MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Hardik Pandya Net Worth : పాండ్యా బ్రదర్స్‌లో ఎవరు రిచ్..? అన్ననా, తమ్ముడా?

Hardik Pandya Net Worth : పాండ్యా బ్రదర్స్‌లో ఎవరు రిచ్..? అన్ననా, తమ్ముడా?

కొన్నేళ్ల క్రితం వడోదరలోని ఓ చిన్న అపార్ట్‌మెంట్‌లో ఈ ఇద్దరు బ్రదర్స్ కలిసే కలలు కన్నారు.. వాళ్ల క్రికెట్ టాలెంట్ భారతదేశంలోనే అత్యంత సంపన్న సోదరుల్లో ఒకరిగా నిలబెట్టింది. ఇండియన్ క్రికెటర్స్ హార్దిక్, కృనాల్ పాండ్యా ప్రయాణం ఓ సినిమా కథలాంటిది.

3 Min read
Author : Arun Kumar P
Published : Apr 23 2026, 12:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
పాండ్యా సోదరులలో ఎవరు రిచ్..?
Image Credit : insta/Hardik Pandya

పాండ్యా సోదరులలో ఎవరు రిచ్..?

పాండ్యా సోదరులు… క్రికెట్ ప్రియులకు వీరిగురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఇండియన్ క్రికెట్లో కొనసాగుతున్న అన్నాదమ్ములు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా. గుజరాత్ లోని వడోదర పట్టణంలో ఓ సాధారణ కుటుంబంలో పుట్టిపెరిగిన ఈ సోదరులు ఎంతో కష్టపడి స్టార్ క్రికెటర్లుగా ఎదిగారు. ఇద్దరూ అద్భుతమైన కెరీర్‌లను నిర్మించుకున్నప్పటికీ, వాళ్ల ఆర్థిక లెక్కలు చూస్తే ఒకరు స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నారు.

26
హార్దిక్ పాండ్యా నెట్ వర్త్
Image Credit : ANI

హార్దిక్ పాండ్యా నెట్ వర్త్

భారతదేశపు ప్రీమియర్ ఆల్ రౌండర్లలో ఒకరైన హార్దిక్ పాండ్యా ఆస్తి విలువ చాలా ఎక్కువ. 2026 నాటికి అతని సంపద రూ.90 కోట్ల నుంచి రూ.150 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. అతడు చాలా లగ్జరీ లైఫ్ ను గడుపుతుంటాడు… ఖరీదైన కార్లు, వాచీలు వాడుతుంటాడు. 

హార్దిక్ ఆదాయ మార్గాలు :

ఐపీఎల్ జీతం : ఏటా సుమారు రూ.16.35 కోట్లు

 బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ : రూ.5 కోట్లు 

బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు : ఒక్కో డీల్‌కు రూ.2-3 కోట్లు

హార్దిక్ ఆస్తిపాస్తులు :

హార్దిక్ వద్ద లంబోర్ఘిని, రోల్స్ రాయిస్ వంటి లగ్జరీ కార్లు, ముంబైలో దాదాపు రూ.30 కోట్ల విలువైన ప్రీమియం అపార్ట్‌మెంట్ ఉన్నాయి. అతని భారీ బ్రాండ్ విలువ, సోషల్ మీడియా ఫాలోయింగ్ సంపాదనను మరింత పెంచుతున్నాయి.

Related Articles

Related image1
Hardik Pandya : హార్దిక్-నటాషా మళ్లీ ఒక్కటవుతున్నారా..? అత్తవారింట్లో మాజీ కోడలు సందడి
Related image2
Hardik: ఒకపక్క డేటింగ్.. మరోపక్క మాజీ భార్యకు ఖరీదైన గిఫ్ట్.. హార్దిక్ పాండ్యా రచ్చ!
36
 కృనాల్ పాండ్యా నెట్ వర్త్
Image Credit : Insta/Hardik Pandya

కృనాల్ పాండ్యా నెట్ వర్త్

హార్దిక్ అన్న కృనాల్ పాండ్యా కూడా మంచి ఆస్తులు సంపాదించాడు… కానీ తమ్ముడితో పోలిస్తే ఇతడి ఆదాయం, ఆస్తులు తక్కువే అని చెప్పవచ్చు. 2026 నాటికి కృనాల్ నికర ఆస్తి విలువ రూ.70-80 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. 

కృనాల్ ఆదాయ వనరులు : 

ఐపీఎల్ జీతం : సుమారు రూ.5.75 కోట్లు 

 ఎండార్స్‌మెంట్లు : ఏటా రూ.1-3 కోట్లు

కృనాల్ ఇతర వ్యాపారాలు, ఆర్థిక ఆస్తులలో కూడా పెట్టుబడులు పెట్టాడు. దీంతో క్రికెట్ కాకుండా ఇతర మార్గాల్లోనూ సంపాదను పెంచుకుంటున్నాడు. గతంలొ టీమిండియాలో ఆడినా ప్రస్తుతం అతడికి జట్టులో చోటు లేదు… అందుకే క్రికెట్ ద్వారా సంపాదన తక్కువగా ఉంది.

