- Home
- Sports
- Cricket
- విరాట్ కోహ్లీ, రోహిత్‌తో పాటు జడేజా కూడా వద్దు! వెస్టిండీస్ టూర్‌లో కుర్రాళ్లకే ఛాన్స్... - హర్భజన్ సింగ్
విరాట్ కోహ్లీ, రోహిత్‌తో పాటు జడేజా కూడా వద్దు! వెస్టిండీస్ టూర్‌లో కుర్రాళ్లకే ఛాన్స్... - హర్భజన్ సింగ్
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో టీమిండియా ఓటమితో టీమ్ సెలక్షన్ విషయంలో కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.. వెస్టిండీస్ పర్యటన నుంచి టీమ్‌లో మార్పులు తేవాలని అంటున్నాడు భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్...

Image credit: Getty
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను టీ20ల నుంచి దూరంగా పెట్టింది టీమిండియా. వీరితో పాటు పేలవ ఫామ్‌తో టీ20ల్లో పరుగులు చేయలేకపోతున్న కెఎల్ రాహుల్ కూడా పొట్టి ఫార్మాట్‌కి దూరమయ్యాడు...
వెస్టిండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌కి కూడా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అవసరం లేదంటున్నాడు భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్. వీరితో పాటు భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాని కూడా టీ20 ఫార్మాట్‌కి దూరంగా పెట్టాలంటూ సలహా ఇస్తున్నాడు భజ్జీ...
‘వెస్టిండీస్ టూర్‌లో టీమిండియా ఐదు టీ20 మ్యాచులు ఆడుతోంది. ఎలాగో ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ లేదు. కాబట్టి కుర్రాళ్లను టీ20 సిరీస్‌కి ఎంపిక చేస్తే బెటర్. హార్ధిక్ పాండ్యా, టీ20 కెప్టెన్‌గా కొనసాగుతాడు. అందులో డౌట్ లేదు..
Virat Kohli-Rohit Sharma
కాబట్టి 2024 టీ20 వరల్డ్ కప్‌ని దృష్టిలో పెట్టుకుని, కుర్రాళ్లను రెఢీ చేయాలి. ఈ టీమ్, ఏ జట్టునైనా ఓడించేలా ఉండాలి. హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో కుర్రాళ్లు, ఎలా ఆడుతున్నారో ఐపీఎల్‌లో చూశాం..
Image credit: PTI
సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలకు టీ20 సిరీస్ నుంచి రెస్ట్ ఇవ్వాలి. వీళ్లు ఇప్పటికే కావాల్సినంత క్రికెట్ ఆడేశారు. కాబట్టి ఈ టూర్‌ని కుర్రాళ్లను పరీక్షించేందుకు వాడాలి...
Image credit: PTI
యశస్వి జైస్వాల్, అంతర్జాతీయ క్రికెట్‌కి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అతన్ని వెస్టిండీస్ టూర్‌లో అన్ని ఫార్మాట్లలో ఆడిస్తే బాగుంటుంది. అలాగే రింకూ సింగ్, తిలక్ వర్మ వంటి కుర్రాళ్లకు చోటు ఇవ్వాల్సిన సమయం వచ్చింది..
నేను సెలక్టర్‌ని అయితే, వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కి ఐపీఎల్‌లో బాగా ఆడిన జితేశ్ శర్మ, రవి భిష్ణోయ్, హర్షిత్ రాణా, ఆకాశ్ మద్వాల్ వంటి ప్లేయర్లను సెలక్ట్ చేస్తాను..’ అంటూ వ్యాఖ్యానించాడు టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్...
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కి హర్భజన్ సింగ్ ప్రకటించిన టీమ్ ఇది: శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, హార్ధిక్ పాండ్యా, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ, రవి భిష్ణోయ్, యజ్వేంద్ర చాహాల్, ఆకాశ్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, ఆకాశ్ మద్వాల్