MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Sports
  • Cricket
  • హర్భజన్ సింగ్‌కి ‘టర్బనేటర్’ అనే నిక్‌నేమ్ పెట్టింది వాళ్లే... ‘భజ్జీ’ అంటూ ముద్దుగా...

హర్భజన్ సింగ్‌కి ‘టర్బనేటర్’ అనే నిక్‌నేమ్ పెట్టింది వాళ్లే... ‘భజ్జీ’ అంటూ ముద్దుగా...

భారత జట్టు తరుపున టెస్టుల్లో మొట్టమొదటి హ్యాట్రిక్ తీసిన క్రికెటర్ హర్భజన్ సింగ్. 23 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన హర్భజన్ సింగ్, ఐదేళ్లుగా టీమిండియాలో ప్లేస్ కోసం ఎదురుచూసి అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు..

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Dec 24 2021, 03:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112

ఆస్ట్రేలియాపై టెస్టుల్లో హ్యాట్రిక్ సాధించిన హర్భజన్ సింగ్, 41 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు అన్పి ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212

1998లో టీమిండియా తరుపున ఎంట్రీ ఇచ్చిన హర్భజన్ సింగ్, 103 టెస్టుల్లో 417 వికెట్లు పడగొట్టాడు. భారత జట్టుకి ఎన్నో అద్వితీయ విజయాలు అందించిన భజ్జీ, చాలామంది స్పిన్నర్లకు రోల్ మోడల్‌ కూడా...

312

2001లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో తొలి టెస్టులో ఆసీస్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఆ తర్వాత జరిగిన రెండు టెస్టుల్లోనూ భారత జట్టు భారీ విజయాలు అందుకుంది...

412

రెండో టెస్టులో 171 పరుగుల భారీ తేడాతో గెలిచిన టీమిండియా, మూడో టెస్టులో 2 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. రెండో టెస్టులో 13 వికెట్లు తీసిన హర్భజన్ సింగ్‌, భారత్ విజయంలో కీ రోల్ పోషించాడు...

512

ఈ విజయం తర్వాత హర్భజన్ సింగ్‌ను పొడుగుతూ ‘హర్భజన్ సింగ్, ఆస్ట్రేలియా టీమ్ మొత్తాన్ని టర్మినేట్ చేశాడు...’ అంటూ హెడ్‌లైన్స్‌ పెట్టింది ఆస్ట్రేలియా మీడియా.

612

హర్భజన్ సింగ్, సిక్కు మతాన్ని ఆచరిస్తూ టర్బన్ ధరిస్తాడని అందరికీ తెలిసిందే. దీంతో టర్మినేటర్ అనే మాటకి బదులుగా ‘టర్బనేటర్’ అనే కొత్త పద ప్రయోగం చేసింది ఆసీస్ మీడియా. ఈ నిక్ నేక్ బాగా పాపులర్ కావడంతో హర్భజన్ సింగ్ కూడా తన పేరు ముంగిట ‘టర్బనేటర్’ అని చేర్చుకున్నాడు..

712

ఇదే కాకుండా హర్భజన్ సింగ్‌కి ‘భజ్జీ’, బజ్జీ పా’ అనే నిక్‌నేమ్స్ ఉన్నాయి. మాజీ భారత క్రికెటర్, వికెట్ కీపర్ నయన్ మోంగియా... హర్భజన్ సింగ్‌కి ‘భజ్జీ’ అనే నిక్‌నేమ్ పెట్టాడు...

812

మోంగియా వికెట్ కీపింగ్ చేసే సమయంలో హర్భజన్ సింగ్ బౌలింగ్ చేస్తున్నప్పుడు తనదైన స్టైల్‌లో కామెంటరీ చేస్తూ ఎంకరేజ్ చేసేవాడు. దీంతో హర్భజన్‌ పేరులోని భజన్‌ని భజ్జీగా మార్చి, ఇలా పిలిచేవాడు... కాలక్రమేణా హర్భజన్ సింగ్‌కి భజ్జీ అనే నిక్‌నేమ్ సెటిల్ అయిపోయింది.

912

అయితే హర్భజన్ సింగ్‌ని చిన్నతనంలో ‘సోనూ’ అని ముద్దుగా పిలిచేవాళ్లంట తన ఇంట్లోవాళ్లు... భారత జట్టులో సీనియర్ ప్లేయర్‌గా మిగిలిన హర్భజన్ సింగ్‌ను ధోనీ కెప్టెన్సీలో జట్టులోకి వచ్చిన యంగ్ ప్లేయర్లు ‘భజ్జీ పా’ అని గౌరవంగా పిలిచేవాళ్లు...

1012

టెస్టు క్రికెట్‌లో వరుసగా నాలుగుసార్లు ఆరేసి వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేసిన హర్భజన్ సింగ్, 2001లో ఆస్ట్రేలియాపై హ్యాట్రిక్ తీయడమే కాకుండా మూడు టెస్టుల్లో 32 వికెట్లు తీసి మూడు టెస్టుల సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా నిలిచాడు.

1112

మొత్తంగా 367 అంతర్జాతీయ మ్యాచుల్లో 711 వికెట్లు తీసిన హర్భజన్ సింగ్, 28 సార్లు ఐదేసి వికెట్లు ప్రదర్శన ఇచ్చాడు. అలాగే బ్యాటుతోనూ రాణించి 2 సెంచరీలు చేసిన హర్భజన్ సింగ్, 3570 పరుగులు రాబట్టాడు.

1212

క్రికెట్ కాకుండా పంజాబ్‌లో డీఎస్‌పీ ఉద్యోగాన్ని కూడా పొందిన హర్భజన్ సింగ్, కొన్ని సినిమాల్లో గెస్ట్ అప్పీరియెన్స్ ఇచ్చాడు.‘ఫ్రెండ్‌షిప్’ అనే కోలీవుడ్ సినిమాలో హీరోగా నటించాడు. 

About the Author

CR
Chinthakindhi Ramu
ఎం.ఎస్. ధోని

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Recommended image2
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ వరల్డ్ రికార్డు.. శ్రీలంకపై సెంచరీతో ద్రవిడ్ 27 ఏళ్ల ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు
Recommended image3
భారత్ శ్రీలంక టెస్టులో ప్లేయర్స్ మధ్య వాగ్వాదం.. అసలేం జరిగింది? తొలిరోజు ఆధిప‌త్యం ఎవ‌రిదంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved