తండ్రిని అయ్యాక నాలో మార్పు వచ్చింది... అవసరమైనప్పుడు అది చేస్తాను... హార్ధిక్ పాండ్యా!
First Published Nov 28, 2020, 3:15 PM IST
ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డేలో భారత జట్టు అన్ని విభాగాల్లోనూ విఫలమైంది. బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ విభాగాల్లో ఫెయిల్ అయిన టీమిండియాకు సంతోషాన్నిచ్చే ఒకే ఒక్క విషయం ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా ఇన్నింగ్స్... ఐపీఎల్‌లో మెరిసిన హార్ధిక్ పాండ్యా, అదే జోరును మొదటి వన్డేలోనూ చూపించి వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదుచేసుకున్నాడు.

ఆరో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదుచేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు హార్ధిక్ పాండ్యా. ఇంతకుముందు ఈ రికార్డు ధోనీ పేరిట ఉంది...

శిఖర్ ధావన్, హార్ధిక్ పాండ్యా కలిసి 37 మ్యాచులు ఆడినా ఒక్కసారి కూడా వీరిద్దరి మధ్య భాగస్వామ్యం నమోదుకాలేదు. ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డేల్లో ఐదో వికెట్‌కి శతాధిక భాగస్వామ్యం నెలకొల్పాడు హార్ధిక్ పాండ్యా.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?