- Home
- Sports
- Cricket
- డబ్బుల కోసం ఎంతకైనా దిగజారుతారా? వీళ్లా మన రోల్ మోడల్స్... కపిల్ దేవ్, గవాస్కర్, వీరూపై గంభీర్ ఫైర్...
డబ్బుల కోసం ఎంతకైనా దిగజారుతారా? వీళ్లా మన రోల్ మోడల్స్... కపిల్ దేవ్, గవాస్కర్, వీరూపై గంభీర్ ఫైర్...
టీమిండియా మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్‌లపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యాడు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. భారత క్రికెట్‌ని ఏలిన ఈ ముగ్గురూ, మనదేశానికి రోల్ మోడల్స్ ఎలా అవుతారంటూ కడిగి పారేశాడు..

Image credit: PTI
కొన్ని రోజుల క్రితమే తనకు ఎన్ని కోట్లు ఇస్తామని చెప్పినా తాను జనాల ఆరోగ్యానికి హాని కలిగించే టొకాబో, మద్యపానం వంటి కంపెనీల బ్రాండ్లకు ప్రమోషన్స్ చేయనని చెప్పేశానని కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్..
Gautam Gambhir
రూ.20 కోట్లు ఇస్తామని చెప్పినా ఓ పాన్ మసాలా యాడ్‌లో నటించడానికి ఒప్పుకోలేదని సచిన్ టెండూల్కర్ తెలిపాడు. ఇది జరిగిన కొన్ని రోజులకే భారత మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, వీరేంద్ర సెహ్వాగ్ ఇదే పాన్ మసాలా యాడ్‌లో కనిపించారు.ఇది గౌతమ్ గంభీర్‌కి తీవ్రమైన ఆగ్రహాన్ని తెప్పించింది..
Virender Sehwag
‘ఇది నిజంగా అసహ్యం! వీళ్లు చేసిన పని నన్ను చాలా నిరుత్సాహపరిచింది. వీళ్లేనా మన రోల్ మోడల్స్. అందుకే రోల్ మోడల్‌ని ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని అంటాను...
మన పేరుని బట్టి కాకుండా మనం చేసే పనులను బట్టి జనాలను మనల్ని గౌరవిస్తారు, గుర్తిస్తారు. కొన్ని కోట్ల మంది పిల్లలు ఈ యాడ్స్ చూస్తారు... ఇలాంటి పాన్ మసాలా యాడ్స్ చేసేందుకు డబ్బేనా కారణం. డబ్బు కోసం ఎంత నీచానికి అయినా దిగజారుతారా...
నేను 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పుడు నాకు రూ.3 కోట్లు ఇచ్చారు. కానీ నేను దాన్ని తీసుకోలేదు. ఎందుకంటే అది నాది కాదు. నేను ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాక డబ్బులు తీసుకోవడం కరెక్ట్ కాదు..
Sachin Tendulkar
సచిన్ టెండూల్కర్‌కి రూ.20-30 కోట్లు ఇస్తామని చెప్పినా ఆయనెప్పుడూ పాన్ మసాలా యాడ్స్ చేయలేదు. ఎందుకంటే ఆయన అలా చేయనని తన తండ్రికి మాట ఇచ్చారు. అందుకే ఆయన నా రోల్ మోడల్..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్..