- Home
- Sports
- Cricket
- గంభీర్, నాతోనే కాదు, అందరితోనూ గొడవ పడతాడు! చాలా తేడా మనిషి... షాహిద్ ఆఫ్రిదీ కామెంట్స్
గంభీర్, నాతోనే కాదు, అందరితోనూ గొడవ పడతాడు! చాలా తేడా మనిషి... షాహిద్ ఆఫ్రిదీ కామెంట్స్
టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌కి ఆవేశం చాలా ఎక్కువ. రిటైర్మెంట్ తర్వాత కూడా అది ఏ మాత్రం తగ్గలేదు. ఐపీఎల్ 2023 సీజన్‌లో విరాట్ కోహ్లీ, గంభీర్ మధ్య జరిగిన గొడవే దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణ. ఇంతకుముందు టీమిండియా ఆడే మ్యాచుల్లోనూ గంభీర్, వేరే ప్లేయర్లతో గొడవ పడిన సందర్భాలు ఉన్నాయి..

Gautam Gambhir, Shahid Afridi
ముఖ్యంగా పాకిస్తాన్‌తో మ్యాచ్ అంటే గౌతమ్ గంభీర్ ఆవేశంతో ఊగిపోయేవాడు. 2007లో కాన్పూర్‌లో జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌లో షాహిద్ ఆఫ్రిదీ, గౌతమ్ గంభీర్ మధ్య మాటా మాటా పెరిగి తీవ్ర వాగ్వాదం జరిగింది..
Legends League Cricket
ఆ తర్వాత ఈ ఏడాది ఆరంభంలో ఈ ఇద్దరూ కలిసి లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో ఆడారు. ఈ సమయంలో షేక్ హ్యాండ్స్ కూడా ఇచ్చుకున్నారు. అయితే గంభీర్ ఇప్పటికీ ఏం మారలేదని అంటున్నారు షాహిద్ ఆఫ్రిదీ...
Gambhir-Kohli
‘క్రికెట్‌లో ఇలాంటి గొడవలు చాలా కామన్. సోషల్ మీడియా కారణంగా ప్రతీ చిన్న గొడవను చాలా పెద్దదిగా చూపిస్తున్నారు. గౌతమ్ గంభీర్ చాలా తేడా మనిషి. అతని వ్యక్తిత్వం వేరుగా ఉంటుంది..
టీమిండియాలో కూడా అతన్ని ఇలాగే చూస్తారు. నాతో మాత్రమే అతను ఇలా ప్రవర్తించడం లేదు. చాలా మందితో గొడవలు పడ్డాడు. అయితే ఇప్పుడు ఆ విషయం గురించి ఎక్కువగా మాట్లాడుకోకపోవడమే మంచిది..
అయితే బ్యాటర్‌గా గౌతమ్ గంభీర్ చాలా అద్భుతమైన ఆటగాడు. అతని బ్యాటింగ్ టైమింగ్ చూడచక్కగా ఉంటుంది. తన బ్యాటింగ్‌ని నేను ఎంతగానో ఎంజాయ్ చేస్తాను.. టీమిండియాలో చాలా తక్కువ మందికి గంభీర్‌లాంటి బ్యాటింగ్ టైమింగ్ ఉంటుంది..’ అంటూ కామెంట్ చేశాడు షాహిద్ ఆఫ్రిదీ..
టీమిండియా తరుపున 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20 మ్యాచులు ఆడిన గౌతమ్ గంభీర్, మూడు ఫార్మాట్లలో కలిపి 20 సెంచరీలతో 10 వేలకు పైగా పరుగులు చేశాడు. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు..
రిటైర్మెంట్ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిన గౌతమ్ గంభీర్, ప్రస్తుతం ఢిల్లీలో ఎంపీగా వ్యవహరిస్తున్నాడు. అదే విధంగా ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కి మెంటర్‌గా ఉన్నాడు. టీమిండియా ఆడే మ్యాచులకు కామెంటేటర్‌గానూ చేస్తున్నాడు గౌతీ..
మరోవైపు షాహిద్ ఆఫ్రిదీ తన కెరీర్‌లో 27 టెస్టులు, 398 వన్డేలు, 99 టీ20 మ్యాచులు ఆడాడు. బౌలింగ్‌లో 541 వికెట్లు తీసిన ఆఫ్రిదీ, మూడు ఫార్మాట్లలో కలిపి 10 వేలకు పైగా పరుగులు చేశాడు. 2009 టీ20 వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించాడు ఆఫ్రిదీ..