46
పాండ్యా బ్రదర్స్ ఫ్యామిలి బ్యాగ్రౌండ్
Image Credit : Insta/Hardik Pandya

పాండ్యా బ్రదర్స్ ఫ్యామిలి బ్యాగ్రౌండ్

పాండ్యా సోదరులు గుజరాత్‌లోని ఓ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు. వాళ్ల నాన్న హిమాన్షు పాండ్యా పిల్లల క్రికెట్ కలల కోసం ఎంతో కష్టపడ్డారు. వాళ్లకు మంచి అవకాశాలు కల్పించడానికి ఊరు కూడా మారారు. 

దేశవాళీ క్రికెట్, ఐపీఎల్‌లో స్టార్స్ కాకముందు వాళ్లు ఓ చిన్న అపార్ట్‌మెంట్‌లో ఆర్థిక ఇబ్బందులతో గడిపారు. ఐపీఎల్ 2026 సమయంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని పుకార్లు వచ్చినా, తమ బంధం చాలా బలమైనదని ఇద్దరూ చాలాసార్లు చెప్పారు.

లైఫ్‌స్టైల్, లగ్జరీ విషయంలో హార్దిక్ స్పష్టంగా ముందున్నాడు: అతని వద్ద ఎన్నో లగ్జరీ కార్లు, ఖరీదైన ఆస్తులు ఉన్నాయి. అతని ఫిట్ పర్సనాలిటీ వల్ల ఎక్కువ బ్రాండ్ డీల్స్ వస్తాయి. మరోవైపు కృనాల్ పెట్టుబడులపై ఎక్కువ దృష్టి పెడతాడు. అతని ఆర్థిక ప్రణాళిక చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది. అందుకే అతనికి పెద్దగా బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు ఉండవు.

56
సంపన్న క్రికెట్ బ్రదర్స్..
Image Credit : Getty

సంపన్న క్రికెట్ బ్రదర్స్..

నికర ఆస్తి విలువ విషయానికి వస్తే కృనాల్ పాండ్యా కంటే హార్దిక్ పాండ్యానే చాలా ధనవంతుడు. అతని అధిక ఐపీఎల్ జీతం, అంతర్జాతీయ క్రికెట్ కెరీర్, బలమైన బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు అతనికి ఆర్థికంగా పెద్ద ప్లస్ అయ్యాయి. ఏదేమైనా ఈ ఇద్దరు సోదరులు భారతదేశంలో అత్యంత విజయవంతమైన క్రికెటింగ్ సిబ్లింగ్స్‌గా నిలిచారు. టాలెంట్, పట్టుదల, కుటుంబ సపోర్ట్ ఉంటే కలలను ఎలా నిజం చేసుకోవచ్చో వీళ్లు నిరూపించారు.

66
పాండ్యా బ్రదర్స్ లైఫ్ స్టైల్..
Image Credit : Insta/Hardik Pandya

పాండ్యా బ్రదర్స్ లైఫ్ స్టైల్..

 హార్దిక్ పాండ్యా కార్ కలెక్షన్

ఇక్కడే వాళ్ల పర్సనాలిటీలు బయటపడతాయి. హార్దిక్‌కి స్పీడ్, స్టైల్ అంటే ఇష్టం. అతని గ్యారేజీలో ఫెరారీ, లంబోర్ఘిని ఉరుస్, రోల్స్ రాయిస్ వంటి కార్లు ఉన్నాయి. వీటి మొత్తం విలువ సుమారు రూ.25 కోట్లు.

కృనాల్ పాండ్యా కార్ కలెక్షన్

కృనాల్ క్లాసీగా, ప్రాక్టికల్‌గా ఆలోచిస్తాడు. అతని వద్ద మెర్సిడెస్-బెంజ్ జీఎల్ఎస్, ఆడి ఏ6, టయోటా వెల్‌ఫైర్ ఉన్నాయి. అతని కార్ల కలెక్షన్ విలువ సుమారు రూ.8 కోట్లు.

ఆస్తిపాస్తుల్లో తేడాలున్నా, ఇద్దరూ కలిసి ఓ పెద్ద ఆస్తిని పంచుకుంటున్నారు. బాంద్రాలో 6,000 చదరపు అడుగుల పెంట్‌హౌస్‌లో కలిసి ఉంటున్నారు. దీని విలువ రూ.30 కోట్లు. ఇందులో ప్రైవేట్ థియేటర్, జిమ్, పెద్ద బాల్కనీ వంటివి ఉన్నాయి. అలాగే వడోదరలో కూడా వీరికి ఒక అందమైన బంగ్లా ఉంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రికెట్
క్రీడలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Abhishek Sharma : ఈ శర్మకు బౌలింగ్ చేయడం ఆ ప్లేయర్ల కర్మ..! 20 బంతుల్లో సెంచరీ ఏంటి సామీ..!!
Recommended image2
Mumbai Indians: ముంబైకి ఊపిరిపోసిన తెలుగోడు.! కల్ట్ కంబ్యాక్‌తో మిగిలిన జట్లకు పెద్ద వార్నింగ్..
Recommended image3
T20ల్లో భారత్ తరఫున అత్యధిక సెంచరీ వీరులు వీరే.. కోహ్లీని దాటేసిన అభిషేక్ శర్మ
Related Stories
Recommended image1
Hardik Pandya : హార్దిక్-నటాషా మళ్లీ ఒక్కటవుతున్నారా..? అత్తవారింట్లో మాజీ కోడలు సందడి
Recommended image2
Hardik: ఒకపక్క డేటింగ్.. మరోపక్క మాజీ భార్యకు ఖరీదైన గిఫ్ట్.. హార్దిక్ పాండ్యా రచ్చ!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved