Kapil dev: ‘గెట్ వెల్ సూన్ పాజీ’... కపిల్‌దేవ్ త్వరగా కోలుకోవాలని...
టీమిండియాకు మొట్టమొదటి వన్డే వరల్డ్ కప్ అందించిన సారథి కపిల్ దేవ్... గుండెపోటు కారణంగా ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కపిల్ దేవ్, కోలుకుంటున్నారని ఆసుపత్రి వర్గాలు తెలియచేశాయి. కపిల్ దేవ్ త్వరగా కోలుకుని, క్షేమంగా రావాలని భారత ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీతో పాటు సచిన్, సెహ్వాగ్, యువరాజ్ వంటి క్రికెటర్లు ప్రార్థిస్తూ ట్వీట్లు చేశారు.
భారత జట్టు తరపున 131 టెస్టులతో పాటు 225 వన్డే మ్యాచులు ఆడిన కపిల్ దేవ్... 9 వేలకు పైగా పరుగులతో పాటు టెస్టుల్లో 400 వికెట్లు పడగొట్టి పర్ఫెక్ట్ ఆల్‌రౌండర్‌గా నిరూపించుకున్నారు.
కపిల్‌దేవ్ గుండెలో రక్తం గడ్డకట్టినట్టు గుర్తించిన వైద్యులు, హార్ట్ సర్జరీ నిర్వహించారు. సర్జరీ అనంతరం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.
61 ఏళ్ల కపిల్ దేవ్... 1959, జనవరి 6న పంజాబ్‌లోని ఛండీఘర్‌లో జన్మించారు...
కపిల్‌దేవ్‌కి ‘పాజీ’, ‘ది హర్యానా హరికేన్’ అని ముద్దు పేర్లు ఉన్నాయి...
1978, అక్టోబర్ 1న పాకిస్థాన్‌పై మ్యాచ్‌తో క్రికెట్ ఎంట్రీ ఇచ్చిన కపిల్ దేవ్... టెస్టుల్లో 5 వేల పరుగులు, 434 వికెట్లు తీసుకున్న ఒకేఒక్క క్రికెటర్‌గా చరిత్ర సృష్టించారు.
1994లో క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన కపిల్ దేవ్.. ఆ సమయానికి టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నాడు.
రిటైర్మెంట్ తర్వాత ఏడాది పాటు జాతీయ జట్టుకి క్రికెట్ కోచ్‌గా వ్యవహారించిన కపిల్ దేవ్... 1983లో వరల్డ్ కప్ గెలిచి, అప్పటిదాకా క్రికెట్‌ని ఏలిన విండీస్‌కి షాక్ ఇచ్చాడు.
క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత టీవీ వ్యాఖ్యతగా కూడా మంచి పేరు తెచ్చుకున్న కపిల్ దేవ్, ‘అర్జున అవార్డు’ తో పాటు ‘పద్మశ్రీ’, ‘పద్మభూషణ్’ వంటి అవార్డులు దక్కించుకున్నారు.
కపిల్ దేవ్ జీవిత చరిత్ర ఆధారంగా ‘83’ పేరుతో రణ్‌వీర్ సింగ్ హీరోగా బాలీవుడ్‌లో సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.
కపిల్ దేవ్ త్వరగా కోలుకుని, క్షేమంగా క్రికెట్ క్రీజులోకి మళ్లీ రావాలని అనిల్ కుంబ్లే, సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ తదితరులు ట్విట్టర్ ద్వారా ఆకాంక్షించారు.
భారత క్రికెట్ జట్టు నేడు ఈ స్థాయికి చేరుకోవడానికి ఓ రకంగా కపిల్ దేవ్ కూడా కారణం.
టీవీ షోలు, బ్రాండ్ అంబాసిడర్ల ద్వారా సంపాదించిన డబ్బుతో ఓ ప్రైవేట్ జెట్ విమానాన్ని కొనుగోలు చేశాడు కపిల్ దేవ్.
మూడు జాతీయ అవార్డులతో పాటు 2008లో భారత మిలటరీలో లిఫ్టనెంట్ కల్నల్‌గా గౌరవ ర్యాంకు పొందాడు కపిల్ దేవ్..
సచిన్ టెండూల్కర్ భారత క్రికెట్‌లో ఎవర్‌గ్రీన్ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అయితే, కపిల్ దేవ్ ఎవర్‌గ్రీన్ ఆల్‌రౌండర్...