాలోకి ఎంపిక చేయడం తొందరపాటు చర్య.  అతడు నిలకడగా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తుండొచ్చు... 

49

అదే మనందర్నీ అతడిని భారత జట్టులోకి తీసుకోవాలనే ఉత్సాహం   వస్తుండొచ్చు. కానీ అతడింకా కుర్రాడే. ఇప్పుడే నేర్చుకుంటున్నాడు.  అతడు భారత జట్టు తరఫున ఆడే రోజులు భవిష్యత్ లో ఉన్నాయి. కానీ ఇప్పుడైతే కాదు.  అందుకు అతడు ఇంకా సిద్ధమవలేదు. 

59

గత మూడు మ్యాచులుగా విఫలమవుతున్నాడని నేను చెప్పడం లేదు.  సీజన్ ముందునుంచీ  అతడిని చూస్తున్నాను కాబట్టే ఇలా చెబ్తున్నా..’ అని వ్యాఖ్యానించాడు. 

69

ఇటీవల మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్  కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ‘నా అభిప్రాయం ప్రకారం ఉమ్రాన్ మాలిక్  తాజా ప్రదర్శనలను పరిగణనలోకి తీసుకని  అతడిని జాతీయ జట్టులోకి తీసుకోకూడదు. ఒక పద్ధతి ప్రకారం తీసుకురావాలి. 

79

ఇప్పుడే అతడిని  అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకువస్తే.. ఒకవేళ అక్కడ ఉమ్రాన్ విఫలమైతే  అది మొదటికే మోసం.  జాతీయ జట్టులో అతడు రాణించకుంటే తిరిగి మళ్లీ అతడిని మనం అంతర్జాతీయ స్థాయిలో చూడటం కష్టమయ్యే ప్రమాదముంది..’ అని తెలిపాడు 

89
Umran-Malik-Dale Steyn

Umran-Malik-Dale Steyn

కాగా.. ఈ సీజన్ లో హైదరాబాద్ తరఫున 11 మ్యాచులాడిన ఉమ్రాన్ మాలిక్ 15 వికెట్లు పడగొట్టాడు. తొలి 8 మ్యాచులలో  అతడు అద్భుత ప్రదర్శనలిచ్చాడు. గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో 5 వికెట్ల ప్రదర్శన చేశాడు.  కానీ ఆ తర్వాత నాలుగు మ్యాచుల్లో విఫలమవుతున్నాడు.  భారీగా పరుగులిచ్చుకుంటూ లైన్ అండ్ లెంగ్త్ కోల్పోయాడు. 

99

తాను ఆడిన 11 మ్యాచుల్లో  ఫాస్టెస్ట్ డెలివరీ ఉమ్రాన్  మాలిక్ దే కావడం గమనార్హం. అయితే గత నాలుగు మ్యాచులుగా అతడు ఫామ్ కోల్పోయి వికెట్లు తీయడానికి ఇబ్బందులు పడుతున్నాడు. వేగాన్ని మాత్రమే నమ్ముకుని లైన్ అండ్ లెంగ్త్ ను మిస్ అవుతున్నాడు. తర్వాతి మ్యాచ్ లలో అయినా అతడు రాణిస్తాడేమో చూడాలి మరి.. 

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
Sanju Samson: సంజూ శాంసన్ దెబ్బకు ఐసీసీ షేక్
Recommended image2
T20 World Cup 2026 : ఫైనల్ చేరే ఆ రెండు జట్లు ఇవే.. టీమిండియా సంగతేంటి?
Recommended image3
IND vs ENG : ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్ యుద్ధం.. భారత్ కు తలనొప్పిగా నలుగురు ప్లేయర్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved