- Home
- Sports
- Cricket
- టెస్టుల్లోకి హార్ధిక్ పాండ్యా, టీ20ల్లోకి మోహిత్ శర్మ రీఎంట్రీ!? వెస్టిండీస్ టూర్‌లో సంచలన మార్పులు...
టెస్టుల్లోకి హార్ధిక్ పాండ్యా, టీ20ల్లోకి మోహిత్ శర్మ రీఎంట్రీ!? వెస్టిండీస్ టూర్‌లో సంచలన మార్పులు...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో టీమిండియా ఓటమి, టీమ్‌లో సంచలన మార్పులు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. టీమ్ సెలక్షన్ విషయంలో వస్తున్న విమర్శలతో విసుగు చెందిన బీసీసీఐ, వెస్టిండీస్ టూర్‌లో కొన్ని కొత్త ముఖాలతో పాటు టీమ్‌కి కొన్నేళ్లుగా దూరంగా ఉంటున్న పాత ముఖాలకు కూడా చోటు కల్పించబోతున్నట్టు సమాచారం...

Shardul Thakur
టెస్టుల్లో సరైన ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ లేని లోటును ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటూనే ఉంది టీమిండియా. శార్దూల్ ఠాకూర్ కొన్ని మ్యాచుల్లో మెరుపులు మెరిపించినా పూర్తి స్థాయి ఆల్‌రౌండర్‌గా మాత్రం నిరూపించుకోలేకపోయాడు...
డబ్ల్యూటీసీ ఫైనల్‌లో తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన అజింకా రహానేతో శతాధిక భాగస్వామ్యం నెలకొల్పిన శార్దూల్ ఠాకూర్, రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు. బౌలింగ్‌లో కూడా రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు..
Mohit Sharma-hardik Pandya
దీంతో హార్ధిక్ పాండ్యాని తిరిగి టెస్టు టీమ్‌లోకి తెప్పించాలని సమయం వచ్చిందని భావిస్తోందట బీసీసీఐ. 2018 ఆగస్టులో చివరిగా టెస్టు మ్యాచ్ ఆడాడు హార్ధిక్ పాండ్యా. ఐదేళ్లుగా టెస్టులకు దూరంగా ఉన్నాడు హార్ధిక్...
Image credit: Getty
11 టెస్టుల్లో 17 వికెట్లు తీసిన హార్ధిక్ పాండ్యా, బ్యాటింగ్‌లో ఓ సెంచరీ, 4 హాఫ్ సెంచరీలతో రాణించాడు. బోర్డర్ గవాస్కర్ సిరీస్ సమయంలో పాండ్యా రీఎంట్రీ గురించి వార్తలు వచ్చినా, ఇప్పట్లో టెస్టు ఆడే ఉద్దేశం లేదని తేల్చేశాడు...
Hardik Pandya Test
వెస్టిండీస్ టూర్ తర్వాత టెస్టు కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మ తప్పుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే టీ20ల్లో టీమిండియా కెప్టెన్‌గా ఉన్న హార్ధిక్ పాండ్యాకి, టెస్టుల్లో వైస్ కెప్టెన్సీ కూడా దక్కవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు..
అలాగే ఐపీఎల్ 2023 సీజన్‌లో 25 వికెట్లు తీసి అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చిన మోహిత్ శర్మ కూడా టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడని సమాచారం. అప్పుడెప్పుడో 2015లో ధోనీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఆఖరిసారిగా టీమిండియా తరుపున మ్యాచులు ఆడాడు మోహిత్ శర్మ...
Image credit: Gujarat Titans/Facebook
2015 వన్డే వరల్డ్ కప్ తర్వాత టీమ్‌లో చోటు కోల్పోయిన మోహిత్ శర్మ, 26 వన్డేల్లో 31 వికెట్లు తీశాడు. 4 టీ20 మ్యాచుల్లో 6 వికెట్లు తీశాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో మోహిత్ శర్మ పర్ఫామెన్స్‌కి ఇంప్రెస్ అయిన సెలక్టర్లు, అతనికి టీ20 టీమ్‌లోకి తిరిగి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు..