- Home
- Sports
- Cricket
- Chris Gayle: మళ్లీ భారత్‌కు రానున్న యూనివర్సల్ బాస్.. ఈసారి వీరూ సారథ్యంలో మరింత బాదుడు
Chris Gayle: మళ్లీ భారత్‌కు రానున్న యూనివర్సల్ బాస్.. ఈసారి వీరూ సారథ్యంలో మరింత బాదుడు
Legends League Cricket: వెస్టిండీస్ వెటరన్ క్రికెటర్ క్రిస్ గేల్ ఐపీఎల్ లో మెరిపించిన మెరుపులు అన్నీ ఇన్నీ కావు. ప్రారంభ సీజన్ నుంచి 2021 సీజన్ వరకు గేల్ ఐపీఎల్ ఆడాడు.

యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ మళ్లీ భారత్ లో మెరుపులు మెరిపించేందుకు సిద్ధమవుతున్నాడు. ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి 2021 వరకు నిరాటంకంగా ఈ క్యాష్ రిచ్ లీగ్ లో ఆడిన గేల్ కు ఇక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే రెండు నెలల క్రితం ముగిసిన ఐపీఎల్-15లో వ్యక్తిగత కారణాలతో గేల్ ఈ సీజన్ నుంచి తప్పుకున్నాడు.
కానీ తాజాగా గేల్ మళ్లీ భారత్ లో ఫ్రాంచైజీ క్రికెట్ ఆడనున్నాడు. ఈనెల 16 నుంచి మొదలుకానున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్ఎల్‌సీ) రెండో సీజన్ లో యూనివర్సల్ బాస్.. వీరేంద్ర సెహ్వాగ్ సారథ్యంలోని గుజరాత్ జెయింట్స్ కు ఆడనున్నాడు.
ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ నేతృత్వంలోని గుజరాత్ జెయింట్స్ ఈ విషయాన్ని ధృవీకరించింది. తాము క్రిస్ గేల్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు అదానీ స్పోర్ట్స్ లైన్ తెలిపింది. గేల్ తమ లీగ్ లో
భాగస్వామి అవడం చాలా సంతోషంగా ఉందని ఎల్ఎల్‌సీ సీఈవో రామన్ రహేజా తెలిపాడు.
क्रिस गेल
ఈ లీగ్ లో నిబంధనల ప్రకారం.. ఒక జట్టు 15 మంది సభ్యుల బృందాన్ని ఎంచుకునేందుకు గాను ఒక ఫ్రాంచైజీ పర్స్ లో రూ. 8 కోట్లుంటాయి. గేల్ తో ఒప్పందానికి ముందు గుజరాత్ జెయింట్స్ తమ జట్టులోని సభ్యులకు రూ. 5.51 కోట్లు ఖర్చుచేసింది. ఇంకా వారి ఖాతాలో 2.48 కోట్లున్నాయి. దీంతో గేల్ తో సంప్రదింపులు జరిపిన గుజరాత్ జెయింట్స్ యాజమాన్యం.. అతడితో డీల్ కుదుర్చుకుంది.
Virender Sehwag)
లెజెండ్స్ లీగ్ రెండో సీజన్ కోసం ఎంపిక చేసిన గుజరాత్ జెయింట్స్ జట్టు ఇదే.. వీరేంద్ర సెహ్వాగ్ (కెప్టెన్), పార్థీవ్ పటేల్, క్రిస్ గేల్, కెవిన్ ఓబ్రెయిన్, డేనియల్ వెటోరి, ఎల్టన్ చిగుంబురా, క్రిస్ ట్రెమ్లెట్, రిచర్డ్ లెవి, గ్రేమ్ స్వాన్, జోగిందర్ శర్మ, అశోక్ దిండా, స్టువర్ట్ బిన్నీ, అజంతా మెండిస్, మిచెల్ మెక్‌లాగెన్, లెండిల్ సిమన్స్, మన్విందర్ బిస్లా
నాలుగు జట్లు పాల్గొనబోయే ఎల్ఎల్‌సీ సీజన్-2లో గుజరాత్ జెయింట్స్ కు వీరేంద్ర సెహ్వాగ్, ఇండియా క్యాపిటల్స్ కు గౌతం గంభీర్ సారథిగా వ్యవహరించనున్నాడు. మణిపాల్ టైగర్స్ జట్టుకు టర్బోనేటర్ హర్భజన్ సింగ్ కెప్టెన్ గా నియమితుడయ్యాడు. భిల్వారా కింగ్ టీమ్ కు ఇర్ఫాన్ పఠాన్ నాయకుడిగా వ్యవహరిస్తాడు.