- Home
- Sports
- Cricket
- Hardik Pandya: విడాకుల తర్వాత నా జీవితం చాలా మారింది.. హార్దిక్ పాండ్యా ఏం చెప్పారంటే?
Hardik Pandya: విడాకుల తర్వాత నా జీవితం చాలా మారింది.. హార్దిక్ పాండ్యా ఏం చెప్పారంటే?
Hardik Pandya Divorce Life Struggles and Personal Growth: విడాకుల తర్వాత తన జీవితంలో ఎదురైన కష్టాల గురించి హార్దిక్ పాండ్యా మొదటిసారి మాట్లాడాడు. తన ప్రయాణం తనను ఎలా మార్చిందో, వ్యక్తిగత ఎదుగుదల, నేర్చుకున్న పాఠాలపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

Hardik Pandya Divorce Life Struggles and Personal Growth IPL 2025
Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన జీవితంలో ఎదురైన కష్టాలపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. తన జీవిత ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని చెప్పాడు. వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నానని చెప్పారు. కేవలం క్రీడల నుంచి మాత్రమే కాకుండా వ్యక్తిగత అనుభవాల నుంచి కూడా చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పాడు.
Hardik Pandya Divorce Life Struggles and Personal Growth IPL 2025
జూలై 2024లో హార్దిక్ పాండ్యా, తన మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్ లు విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్నప్పటికీ వారు ఇద్దరు కలిసి కుమారుడు అగస్త్యను పెంచనున్నట్టు తెలిపారు. విడాకులతో వేరైనప్పటికీ ఇద్దరూ ఆరోగ్యకరమైన సంబంధాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఒకరినొకరు గౌరవించుకుంటూ తమ వ్యక్తిగత జీవితాలతో ముందుకు నడుస్తున్నారు.
Hardik Pandya Divorce Life Struggles and Personal Growth IPL 2025
ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న హార్దిక్ పాండ్యా తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ.. తన జీవితం ఎన్నో ఎత్తుపల్లాలతో సాగిందని, ప్రతి క్షణాన్ని ఆస్వాదించానని హార్దిక్ చెప్పాడు. తన కష్టాలు తనను ఈ రోజు ఇలా తీర్చిదిద్దాయని అన్నాడు. అలాగే, తన వ్యక్తిగత అనుభవాలు తనకు అత్యంత విలువైన జీవిత పాఠాలను నేర్పాయని పేర్కొన్నారు.
హార్దిక్ పాండ్యా వీడియో ఇక్కడ చూడండి
విడాకులు తీసుకున్నప్పటికీ, హార్దిక్, నటాషా అగస్త్యను బాగా చూసుకుంటున్నారు. తమ కొడుకు కోసం మంచి వాతావరణాన్ని అందించడానికి ఇద్దరూ కట్టుబడి ఉన్నారు. వారి వ్యక్తిగత విషయాల్లో వేరుగా ఉన్నప్పటికీ ఇద్దరు కలిసి కొడుకు జీవితం కోసం కలిసి నిర్ణయాలు తీసుకుంటున్నారు