- Home
- Sports
- Cricket
- సరిగ్గా ఫోకస్ పెడితే టెండూల్కర్ తర్వాత నువ్వే.... శుబ్‌మన్ గిల్‌తో సునీల్ గవాస్కర్ కామెంట్...
సరిగ్గా ఫోకస్ పెడితే టెండూల్కర్ తర్వాత నువ్వే.... శుబ్‌మన్ గిల్‌తో సునీల్ గవాస్కర్ కామెంట్...
2023 ఏడాదిలో మొదటి మూడు నెలలు శుబ్‌మన్ గిల్‌కి బాగా కలిసి వచ్చాయి. గత ఏడాది గుజరాత్ టైటాన్స్ తరుపున ఐపీఎల్ టైటిల్ గెలిచిన శుబ్‌మన్ గిల్, టీమిండియాకి త్రీ ఫార్మాట్ ప్లేయర్‌గా మారిపోయాడు. అహ్మదాబాద్‌లో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగాడు శుబ్‌మన్ గిల్...

ఈ ఏడాదిలో ఐదో సెంచరీ నమోదు చేసిన శుబ్‌మన్ గిల్, సూపర్ హాట్ ఫామ్‌ని కొనసాగిస్తూ వెళ్తున్నాడు. అహ్మదాబాద్ టెస్టులో మూడో రోజు ఆట ముగిసిన తర్వాత శుబ్‌మన్ గిల్‌ని ఇంటర్వ్యూ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్...
Shubman Gill
‘ఇది నీ టెస్టు కెరీర్‌లో రెండో సెంచరీ. నువ్వు ఇలా సెంచరీల మీద సెంచరీలు కొడుతూ వెళ్లాలని అనుకుంటున్నా. నువ్వు 8 వేలు, 10 వేలు, 15 వేల పరుగులు చేయాలని కోరుకుంటున్నా.. ’ అంటూ శుబ్‌మన్ గిల్‌తో కామెంట్ చేశాడు సునీల్ గవాస్కర్..
Image credit: PTI
‘శుబ్‌మన్ గిల్ వయసు 23 ఏళ్లు. అతని దగ్గర చాలా సమయం ఉంది. గిల్ డిఫెన్సివ్ షాట్ చాలా బాగా ఆడతాడు. మిచెల్ స్టార్క్ లాంటి సీనియర్ పేసర్ బౌలింగ్‌లోనూ చాలా చక్కగా బ్యాటుని బెండ్ చేసి కొడతాడు... శుబ్‌మన్ గిల్ ఆడుతుంటే చూడడానికి చాలా బాగుంటుంది..
Shubman Gill
అన్నింటి కంటే ముఖ్యంగా శుబ్‌మన్ గిల్ ఆత్మవిశ్వాసం అతని బ్యాటింగ్‌లో కనిపిస్తుంది. బ్యాక్ ఫుట్‌లో ఆడతాడు, ఫ్రంట్ ఫుట్‌లో ఆడతాడు... సాలిడ్ డిఫెన్స్ ఆడతాడు, అలాగే సాలిడ్‌గా అటాక్ చేస్తాడు. టెస్టు క్రికెట్‌కి ఇలాంటి ప్లేయర్ కావాలి...
Shubman Gill
ఇది అతని కెరీర్‌కి చాలా కీలక సమయం. శుబ్‌మన్ గిల్ సరిగ్గా ఫోకస్ పెడితే తన టెస్టు కెరీర్‌లో ఈజీగా 8 వేల నుంచి 10 వేల పరుగులు చేస్తాడు.. ’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్...
Image credit: PTI
టెస్టుల్లో 10 వేల పరుగులు చేసిన మొట్టమొదటి క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు సునీల్ గవాస్కర్. టెస్టు క్రికెట్‌లో 14 మంది ప్లేయర్లు 10 వేలకు పైగా పరుగులు చేయగా సచిన్ టెండూల్కర్ ఒక్కడే 15 వేలకు పైగా టెస్టు పరుగులు సాధించి టాప్‌లో ఉన్నాడు...
టీమిండియా నుంచి సచిన్ టెండూల్కర్‌తో పాటు రాహుల్ ద్రావిడ్, సునీల్ గవాస్కర్ మాత్రమే టెస్టుల్లో 10 వేలకు పైగా పరుగులు చేశారు. వీవీఎస్ లక్ష్మణ్ 8781, వీరేంద్ర సెహ్వాగ్ 8586, సౌరవ్ గంగూలీ 7212 వంటి దిగ్గజాలు కూడా టెస్టుల్లో 10 వేల క్లబ్‌లో చేరలేకపోయారు..
టెస్టు సెంచరీతో ఒకే ఏడాదిలో మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన నాలుగో భారత బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు... ఇంతకుముందు 2010లో సురేష్ రైనా, 2016లో కెఎల్ రాహుల్ మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేస్తే, 2017లో టెస్టుల్లో సెంచరీ చేసిన రోహిత్ శర్మ ఈ ఫీట్ సాధించాడు. రోహిత్ తర్వాత ఆరేళ్లకు శుబ్‌మన్ గిల్ ఈ లిస్టులో చేరాడు...