- Home
- Sports
- Cricket
- IPL: ఢిల్లీ క్యాపిటల్స్ కు శుభవార్త.. ముంబైకి చేరుకున్న దక్షిణాఫ్రికా బౌలర్.. సఫారీ జట్టుకు మరో ఝలక్
IPL: ఢిల్లీ క్యాపిటల్స్ కు శుభవార్త.. ముంబైకి చేరుకున్న దక్షిణాఫ్రికా బౌలర్.. సఫారీ జట్టుకు మరో ఝలక్
IPL 2022: మరో ఆరు రోజుల్లో ఐపీఎల్ మొదలుకానున్న నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అభిమానులకు గుడ్ న్యూస్. రిటెన్షన్ ప్రక్రియలో రూ. 6.5 కోట్లు పెట్టి దక్కించుకున్న సఫారీ బౌలర్ వస్తాడా..? రాడా..? అని ఆందోళన పడుతున్న వేళ..

ఐపీఎల్ ప్రారంభానికి మరో ఆరు రోజులే సమయం ఉండటంతో అసలు వస్తాడా..? రాడా..? అని ఢిల్లీ అభిమానులు పడుతున్న ఆందోళనకు తెరదించుతూ దక్షిణాఫ్రికా కు చెందిన ఆన్రిచ్ నోర్త్జ్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
గతడేది గాయం కారణంగా జాతీయ జట్టుకు దూరమైన నోర్త్జ్.. ఈ సీజన్ కు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ముంబైకి చేరుకోవడం విశేషం.
దుబాయ్ లో జరిగిన ఐపీఎల్ సీజన్ 2021 లో గాయపడిన అనంతరం టీ20 ప్రపంచకప్ లో ఆడాడు. ఆ తర్వాత స్వదేశంలో ఇండియాతో జరిగిన టెస్టు, వన్డే సిరీస్ లతో పాటు ఇటీవలే ముగిసిన న్యూజిలాండ్ సిరీస్ లో కూడా ఆడలేదు. బంగ్లాదేశ్ పర్యటనకూ దూరంగా ఉన్న నోర్త్జ్.. ఐపీఎల్-15 లో ఆడతాడా..? లేదా..? అన్నది ఆ జట్టు అభిమానులతో పాటు యాజమాన్యాన్ని కూడా వేధించిన ప్రశ్న.
గాయం కారణంగా సుమారు ఐదు నెలల పాటు విరామం తీసుకున్న నోర్త్జ్ రాకపై ఆ జట్టుకు కూడా నమ్మకం లేదు. ఇదే విషయమై దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్ఏ) నుంచి స్పష్టత కోరాలని ఢిల్లీ యాజమాన్యం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ని ఆశ్రయించిన విషయం తెలిసిందే.
అయితే ఈ విషయంలో సీఎస్ఏ స్పందిస్తూ.. అతడు గాయం నుంచి కోలుకున్నా ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదని తన వర్గాల ద్వారా బీసీసీఐకి తెలిపింది. అయినా కూడా అతడికి సీఎస్ఏ మెడికల్ టీమ్ క్లీయరెన్స్ ఇవ్వలేదని గతంలో వార్తలు వచ్చాయి. ఇదిలాఉండగా.. అతడి ఫిట్నెస్ పై ఢిల్లీ క్యాపిటల్స్ కు కొన్ని పరిమితుల మీద పంపించినట్టు దక్షిణాఫ్రికా క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఢిల్లీ క్యాపిటల్స్ వైద్య బృందం అతడు ఫిట్ గా ఉన్నాడని తేల్చితేనే నోర్త్జ్ ఐపీఎల్ లో మ్యాచులు ఆడతాడు.. లేకుంటే డ్రెస్సింగ్ రూమ్ కే పరిమితం కావాల్సి ఉంటుంది.. ఈ షరతును తప్పనిసరిగా పాటించాలని నోర్త్జ్ కు, ఢిల్లీ యాజమాన్యానికి సీఎస్ఏ కీలక ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.
గతేడాది ముగిసిన రిటెన్షన్ ప్రక్రియలో నోర్త్జ్ ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 6.5 కోట్లతో దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక తాజ్ మహాల్ హోటల్ లో బయో బబుల్ లో గడుపుతున్న జట్టుతో నోర్త్జ్ చేరనున్నాడు. అక్కడ క్వారంటైన్ పూర్తి చేసుకుని ఫిట్నెస్ సాధిస్తేనే అతడు 27న ముంబైతో జరిగే మ్యాచులో ఆడతాడు.
ఢిల్లీకి నోర్త్జ్ కీలక బౌలర్. ఈసారి ఆ జట్టుకు రబాడా కూడా లేడు. వేలంలో అతడిని పంజాబ్ కింగ్స్ దక్కించుకున్నది. దీంతో నోర్త్జ్ (అందుబాటులో ఉంటే) తో పాటు శార్దూల్ ఠాకూర్, ఖలీల్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ తో బౌలింగ్ దళాన్ని నడిపించనున్నాడు.