రిటైర్మెంట్ ప్రకటించిన మరో సీఎస్‌కే ప్లేయర్... ధోనీ కెప్టెన్సీలో భారత జట్టుకు ఆడి...

First Published 18, Nov 2020, 1:59 PM

ఐపీఎల్‌ ముగిసిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్, ఆసీస్ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. మరో సీఎస్‌కే క్రికెటర్ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పాడు. 33ఏళ్ల సుదీప్ త్యాగి... భారత జట్టు తరుపున కూడా ప్రాతినిథ్యం వహించాడు. చాలా ఏళ్లుగా సరైన గుర్తింపు కోసం కష్టపడుతున్న త్యాగి, క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ప్రకటించాడు.

డిసెంబర్, 2009లో శ్రీలంకపై జరిగిన సిరీస్‌లో ఆరంగ్రేటం చేశాడు భారత పేస్ బౌలర్ సుదీప్ త్యాగి...

నాలుగు వన్డేలతో పాటు ఒక టీ20 మ్యాచ్ కూడా ఆడిన సుదీప్ త్యాగికి ఆ తర్వాత పెద్దగా అవకాశం రాలేదు...

ఉత్తరప్రదేశ్ తరుపున దేశవాళీ క్రికెట్ ఆడిన సుదీప్ త్యాగి... ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరుపున ఆడాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఏబీ డివిల్లియర్స్‌ను మొదటి బంతికే డకౌట్ చేసిన మొట్టమొదటి భారత బౌలర్ సుదీప్ త్యాగి.

తన క్రికెట్ కెరీర్‌లో 170కి పైగా వికెట్లు తీసిన సుదీప్ త్యాగి... గాయాల కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.

సుదీప్ త్యాగి ఆరంగ్రేటం చేసిన మ్యాచ్‌ను అంపైర్లు ‘పిచ్ ఆటకి సరిగా లేని’ కారణంగా రద్దు చేశారు..

‘నా క్రికెట్ కెరీర్‌కి సహకరించి, సహాయపడిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు... ప్రతీ క్రికెటర్ కలకనేదాన్ని నేను సాధించాను. దేశం తరుపున క్రికెట్ ఆడాను. భారత పతకాన్ని ధరించడం నా కల... దాన్ని సాకారం చేసుకున్నాను... అంటూ చెప్పాడు సుదీప్ త్యాగి...

అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన త్యాగి... అయితే ఎక్కడ అవకాశం వస్తే, అక్కడ ఆడేందుకు సిద్ధంగా ఉంటానని చెప్పాడు...

మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోనే మొదటి వన్డే ఆడాను. ఆ అవకాశం కల్పించిన ధోనీకి థ్యాంక్స్... అంటూ పోస్టు చేశాడు.

అలాగే ‘నా రోల్ మోడల్ మహ్మద్ కైఫ్, సురేశ్ రైనా, ఆర్‌పీ సింగ్‌లకు ప్రత్యకంగా ధన్యవాదాలు’ చెబుతున్నానంటూ రాసుకొచ్చాడు సుదీప్ త్యాగి.