MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Sports
  • Cricket
  • ఐదుగురు సూర్య కుమార్ యాదవ్‌లు, ఒక్క కోహ్లీ, ఓ వరల్డ్ కప్... రికీ పాంటింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్...

ఐదుగురు సూర్య కుమార్ యాదవ్‌లు, ఒక్క కోహ్లీ, ఓ వరల్డ్ కప్... రికీ పాంటింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్...

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా తరుపున అదరగొట్టిన ఇద్దరు బ్యాటర్లు విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్. టీమిండియా 6 మ్యాచుల్లో 4 విజయాలు అందుకుంటే వాటిల్లో చెరో రెండు సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలిచారు సూర్య, విరాట్ కోహ్లీ... టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో టాప్ 3లో ఉన్నారు ఈ ఇద్దరు...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Nov 21 2022, 10:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Virat Kohli Suryakumar Yadav

Virat Kohli-Suryakumar Yadav

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో విరాట్ కోహ్లీ 6 మ్యాచులు ఆడి 98.67 సగటుతో 296 పరుగులు చేశాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్ 6 మ్యాచుల్లో 59.75 సగటుతో 239 పరుగులు చేశాడు ఇందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 53 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 82 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ... ఒంటి చేత్తో విజయాన్ని అందిస్తే... సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో 64 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేసి అదరగొట్టిన సూర్యకుమార్ యాదవ్, నెదర్లాండ్స్, జింబాబ్వేలతో జరిగిన మ్యాచుల్లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడాడు...

36

న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ 51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లతో 111 పరుగులు చేసి అజేయ శతకం నమోదు చేశాడు. 217.65 స్ట్రైయిక్ రేటుతో బౌలర్లకు చుక్కలు చూపించాడు సూర్య. ఈ ఇన్నింగ్స్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్...

46
Suryakumar Yadav

Suryakumar Yadav

‘సూర్యకుమార్ యాదవ్‌లో టన్నుల్లో టాలెంట్ ఉంది. అతను ప్రపంచంలో ఏ మూలన అయినా పరుగులు రాబట్టగలడు. సూర్యకుమార్ యాదవ్‌ లాంటి ప్లేయర్లు ఐదుగురు, ఒక్క విరాట్ కోహ్లీని ఇవ్వండి. నేను వరల్డ్ కప్ గెలిచి చూపిస్తా... ’ అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు రికీ పాంటింగ్...

56
Image credit: PTI

Image credit: PTI

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్‌లపై ప్రశంసల వర్షం కురిపించిన రికీ పాంటింగ్, ‘నా దృష్టిలో విరాట్ కోహ్లీయే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్. అతను ఆడిన ఇన్నింగ్స్‌లు అసాధారణం...’ అంటూ కామెంట్ చేశాడు రికీ పాంటింగ్...

66

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో మెరుపు సెంచరీ చేసిన సూర్యకుమార్ యాదవ్‌ని ట్వీట్‌తో అభినందించాడు విరాట్ కోహ్లీ. ‘నుమెరో యూనో (స్పానిష్‌లో నెం.1 అని అర్థం) వరల్డ్‌లో తాను బెస్ట్ ఎందుకో మరోసారి చూపిస్తున్నాడు. లైవ్ మ్యాచ్ చూడలేదు కానీ అతని నుంచి మరో వీడియో గేమ్ ఇన్నింగ్స్ అని తెలుస్తోంది...’ అంటూ ట్వీట్ చేశాడు విరాట్ కోహ్లీ...

About the Author

CR
Chinthakindhi Ramu
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Recommended image2
IND vs SL: 5వ రోజు క్లైమాక్స్ మామూలుగా ఉండదు.. శ్రీలంక 16 రన్స్ లీడ్, భారత్‌కు 4 వికెట్లే బాకీ
Recommended image3
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved