టీమిండియా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. కోలుకున్న కెప్టెన్.. నేడే విడుదల
ENG vs IND: ఎడ్జబాస్టన్ టెస్టుకు ముందు కరోనా బారిన పడి మ్యాచ్ కు దూరమైన రోహిత్ శర్మ అభిమానులకు గుడ్ న్యూస్. హిట్ మ్యాన్ కోలుకున్నాడని.. అతడు ఇవాళ..

కెప్టెన్ అయ్యాక విదేశాలలో తొలి టెస్టు ఆడేందుకు ఇంగ్లాంండ్ కు వచ్చిన రోహిత్ శర్మ ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. గత ఆదివారం అతడు లీస్టర్షైర్ తో మ్యాచ్ జరుగుతుండగానే కరోనా సోకడంతో మూడో రోజు ఆటకు రాలేదు.
ఎడ్జబాస్టన్ తో టెస్టుకల్లా రోహిత్ కోలుకుంటాడని ఆశించినా టీమిండియా ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది. బుధవారం, గురువారం రెండ్రోజులు కూడా అతడికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించినా అందులో పాజిటివ్ అని తేలింది. దీంతో అతడు ఈ టెస్టుకు దూరమై ఐసోలేషన్ లోనే గడుపుతున్నాడు.
కాగా రెండ్రోజుల తర్వాత రోహిత్ కు మళ్లీ కోవిడ్ పరీక్షలు నిర్వహించగా.. అతడికి నెగిటివ్ అని తేలింది. శనివారం నిర్వహించిన కరోనా పరీక్షలో నెగిటివ్ అని వచ్చింది. ఆదివారం అతడు ఐసోలేషన్ నుంచి కూడా బయటకు రానున్నాడు.
రోహిత్ శర్మ గైర్హాజరీలో టీమ్ మేనేజ్మెంట్ జస్ప్రీత్ బుమ్రాను ఎడ్జబాస్టన్ టెస్టులో సారథిగా నియమించిన విషయం తెలిసిందే. కానీ జులై 7 నుంచి జరగబోయే టీ20, వన్డే సిరీస్ లకు మాత్రం హిట్ మ్యానే కెప్టెన్ గా వ్యవహరిస్తాడు.
ఈ మేరకు బీసీసీఐ.. ఇప్పటికే ఇరు ఫార్మాట్లకు జట్లన ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ తో తొలి టీ20కి ఐర్లాండ్ తో ఆడిన జట్టే ఆడనుండగా.. ఈ టీమ్ కు అదనంగా రోహిత్ శర్మ యాడ్ అవుతాడు. కానీ తర్వాత రెండు టీ20లకు భారత సీనియర్లు విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్ లు జట్టుతో కలుస్తారు.
ఇంగ్లాండ్ తో తొలి టీ20కి భారత జట్టు ఇదే : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, వెంకటేశ్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.
తర్వాతి రెండు మ్యాచులకు జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, అవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్.
వన్డే సిరీస్ కు భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, జస్ప్రిత్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.