- Home
- Sports
- Cricket
- Virat kohli: అలా ఔటైనందుకు చిరాకుతో హోటల్ లో కూర్చుని ఉంటాడు.. విరాట్ పై షాన్ పొలాక్ కామెంట్స్
Virat kohli: అలా ఔటైనందుకు చిరాకుతో హోటల్ లో కూర్చుని ఉంటాడు.. విరాట్ పై షాన్ పొలాక్ కామెంట్స్
India Vs South Africa: రెండేండ్లుగా సెంచరీ చేయలేక తంటాలు పడుతున్న భారత టెస్టు జట్టు సారథి విరాట్ కోహ్లి.. దక్షిణాఫ్రికాలో ఆ లోటును పూడ్చుతాడని అభిమానులతో పాటు క్రికెట్ పండితులు కూడా విశ్లేషించారు. కానీ కోహ్లి మాత్రం...

సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు మొదటి రోజు ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్ ల సెంచరీ భాగస్వామ్యానికి తోడు మిడిలార్డర్ లో విరాట్ కోహ్లీ, అజింక్య రహానే లు నిలకడగా ఆడారు.
అయితే రెండేండ్లుగా సెంచరీ లేక తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విరాట్.. ఈ టెస్టులో ఆ లోటును పూడ్చుతాడని అతడి అభిమానులతో పాటు క్రికెట్ పండితులు కూడా విశ్లేషణ చేశారు.
కానీ కోహ్లి మాత్రం 35 పరుగులకే వెనుదిరిగాడు. 94 బంతులాడిన కోహ్లి.. క్రీజులో కుదురుకున్నట్టే అనిపించినా అనవసర షాట్ ఆడి ఎంగిడి బౌలింగ్ లో మల్డర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
అయితే ఇలా ఔటవడంపై కోహ్లి కూడా తీవ్ర నిరాశ చెంది ఉంటాడని దక్షిణాఫ్రికా మాజీ పేసర్, దిగ్గజ ఆటగాడు షాన్ పొలాక్ అన్నాడు. సాఫీగా సాగుతున్న కోహ్లి ఇన్నింగ్సుకు అలా ఎండ్ కార్డ్ పడుతుందని తాను కూడా ఊహించి ఉండడని చెప్పుకొచ్చాడు.
పొలాక్ మాట్లాడుతూ.. ‘అతడెలా ఔట్ అయ్యాడో చూడండి. మంచి టచ్ లో ఉన్నాడు. బాగా ఆడుతున్నాడు. క్రీజులో కుదురుకున్నాడు కూడా.. అంతా బాగానే ఉంది విరాట్ ఇక భారీ స్కోరు చేస్తాడని అందరూ అనుకున్నారు.
కానీ 35 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. భారీ స్కోరు చేస్తాడనుకుంటున్న తరుణంలో అలా ఔటవడంతో చూస్తున్నవాళ్లే కాదు.. కోహ్లీ కూడా తీవ్ర నిరాశ పడి ఉంటాడు.
తాను (కోహ్లి) ఔట్ అయిన తీరును అతడు కూడా జీర్ణించుకోలేక కోపం, ఫ్రస్టేషన్ తో హోటల్ గదికి వెళ్లి ఒంటరిగా కూర్చున్నాడేమో...’ అని పొలాక్ చెప్పాడు.
కాగా.. సెంచూరియన్ లో తొలి రోజు పూర్తి ఆధిపత్యం భారత్ దే. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (60) కు తోడు కెఎల్ రాహుల్ (122 నాటౌట్) ల కు తోడు విరాట్ కోహ్లి (35), అజింక్య రహానే (40 నాటౌట్) మెరుగ్గా ఆడారు. ఛతేశ్వర్ పుజారా గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు.