- Home
- Sports
- Cricket
- ఫిట్‌నెస్‌కీ, ఫీల్డింగ్‌కి సంబంధం ఏంటి? టీ20 వరల్డ్ కప్ 2022 తర్వాత టీమిండియా బెస్ట్ ఫీల్డర్ ఎవరంటే...
ఫిట్‌నెస్‌కీ, ఫీల్డింగ్‌కి సంబంధం ఏంటి? టీ20 వరల్డ్ కప్ 2022 తర్వాత టీమిండియా బెస్ట్ ఫీల్డర్ ఎవరంటే...
ఫిట్‌నెస్ లేకపోతే టీమిండియాలోకి ఎంట్రీ ఉండదు. భారత జట్టు తరుపున ఆడాలంటే బీసీసీఐ నిర్వహించే ఫిట్‌నెస్ పరీక్షల్లో పాస్ అయ్యి తీరాల్సిందే. ఈ ఫిట్‌నెస్ టెస్టు ముఖ్య ఉద్దేశం వికెట్ల మధ్య పరుగులు తీసేందుకు, ఫీల్డింగ్‌లో వేగంగా కదులుతూ క్యాచులు అందుకునేందుకు! అయితే గత ఏడాది కాలంగా భారత జట్టు ఫీల్డర్లు అందుకున్న క్యాచుల లెక్కలు పరీశీలిస్తే సీన్ రివర్స్‌లో ఉంది...

మోస్ట్ ఫిట్టెస్ట్ క్రికెటర్‌గా పేరొందిన ప్లేయర్లు క్యాచులు అందుకోవడంలో పెద్దగా సక్సెస్ కాలేకపోగా ఫిట్‌నెస్ లేదని విమర్శలు ఎదుర్కొన్నవారే నూటికి నూరు శాతం క్యాచులు అందుకుని భళా అనిపించారు. టీ20 వరల్డ్ కప్ 2021 తర్వాత టీ20ల్లో భారత జట్టు ఫీల్డింగ్ ప్రదర్శన లెక్కలు ఇలా ఉన్నాయి...
Image credit: Getty
భారత ఆల్‌రౌండర్ హార్ధకిక్ పాండ్యా 2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత నాలుగుకి నాలుగు క్యాచులు అందుకున్నాడు. అలాగే రవిచంద్రన్ అశ్విన్ 2, రోహిత్ శర్మ 13 క్యాచులను అందుకున్నాడు. ఈ ముగ్గురూ ఒక్క క్యాచ్‌ని కూడా డ్రాప్ చేయకపోవడం విశేషం...
సూర్యకుమార్ యాదవ్ 15 క్యాచులను అందుకుని, ఓ క్యాచ్ డ్రాప్ చేయగా దీపక్ హుడా 9 క్యాచులు ఒడిసి పట్టుకుని ఓ క్యాచ్‌ని నేలపాలు చేశాడు. భువనేశ్వర్ కుమార్ 3 క్యాచులు అందుకుని, ఓ క్యాచ్ డ్రాప్ చేశాడు. ఈ డ్రాప్ క్యాచ్ సమయంలోనే రోహిత్ శర్మ ఆవేశంగా బంతిని తన్ని, ట్రోల్స్ ఫేస్ చేశాడు...
విరాట్ కోహ్లీ 2021 వరల్డ్ కప్ తర్వాత 6 క్యాచులు అందుకుని, 2 క్యాచులను డ్రాప్ చేశాడు. అలాగే సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ 12 క్యాచులు పట్టుకుని, 5 క్యాచులను జారవిడిచాడు. ఇదే సమయంలో రిషబ్ పంత్, టీ20ల్లో ఒక్క క్యాచ్ కూడా డ్రాప్ చేయకపోవడం విశేషం. వన్డే, టెస్టుల్లో మాత్రం పంత్ క్యాచులు డ్రాప్ చేశాడు...
హర్షల్ పటేల్ 5 క్యాచులు అందుకుని 3 క్యాచులు డ్రాప్ చేస్తే... యజ్వేంద్ర చాహాల్ 4 క్యాచులు పట్టి, మూడింటిని జారవిడిచాడు. టీమిండియా వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ కూడా మిస్ ఫీల్డింగ్‌లో ముదిరిపోయాడు. గత ఏడాదిలో 3 క్యాచులు పట్టిన కెఎల్ రాహుల్, 3 క్యాచులను జార విడిచాడు...
Image credit: PTI
భారత ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ మాత్రం ఫీల్డింగ్‌లో పేలవ ప్రదర్శన ఇస్తున్నాడు. గత ఏడాదిలో 4 క్యాచులు పట్టిన అక్షర్ పటేల్, 6 క్యాచులను జారవిడిచినట్టు ఓ వెబ్‌సైట్ కథనాన్ని ప్రచురించింది. అయితే ఈ లెక్కలు నిజమైనవి కావని అభిమానులు కొట్టేస్తున్నారు...
Rohit Sharma
రోహిత్ శర్మ క్యాచులు డ్రాప్ చేయడం కళ్ల ముందే కనిపిస్తున్నా, అతన్ని బెస్ట్ ఫీల్డర్‌గా చూపించేందుకే ఈ దొంగ లెక్కలు వేశారని అంటున్నారు నెటిజన్లు. ఫీల్డింగ్ అంటే క్యాచ్‌లు అందుకోవడమే కాదు, పరుగులను ఆపడం కూడా.. బెస్ట్ ఫీల్డర్‌గా చెబుతున్న రోహిత్, తన ఫీల్డింగ్‌తో ఎన్ని పరుగులను సేవ్ చేశాడో చెప్పాలంటే కామెంట్లు పెడుతున్నారు..