MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cricket
  • 2 నిమిషాలని చెప్పి, గంటలు వెయిట్ చేయించాడు! బీర్ తాగకుండానే వచ్చేశాం.. యాషెస్ సిరీస్‌పై స్టీవ్ స్మిత్...

2 నిమిషాలని చెప్పి, గంటలు వెయిట్ చేయించాడు! బీర్ తాగకుండానే వచ్చేశాం.. యాషెస్ సిరీస్‌పై స్టీవ్ స్మిత్...

యాషెస్ సిరీస్ 2023 టోర్నీ, క్రికెట్ ఫ్యాన్స్‌కి భలే కిక్ అందించింది. మొదటి మ్యాచ్ నుంచి ఆఖరి మ్యాచ్ వరకూ ప్రతీ టెస్టు కూడా నువ్వా-నేనా అన్నట్టుగానే సాగింది. బెన్ స్టోక్స్ బజ్ బాల్ కాన్సెప్ట్‌కి, ప్యాట్ కమ్మిన్స్ కూల్ బాల్ కాన్సెప్ట్‌ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది.. 

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Aug 12 2023, 07:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Jonny Bairstow vs Steve Smith

Jonny Bairstow vs Steve Smith

నాలుగో టెస్టు వర్షం కారణంగా ఫలితం తేలకుండా డ్రాగా ముగియగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా చెరో రెండేసి మ్యాచులు గెలిచాయి. 2-2 తేడాతో యాషెస్ 2023 డ్రా కాగా, 2021లో 4-0 తేడాతో యాషెస్ గెలిచిన ఆస్ట్రేలియా, సిరీస్‌ని రిటైన్ చేసుకుంది..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Steve Smith

Steve Smith

యాషెస్ సిరీస్ ముగిసిన తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు కలిసి బీర్ తాగి సెలబ్రేట్ చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఓవల్ టెస్టు తర్వాత ఇంగ్లాండ్ ప్లేయర్లు, గంటల తరబడి డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితం కావడంతో ఈసారి బీర్ పార్టీ జరగలేదు.. తాజాగా ఆసీస్ మాజీ కెప్టెన్, ప్రస్తుత టెస్టు వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఈ విషయంపై స్పందించాడు...

36
Steve Smith Catch

Steve Smith Catch

‘మేం చాలా సార్లు, ఇంగ్లాండ్ డ్రెస్సింగ్ రూమ్ దగ్గరికి వెళ్లి తలుపులు కొట్టి పిలిచాం. మేం అప్పటికే చాలా సేపటి నుంచి అక్కడ వెయిట్ చేస్తున్నాం. స్టోకీ (బెన్ స్టోక్స్) వచ్చి, రెండు నిమిషాలు అని చెప్పి లోపలికి వెళ్లాడు.. గంటలు గడిచిపోయాయి, రాలేదు..

46
Steve Smith

Steve Smith

ఇంకా వెయిట్ చేయడం కరెక్ట్ కాదని అనిపించింది. బీర్ తాగుతున్నామా? లేదా అనే విషయం పక్కనబెడితే, పరువు పోగొట్టుకోవడం ఇష్టం లేక వెళ్లిపోయాం. నా కెరీర్‌లో మొదటి సారి యాషెస్ సిరీస్ తర్వాత బీర్ పార్టీ జరగలేదు. ఇది సిగ్గు చేటు.. ’ అంటూ కామెంట్ చేశాడు స్టీవ్ స్మిత్...

56
Ben Stokes

Ben Stokes

దీనిపై ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ రియాక్ట్ అయ్యాడు. ‘ఓ ఇంగ్లాండ్ ప్లేయర్‌కి ఏదో ముఖ్యమని పని పడింది. అది పూర్తవ్వడానికి అనుకున్నదానికంటే చాలా సమయం పట్టింది. అయితే ఆ రోజు రాత్రి నైట్‌క్లబ్‌లో పార్టీ ఉంటుందని వాళ్లకి చెప్పాను..’ అంటూ కామెంట్ చేశాడు బెన్ స్టోక్స్...
 

66
Ben Stokes

Ben Stokes

అయితే నైట్ క్లబ్ పార్టీకి స్టీవ్ స్మిత్ హాజరు కాలేదు. ‘ఆ రోజు రాత్రి నైట్ క్లబ్‌లో పార్టీకి కొందరు ఆస్ట్రేలియా ప్లేయర్లు వెళ్లారని విన్నాను. అయితే అప్పటికే నేను ఇంటికి వచ్చేశాను కూడా. ఓ అద్భుతమైన సిరీస్ తర్వాత బీర్ తాగకుండా ఇంటికి రావడం మాత్రం అవమానకరంగా అనిపించింది..’ అంటూ కామెంట్ చేశాడు స్టీవ్ స్మిత్.. 

About the Author

CR
Chinthakindhi Ramu
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved