MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • హనుమ విహారిని కూడా కుల్దీప్ యాదవ్‌లా చేస్తారా... ప్రతీ సిరీస్‌కి ఎంపిక చేసి, ముందుగానే ప్రాక్టీస్‌కి...

హనుమ విహారిని కూడా కుల్దీప్ యాదవ్‌లా చేస్తారా... ప్రతీ సిరీస్‌కి ఎంపిక చేసి, ముందుగానే ప్రాక్టీస్‌కి...

హనుమ విహారి... మోస్ట్ అండర్‌రేటెడ్ టెస్టు బ్యాట్స్‌మెన్. విదేశీ పిచ్‌లపై రాణించి, సత్తా చాటినప్పటికీ ఈ తెలుగు క్రికెటర్‌కి ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం దక్కడం లేదు. సెంచూరియన్ టెస్టులో విహారి ఆడతాడని అందరూ భావించినా, మరోసారి నిరాశ తప్పలేదు...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Dec 26 2021, 07:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

93 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 21 సెంచరీలతో 7,194 పరుగులు చేసిన హనుమ విహారి, 12 టెస్టుల్లో 36 సగటుతో 624 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో త్రిబుల్ సెంచరీ సాధించిన విహారి, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాల్లో టెస్టు సిరీస్‌లు ఆడాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213

వెస్టిండీస్ పర్యటనలో 128 బంతుల్లో 93 పరుగులు చేసి, భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన హనుమ విహారి, ఆ తర్వాతి మ్యాచ్‌లో 111 పరుగులు చేసి తొలి టెస్టు సెంచరీ అందుకున్నాడు...

313

ఆస్ట్రేలియా టూర్ ఆరంభానికి ముందు కూడా హనుమ విహారి ఆటతీరు అంటే తనకెంతో ఇష్టమని, అతనిలో అద్భుతమైన టాలెంట్ దాగి ఉందని కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ...

413

ఆస్ట్రేలియా టూర్‌లో సిడ్నీ టెస్టులో అశ్విన్‌తో కలిసి దాదాపు నాలుగు గంటల పాటు వికెట్లకు అడ్డుగా నిలబడి భారత జట్టును ఓటమి నుంచి కాపాడాడు హనుమ విహారి. అయితే ఆ తర్వాత విహారికి మరో ఛాన్స్ దక్కలేదు...

513

గాయం కారణంగా గబ్బా టెస్టు ఆడని హనుమ విహారిని, స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌కి ఎంపిక చేయలేదు. విదేశాల్లో ఘనమైన రికార్డు ఉన్న విహారిని, స్వదేశంలో సిరీస్‌కి ఎంపిక చేయకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

613

అయితే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌తో పాటు ఆ తర్వాత జరిగే ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులో హనుమ విహారికి చోటు దక్కింది...

713

డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ప్రిపరేషన్స్‌గా నెల ముందే ఇంగ్లాండ్‌ వెళ్లి కౌంటీ మ్యాచులు ఆడాడు హనుమ విహారి. అయితే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కాదు కదా, ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగు టెస్టుల్లోనూ విహారికి చోటు దక్కలేదు...

813

టెస్టు సిరీస్ ఆరంభానికి ముందే భారత్-ఏతో కలిసి అనధికారిక మూడు టెస్టుల సిరీస్ ఆడి, నిరూపించుకున్న తెలుగు క్రికెటర్ హనుమ విహారికి చోటు ఇవ్వకపోవడంపై తీవ్రమైన ట్రోలింగ్ వస్తోంది...

913

ఇప్పుడు సౌతాఫ్రికా టూర్‌ విషయంలో అంతే. సిరీస్ ఆరంభానికి నెల ముందే సఫారీ గడ్డపై మ్యాచులు ఆడేందుకు వచ్చాడు హనుమ విహారి. ఆఖరి మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 50+ స్కోర్లు చేసి ఆకట్టుకున్నాడు...

1013

కౌంటీ మ్యాచుల్లో పర్ఫామెన్స్ బాగోలేదని డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో ఆడించలేదని అనుకుంటే, సౌతాఫ్రికాలో ఫామ్ నిరూపించుకున్న విహారికి సెంచూరియన్ టెస్టులో చోటు దక్కాల్సింది. అయితే ఇప్పుడు కూడా అతనికి అవకాశం ఇవ్వలేదు...

1113

టీమిండియా తీరు చూస్తుంటే, తర్వాత ఇంగ్లాండ్ పర్యటనకి ముందు కూడా హనుమ విహారిని ముందుగానే అక్కడికి పంపిస్తారని... అయితే ఆడించే ఉద్దేశం మాత్రం భారత జట్టుకి లేదని ట్రోల్ చేస్తున్నారు...

1213

అత్యంత అరుదైన చైనామెన్ యాక్షన్‌తో బౌలింగ్ చేసే కుల్దీప్ యాదవ్‌ని ఇలాగే టెస్టు సిరీస్‌లకు ఎంపిక చేస్తూ, తుదిజట్టులో చోటు కల్పించకుండా అతను తీవ్రమైన డిప్రెషన్‌కి లోనయ్యేందుకు కారణమైంది టీమిండియా మేనేజ్‌మెంట్...

1313

ఇప్పుడు హనుమ విహారి విషయంలో కూడా ఇలాగే జరుగుతుందేమోనని భయపడుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ కూడా చేయగల విహారిని సరిగ్గా వాడుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

About the Author

CR
Chinthakindhi Ramu
Latest Videos
Recommended Stories
Recommended image1
Cricketers Retirement : రహానే ట్రైలర్ మాత్రమే, సినిమా మిగిలే ఉంది.. రిటైర్మెంట్ కు సిద్దమైన టాప్ 5 క్రికెటర్లు వీళ్లే
Recommended image2
Ajinkya Rahane Net Worth: అజింక్య రహానే కు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా? లగ్జరీ కార్లు, బిజినెస్ సీక్రెట్స్ ఇవే
Recommended image3
Rahane Retirement : క్యాప్ నంబర్ 278, సైనింగ్ ఆఫ్.. టీమిండియాకు గుడ్ బై చెబుతూ అజింక్యా రహానే ఎమోషనల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved