- Home
- Sports
- Cricket
- టీ20ల్లో ఓకే కానీ, అతను వన్డేలకు వేస్ట్... టీ20 వరల్డ్ కప్ 2022 దాకా ఆడించకపోవడమే బెటర్...
టీ20ల్లో ఓకే కానీ, అతను వన్డేలకు వేస్ట్... టీ20 వరల్డ్ కప్ 2022 దాకా ఆడించకపోవడమే బెటర్...
ఐపీఎల్ 2022 సీజన్‌లో బ్యాటర్‌గా, బౌలర్‌గా, ఫీల్డర్‌గా, కెప్టెన్‌గా రాణించి... పర్ఫెక్ట్ ఆల్‌రౌండర్‌గా నిరూపించుకుని టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు హార్ధిక్ పాండ్యా. సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌కి ఎంపికైన హార్ధిక్ పాండ్యాపై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి...

ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన హార్ధిక్ పాండ్యా, 44.27 సగటుతో 400+ పరుగులు చేసి, బౌలింగ్‌లోనూ మెరుపులు మెరిపించాడు. ఫైనల్ మ్యాచ్‌లో 3 వికెట్లు తీసి, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచాడు...
Image credit: PTI
‘హార్ధిక్ పాండ్యా పూర్తి ఫామ్‌తో రీఎంట్రీ ఇవ్వడం టీమిండియాకి చాలా మంచి విషయం. పాండ్యా ఫామ్‌లో ఉన్నంతకాలం టీమిండియాలో అమ్ములపొదిలో అస్త్రాలకు కొదువే ఉండదు...
అయితే హార్ధిక్ పాండ్యాని వన్డేల్లో ఆడించే సాహసం సెలక్టర్లు చేయకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే గాయం నుంచి పూర్తిగా కోలుకుంటున్న హార్ధిక్ పాండ్యా, టీ20ల్లో నాలుగు ఓవర్లు వేయడమే చాలా ఎక్కువ...
ఫిట్‌గా ఉంటే హార్ధిక్ పాండ్యా ఒక్కడూ ఇద్దరితో సమానం. పాండ్యా బ్యాటింగ్ ఆర్డర్‌లో ఏ పొజిషన్‌లో అయినా ఆడగలడు...
కాబట్టి టీ20 వరల్డ్ కప్ 2022 వరకూ అతను కేవలం టీ20లు మాత్రమే ఆడితే బెటర్...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి...
ఐపీఎల్ 2022 సీజన్‌లో కెప్టెన్ గుజరాత్ టైటాన్స్‌కి తొలి సీజన్‌లోనే టైటిల్ అందించిన హార్ధిక్ పాండ్యా, సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌కి ప్రకటించిన భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు.