- Home
- Sports
- Cricket
- రాహుల్ తప్పించుకున్నాడు! లేదంటే అతని కెరీర్‌ని పాతిపెట్టేవాళ్లు... మాజీ క్రికెటర్ హాట్ కామెంట్...
రాహుల్ తప్పించుకున్నాడు! లేదంటే అతని కెరీర్‌ని పాతిపెట్టేవాళ్లు... మాజీ క్రికెటర్ హాట్ కామెంట్...
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 టోర్నీలో కెఎల్ రాహుల్ గురించి జరిగినంత చర్చ మరే విషయం మీద జరగలేదు. పేలవ ఫామ్‌తో ఆడిన తొలి రెండు టెస్టుల్లో ఫెయిలైన కెఎల్ రాహుల్, మూడో టెస్టులో చోటు దక్కించుకోలేకపోయాడు...

KL Rahul
కెఎల్ రాహుల్ ఆడిన మొదటి రెండు మ్యాచుల్లో గెలిచిన భారత జట్టు, అతన్ని పక్కనబెట్టి బరిలో దిగిన మూడో టెస్టులో ఓటమి పాలైంది. కెఎల్ రాహుల్ ప్లేస్‌లో టీమ్‌లోకి వచ్చిన శుబ్‌మన్ గిల్ కూడా పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయాడు...
Image credit: Getty
ఆస్ట్రేలియా టూర్‌లో, ఆ తర్వాత ఇంగ్లాండ్ టూర్‌లో మంచి పర్ఫామెన్స్ ఇచ్చిన శుబ్‌మన్ గిల్, స్వదేశంలో మాత్రం వరుసగా ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. అయితే 2023 సీజన్‌లో అతను బీభత్సమైన ఫామ్‌లో ఉండడంతో కెఎల్ రాహుల్ ప్లేస్‌లో మూడో టెస్టులో తుది జట్టులోకి వచ్చేశాడు...
Image credit: Getty
‘కెఎల్ రాహుల్ ఆడనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అతను ఆడకపోవడమే మంచిదైంది. ఇలాంటి పిచ్‌పై కెఎల్ రాహుల్ ఆడి ఉంటే, అతను కచ్ఛితంగా ఫెయిల్ అయ్యేవాడు. అదే జరిగి ఉంటే అతని టెస్టు కెరీర్ ఇక్కడితో ముగిసిపోయి ఉండేది..
KL Rahul
అతను ఆడకపోవడమే తన కెరీర్‌కి మంచిది. ఇలాంటి పిచ్‌లపై బ్యాటింగ్ చేయడం చాలా కష్టమైన పని. బ్యాటింగ్‌కి అస్సలు సహకరించవు. విరాట్ కోహ్లీ లాంటి బ్యాటర్ కూడా ఈ పిచ్‌పైన పరుగులు చేయలేకపోయాడు. కుహ్నేమన్ తొలి ఇన్నింగ్స్‌లో వేసిన బౌలింగ్ గమనిస్తే, పిచ్ ఎంతలా టర్న్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు...
Image credit: PTI
ఇలాంటి పిచ్‌పైన వికెట్లు తీయడం పెద్ద కష్టమేమీ కాదు. నేను బౌలింగ్ చేసినా, ఐదారు వికెట్లు తీసేవాడిని. ఇది నిజం, ఒప్పుకుని తీరాల్సిందే. టెస్టు క్రికెట్‌కి ఇలాంటి వికెట్లు అస్సలు సూట్ కావు...
Image credit: PTI
2008లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ గమనిస్తే, అవి పెద్దగా స్పిన్ పిచ్‌లు కావు. అయితే ఆస్ట్రేలియాపై సిరీస్ గెలవగలిగాం. కారణం మన పిచ్ మీద ఎలా బ్యాటింగ్ చేయాలో మనవాళ్లకి బాగా తెలుసు, ఎలా వికెట్లు తీయాలో మన బౌలర్లకు బాగా తెలుసు...’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్....
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 టోర్నీలో భాగంగా మార్చి 9 నుంచి అహ్మదాబాద్‌లో ఆఖరి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి అర్హత సాధించాలంటే టీమిండియా ఆఖరి మ్యాచ్‌ని కనీసం డ్రా చేసుకోవాల్సి ఉంటుంది...