వరల్డ్ కప్‌లో అతనే మాకు మెయిన్ ప్లేయర్! రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
2011 వన్డే వరల్డ్ కప్‌లో చోటు దక్కించుకోలేకపోయిన రోహిత్ శర్మ, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టీమిండియాకి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. ఐపీఎల్ 2022 టైటిల్ విన్నింగ్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, టీమిండియాకి వైస్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు..

రోహిత్ శర్మ తర్వాత టీమిండియా వైట్ బాల్ కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా పేరు వినబడుతోంది. కెఎల్ రాహుల్‌తో పాటు టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ రేసులో ఉన్న మిగిలిన ప్లేయర్లు అందరూ దాదాపు పోటీ నుంచి పక్కకు తప్పుకున్నట్టే...
‘వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో హార్ధిక్ పాండ్యా ఫామ్, మాకు చాలా కీలకం. ఎందుకంటే బౌలింగ్, బ్యాటింగ్ చేసే ప్లేయర్లు... మెగా టోర్నీల్లో చాలా ప్రధాన పాత్ర పోషిస్తారు. గత ఏడాది కూడా పాండ్యా చాలా అద్భుతంగా ఆడాడు..
Ishan Kishan-Hardik Pandya
గత ఏడాది హార్ధిక్ పాండ్యా బౌలింగ్, బ్యాటింగ్ బాగా ఇంప్రూవ్ అయ్యింది. మిడిల్ ఓవర్లలో పాండ్యా బౌలింగ్, లోయర్ ఆర్డర్‌లో అతను చేసే పరుగులు... చాలా వ్యత్యాసాన్ని తీసుకువస్తాయి..
పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో హర్ధిక్ పాండ్యా క్వాలిటీ బ్యాటింగ్ చూశారు. ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా కలిసి చాలా విలువైన భాగస్వామ్యాన్ని జోడించారు. బౌలింగ్‌లోనూ మంచి ఫామ్‌లో ఉన్నాడు..
హార్ధిక్ పాండ్యా ఇప్పుడు చాలా మెచ్యూర్డ్‌గా ఆడుతున్నాడు. టీమ్ కష్టాల్లో ఉన్నప్పుడు బాధ్యత తీసుకుంటున్నాడు. మాకు ఇవి చాలా మంచి శకునాలు.. అవసరం అనుకుంటే కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ ఇద్దరినీ తుది జట్టులోకి తీసుకుంటాం..
లీగ్ స్టేజీలో 9 మ్యాచులు, సెమీ ఫైనల్స్, ఫైనల్స్... మొత్తంగా 11 వన్డే మ్యాచులు ఆడడం చాలా క్లిష్టమైన విషయం. అయితే ఓ మ్యాచ్ ఓడినా మళ్లీ కమ్‌బ్యాక్ ఇవ్వడానికి అవకాశం దొరుకుతుంది. 50 ఓవర్ల ఫార్మాట్, స్ట్రాటెజీని మార్చుకోవడానికి సమయాన్ని ఇస్తుంది..
టీ20 ఫార్మాట్‌తో పోలిస్తే, వన్డేల్లో కాస్త ఊపిరి పీల్చుకునే సమయం ఉంటుంది. వన్డే వరల్డ్ కప్‌కి ఎంపిక చేసిన జట్టుపై చాలా సంతృప్తిగా ఉన్నాం. 3 ఆల్‌రౌండర్లు, నలుగురు బౌలర్లు, ఆరుగురు బ్యాటర్లు ఉన్నారు.
బౌలింగ్‌లో డెప్త్ ఉంది, బ్యాటింగ్‌లోనూ డెప్త్ ఉంది.. ఉన్నంతలో ఇదే బెస్ట్ కాంబినేషన్.. దీనికంటే ప్రత్యేకంగా కావాలని కూడా సెలక్టర్లను కోరలేం..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ..