బుమ్రా రికార్డును బద్దలుకొట్టిన హార్దిక్ పాండ్యా
Hardik Pandya breaks Bumrah's record: ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా రికార్డును బద్దలు కొట్టాడు.

పాండ్యా, బుమ్రా
ఇంగ్లాండ్ జట్టు ప్రస్తుతం 5 టీ20లు, 3 వన్డేల సిరీస్ కోసం భారత్ లో పర్యటిస్తోంది. దీనిలో భాగంగా ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తొలి టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ అందుకుంది. ఈ మ్యాచ్ లో భారత్ ఆల్ రౌండ్ షోతో అదరగొట్టింది. టీమిండియా సూపర్ బౌలింగ్ దెబ్బకు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 20 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
జోస్ బట్లర్ (44 బంతుల్లో 68) అర్ధ సెంచరీ చేశాడు. ఆ జట్టులో మిగతా ప్లేయర్లు ఎవరూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లతో ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. అతనికి తోడుగా హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ తలా 2 వికెట్లు తీశారు.
హార్దిక్ పాండ్యా రికార్డ్
హార్దిక్ పాండ్యా రికార్డ్
స్వల్ప లక్ష్యాన్ని భారత జట్టు ఈజీగానే ఛేదించింది. భారత్ 13 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 133 పరుగులతో టార్గెట్ ను అందుకుంది. టీమిండియా యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ (34 బంతుల్లో 79 పరుగులు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ధనాధన్ బ్యాటింగ్ తో గ్రౌండ్ లో సిక్సర్ల వర్షం కురిపించాడు. అతనికి తోడుగా సంజూ శాంసన్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు.
ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా, బుమ్రా రికార్డును బద్దలు కొట్టాడు. అత్యధిక టీ20 వికెట్లు తీసిన జాబితాలో బుమ్రాను పాండ్యా అధిగమించాడు. బుమ్రా 70 మ్యాచ్‌లలో 89 వికెట్లు తీయగా, పాండ్యా 100 మ్యాచ్‌లలో 91 వికెట్లతో బుమ్రాను దాటేశాడు.
ఇండియా vs ఇంగ్లాండ్ టీ20
2016 ప్రపంచ కప్
హార్దిక్ పాండ్యా జనవరి 2016లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20లో అరంగేట్రం చేశాడు. ఎంఎస్ ధోని నాయకత్వంలో 2016 ప్రపంచకప్‌లో పాల్గొన్నాడు. అతను తన అద్భుతమైన ఆల్-రౌండర్ నైపుణ్యాలతో జట్టుకు చాలా సహకారం అందించడం కొనసాగిస్తున్నాడు. జూన్ 2022లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత T20 కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. అయితే, వరుస గాయాలతో జట్టుకు దూరం కావడంతో కెప్టెన్సీని కోల్పోయాడు.
అత్యధిక టీ20 వికెట్లు తీసిన భారత ప్లేయర్ ఎవరు?
హార్ధిక్ పాండ్యా 110 టీ20ల్లో 1700 పరుగులు, 91 వికెట్లు తీశాడు. 86 వన్డేల్లో 1769 పరుగులు, 84 వికెట్లు తీశాడు. 11 టెస్టులు ఆడిన పాండ్యా 2021 నుంచి టెస్టులు ఆడలేదు.
భారత్ తరపున అత్యధిక టీ20 వికెట్లు తీసిన బౌలర్లలో అర్ష్‌దీప్ (67 మ్యాచ్‌లలో 97 వికెట్లు) అగ్రస్థానంలో ఉన్నాడు. చాహల్ (80 మ్యాచ్‌లలో 96 వికెట్లు) రెండో స్థానంలో ఉండగా, భువనేశ్వర్ కుమార్ (87 మ్యాచ్‌లలో 90 వికెట్లు) మూడో స్థానంలో ఉన్నాడు.
కాగా, జనవరి 25, శనివారం చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో జోస్ బట్లర్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టుతో జరిగే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లోని రెండో టీ20 కోసం భారత జట్టు చెన్నై కి చేరుకుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో బుధవారం జరిగిన 1వ టీ20లో ఇంగ్లండ్‌పై భారత్ ఏడు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమ్ ఇండియా 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది.