- Home
- Sports
- Cricket
- వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, ఇర్ఫాన్, గంభీర్ దారిలోనే హర్భజన్ సింగ్... లెజెండ్స్‌కి దక్కని ఆ గౌరవం...
వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, ఇర్ఫాన్, గంభీర్ దారిలోనే హర్భజన్ సింగ్... లెజెండ్స్‌కి దక్కని ఆ గౌరవం...
భారత క్రికెట్ టీమ్‌లోకి రావడం ఎంత కష్టమో, జట్టులోకి వచ్చిన తర్వాత ప్లేస్‌ను కాపాడుకోవడం అంతకంటే కష్టం. భారత మాజీ క్రికెటర్లు చాలా మంది విషయంలో ఇది నిజమైంది.

ఎన్నేళ్లు క్రికెట్ ఆడినా ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడుతూ ‘గార్డ్ ఆఫ్ హానర్’ తీసుకుని, అభిమానుల మధ్య క్రికెట్ నుంచి తప్పుకోవడాన్ని గౌరవంగా భావిస్తారు క్రికెటర్లు. భారత క్రికెట్‌లోనే కాదు, వరల్డ్ క్రికెట్‌లో స్టార్ ప్లేయర్‌గా గుర్తింపు పొందిన వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్... ఇప్పుడు హర్భజన్ సింగ్ కూడా అలా దక్కాల్సిన గౌరవం దొరకకుండా రిటైర్మెంట్ ప్రకటించినవాళ్లే...
టీమిండియా తరుపున 104 టెస్టులు, 251 వన్డేలు, 19 టీ20 మ్యాచులు ఆడిన వీరేంద్ర సెహ్వాగ్, మూడు ఫార్మాట్లలో కలిపి 17 వేలకు పైగా పరుగులు చేశాడు...
టెస్టుల్లో త్రిబుల్ సెంచరీ చేసిన మొట్టమొదటి భారత క్రికెటర్‌గా నిలిచిన వీరూ, వన్డేల్లో సచిన్ టెండూల్కర్ తర్వాత డబుల్ సెంచరీ బాదిన బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు...
టీమిండియాకి ఎన్నో అద్భుత విజయాలు అందించిన వీరేంద్ర సెహ్వాగ్, కెరీర్ చరమాంకంలో ఒక్క అవకాశం కోసం ఆశగా ఎదురుచూడాల్సి వచ్చింది.
2013లో టీమిండియా తరుపున ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన వీరేంద్ర సెహ్వాగ్, రెండేళ్ల పాటు టీమ్‌లో ప్లేస్ కోసం వెయిట్ చేసి, 2015లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు...
టీమిండియా తరుపున 304 వన్డేలు, 40 టెస్టులు, 58 టీ20 మ్యాచులు ఆడిన భారత స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌కి కూడా ఈ విషయంలో పరాభవం తప్పలేదు...
క్యాన్సర్ నుంచి కోలుకుని రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా టీమ్‌లో స్థిరమైన స్థానం సంపాదించుకోలేకపోయాడు యువరాజ్ సింగ్...
2017 జూన్‌లో టీమిండియా తరుపున ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన యువీ, 2019 జూన్‌లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు...
2011 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌లో 97 పరుగులు చేసి, భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన గౌతమ్ గంభీర్ కూడా కెరీర్ ముగింపు దశలో టీమ్‌లో ప్లేస్ కోసం ఎదురుచూడాల్సి వచ్చింది...
భారత జట్టు తరుపున 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20 మ్యాచులు ఆడిన గౌతమ్ గంభీర్, మూడు ఫార్మాట్లలో కలిపి 10 వేలకు పైగా పరుగులు చేశాడు. 2016లో టీమిండియా తరుపున ఆఖరి మ్యాచ్ ఆడిన గౌతీ, 2018 డిసెంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు...
హర్భజన్ సింగ్ తర్వాత టీమిండియా తరుపున టెస్టుల్లో హ్యాట్రిక్ తీసిన రెండో బౌలర్‌గా ఉన్నాడు ఇర్ఫాన్ పఠాన్. కెరీర్ ఆరంభంలో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చిన ఇర్ఫాన్ పఠాన్, ఆ తర్వాత తుదిజట్టులో చోటు కోల్పోయాడు...
2007 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచిన ఇర్ఫాన్ పఠాన్, తన కెరీర్‌లో 29 టెస్టులు, 120 వన్డేలు, 24 టీ20 మ్యాచులు ఆడి మొత్తంగా 300 వికెట్లు, 3 వేల దాకా పరుగులు చేశాడు...
2012లో చివరిగా టీమిండియా తరుపున అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఇర్ఫాన్ పఠాన్, 2020 జనవరిలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. అంటే దాదాపు 8 ఏళ్ల పాటు భారత జట్టులో చోటు కోసం ఆశగా ఎదురుచూశాడు ఇర్ఫాన్ పఠాన్...
103 టెస్టుల్లో 417 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన నాలుగో భారత బౌలర్‌గా ఉన్న హర్భజన్ సింగ్, టెస్టుల్లో రెండు సెంచరీలు, 9 హాఫ్ హాఫ్ సెంచరీలతో 2224 పరుగులు కూడా చేశాడు...
236 వన్డే మ్యాచులు ఆడిన హర్భజన్ సింగ్, 269 వికెట్లు తీశాడు. 28 టీ20 మ్యాచుల్లో 25 వికెట్లు తీసి... ఓవరాల్‌గా 711 అంతర్జాతీయ వికెట్లు తీశాడు..
2016లో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన హర్భజన్ సింగ్, దాదాపు ఐదేళ్లకు పైగా టీమిండియాలో చోటు కోసం ఎదురుచూసి ఫెయిర్‌వెల్ మ్యాచ్ లేకుండానే వెనుదిరగాల్సి వచ్చింది...
వీరితో పాటు అజిత్ అగర్కార్, సురేష్ రైనా, వినయ్ కుమార్, మహ్మద్ కైఫ్, వసీం జాఫర్, యూసఫ్ పఠాన్, ప్రవీణ్ కుమార్ వంటి ఎందరో క్రికెటర్లు కూడా టీమిండియాలో చోటు కోసం ఆశగా ఎదురుచూసి, అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నారు.
టీమిండియా కెప్టెన్‌గా టీ20 వరల్డ్‌కప్ 2007, 2011 వన్డే వరల్డ్‌కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఫేర్‌వెల్ మ్యాచ్ లేకుండా అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగాడు. అయితే ఐపీఎల్‌లో చెన్నైలో ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడతానని చెప్పాడు మాహీ...