బయో మార్చిన భువనేశ్వర్ కుమార్... ఇండియన్ క్రికెటర్ నుంచి కేవలం ఇండియన్ అంటూ...
30+ వయసు దాటితే చాలు, ఆ బౌలర్లను పట్టించుకోవడం మానేస్తోంది టీమిండియా మేనేజ్‌మెంట్. 34 ఏళ్ల ఇషాంత్ శర్మ, ఏడాదిన్నరగా టీమ్‌లో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. 33 ఏళ్ల భువనేశ్వర్ కుమార్‌ది కూడా ప్రస్తుతం ఇదే పరిస్థితి..
Image credit: PTI
ఆసియా కప్ 2022 టోర్నీలో 11 వికెట్లు తీసిన భువనేశ్వర్ కుమార్, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా టాప్‌లో నిలిచాడు. జస్ప్రిత్ బుమ్రా రీఎంట్రీ కోసం ఆశగా ఎదురుచూస్తున్న టీమిండియా మేనేజ్‌మెంట్, ఫిట్‌గా ఉన్న భువీని మాత్రం పూర్తిగా పట్టించుకోవడం మానేసింది..
Image credit: PTI
జనవరి 2022లో న్యూజిలాండ్‌తో ఆఖరి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడిన భువనేశ్వర్ కుమార్, 2022 నవంబర్‌లో న్యూజిలాండ్‌తో ఆఖరి టీ20 మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత భువీని పూర్తిగా పక్కనబెట్టేసింది టీమిండియా..
Image credit: Getty
టీమ్‌లో చోటు దక్కించుకోలేకపోవడంతో భువనేశ్వర్ కుమార్, ఇన్‌స్టాలో బయో మార్చేశాడు. ఇంతకుముందు భువనేశ్వర్ కుమార్, ఇన్‌స్టా అకౌంట్‌లో ‘ఇండియన్ క్రికెటర్’ అని భారత జెండాతో బయో ఉండేది. దాన్ని ‘ఇండియన్’ అంటూ మార్చేశాడు భువీ..
ఐపీఎల్ 2023 సీజన్‌లో 7 మ్యాచులు ఆడి 5 వికెట్లు మాత్రమే తీసిన భువనేశ్వర్ కుమార్, 2022 సీజన్‌లో 14 మ్యాచులు ఆడి 12 వికెట్లు మాత్రమే తీశాడు. 2021 సీజన్‌లోనూ భువీ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. 11 మ్యాచుల్లో 6 వికెట్లు మాత్రమే తీశాడు..
టీమిండియాకి ఎంపిక చేయడానికి ఐపీఎల్ పర్ఫామెన్స్‌ని మాత్రమే ప్రామాణీకంగా తీసుకుంటున్న బీసీసీఐ సెలక్టర్లు, భువీని పూర్తిగా పక్కనబెట్టేశారు. వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన భువీ, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ లిస్టులో లేడు..
బుమ్రా, భువీ కలిసి టీమ్‌కి ఎన్నో మ్యాచుల్లో విజయాలు అందించారు. బుమ్రా ఫెయిలైన మ్యాచుల్లో కూడా భువనేశ్వర్ కుమార్, అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. టీ20ల్లో అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్‌గా ఉన్న భువీ, డెత్ ఓవర్ స్పెషలిస్ట్ బౌలర్ కూడా..
అయితే అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ వంటి యంగ్ బౌలర్ల రాకతో భువనేశ్వర్ కుమార్‌ని పట్టించుకోవడం మానేసింది టీమిండియా. ఇక టీమ్‌లో చోటు దక్కదని ఫిక్స్ అయిపోయిన భువీ, తన బయోలో ఇంకా ‘ఇండియన్ క్రికెటర్’ అని పెట్టుకోవడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో ‘ఇండియన్’ అని మార్చి ఉంటాడని అర్థమవుతోంది..