బాక్సింగ్ డే టెస్టుకి భారత జట్టును ప్రకటించిన గౌతమ్ గంభీర్... ఏకంగా ఐదు మార్పులతో...
First Published Dec 22, 2020, 4:10 PM IST
మొదటి టెస్టు మ్యాచ్‌లో ఊహించని పరాజయంతో కుదేలైన టీమిండియా, బాక్సింగ్ డే టెస్టు కోసం ఆశగా ఎదురుచూస్తోంది. ఆసీస్ టూర్‌ను వరుసగా రెండు పరాజయాలతో ఆరంభించిన టీమిండియా, ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచుల్లో గెలిచింది. ఆఖరి టీ20తో పాటు మొదటి టెస్టు ఓడడంతో మళ్లీ విజయాల బాట పట్టాలని డిసైడ్ అయిన భారత జట్టుకి కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చాడు భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్.

తొలి టెస్టులో ఆడిన ప్లేయర్లలో విరాట్ కోహ్లీ స్వదేశానికి వచ్చేయడం, మహ్మద్ షమీ గాయంతో తప్పుకోవడంతో వీరిద్దరితో పాటు మరో ముగ్గురు ప్లేయర్లతో రెండో టెస్టులో చోటు ఉండకూడదని తెలిపాడు గౌతమ్ గంభీర్...

మెల్‌బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి ప్రారంభమైన బాక్సింగ్ డే టెస్టులో భారత జట్టులో ఈ 11 మంది ఉంటే, మెరుగైన ప్రదర్శన కనబరుస్తుందని తెలుపుతూ తన ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించాడు గౌతీ.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?