- Home
- Sports
- Cricket
- ప్రపంచాన్ని గెలిచిన రికీ పాంటింగ్, ఇండియాలో ఒక్క టెస్టు గెలవలేకపోయాడు... ప్యాట్ కమ్మిన్స్ ఎంత...
ప్రపంచాన్ని గెలిచిన రికీ పాంటింగ్, ఇండియాలో ఒక్క టెస్టు గెలవలేకపోయాడు... ప్యాట్ కమ్మిన్స్ ఎంత...
క్రికెట్ వరల్డ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్... 2004 నుంచి 2011 వరకూ ఆస్ట్రేలియాకి కెప్టెన్సీ చేసిన రికీ పాంటింగ్, ఆసీస్‌కి ‘స్వర్ణ యుగం’ చూపించాడు. పాంటింగ్ టీమ్‌తో మ్యాచ్ అంటే ఏ టీమ్ అయినా గెలుపుపైన ఆశలు వదలుకోవాల్సిందే...

324 మ్యాచులకు కెప్టెన్సీ చేసిన రికీ పాంటింగ్, 220 విజయాలు అందుకున్నాడు. కెప్టెన్‌గా రికీ పాంటింగ్ సక్సెస్ రేటు 67.91 శాతం. రెండు వన్డే వరల్డ్ కప్స్ గెలిచిన రికీ పాంటింగ్ తన కెరీర్‌లో 77 టెస్టులకు కెప్టెన్సీ చేసి 48 విజయాలు అందుకున్నాడు...
Ricky Ponting
గ్రేమ్ స్మిత్ 109 టెస్టుల్లో 53 విజయాలు అందుకుంటే, రెండో స్థానంలో ఉన్న రికీ పాంటింగ్ టెస్టు కెప్టెన్‌గా 62.34 విజయాల శాతం నమోదు చేశాడు.అయితే రికీ పాంటింగ్ తన క్రికెట్ కెరీర్‌లో కెప్టెన్‌గా ఇండియాలో ఒక్క టెస్టు కూడా గెలవలేకపోయాడు...
Ricky Ponting, Ishant Sharma
2004-05, 2007-08 సీజన్లలో ఆస్ట్రేలియాలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ జరిగింది. ఈ రెండు సిరీస్‌లను 2-1 తేడాతో సొంతం చేసుకుంది రికీ పాంటింగ్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా. ఆ తర్వాత రెండు సీజన్లలో ఇండియాలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరిగింది...
2008-09 భారత్ పర్యటనలో ఆస్ట్రేలియా నాలుగు టెస్టులు ఆడి రెండింట్లో ఓడింది. మిగిలిన రెండు టెస్టులు డ్రాగా ముగిశాయి. ఈ పర్యటనలో మొదటి టెస్టుకి, మూడో టెస్టుకి అనిల్ కుంబ్లే కెప్టెన్సీ చేస్తే, రెండు, నాలుగో టెస్టులకు ధోనీ కెప్టెన్సీ చేయడం విశేషం...
2010-11 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా రెండు టెస్టులు ఆడి సిరీస్‌ని 2-0 తేడాతో సొంతం చేసుకుంది. మొహాలీలో జరిగిన తొలి వన్డేలో ఆఖరి వికెట్‌ని కాపాడుకుంటూ ఉత్కంఠ విజయం సాధించిన భారత్, బెంగళూరులో జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది..
రికీ పాంటింగ్ లాంటి లెజెండరీ కెప్టెనే, ఇండియాలో ఒక్క టెస్టు కూడా గెలవకుండా కెరీర్‌ని ముగించాల్సి వచ్చింది. అలాంటిది గత ఏడాదిలో కెప్టెన్సీ తీసుకున్న ప్యాట్ కమ్మిన్స్, భారత్‌లో భారత్‌ని ఓడించి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నెగ్గగలడా? తొలి టెస్టులో ఆసీస్ ఆటతీరు చూసిన వారికి ఇది జరిగే పని కాదని అర్థమైపోయి ఉంటుంది..
Pat Cummins
అయితే 2020-21 ఆస్ట్రేలియా పర్యటనలో ఆడిలైడ్ టెస్టులో ఘోర పరాజయం తర్వాత టీమిండియా కమ్‌బ్యాక్ ఇచ్చి టెస్టు సిరీస్‌ని 2-1 తేడాతో గెలుస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. కానీ జరిగింది... అలాంటి కమ్‌బ్యాక్ ఇచ్చే సత్తా ఆస్ట్రేలియాకి కూడా ఉంది... అదే జరిగితే కమ్మిన్స్, ది గ్రేట్ కెప్టెన్ల లిస్టులో చేరిపోవడం ఖాయం..