MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Sports
  • Cricket
  • తప్ప తాగి భార్యపై దాడి.. సచిన్ టెండూల్కర్‌ ఫ్రెండ్‌ను అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు

తప్ప తాగి భార్యపై దాడి.. సచిన్ టెండూల్కర్‌ ఫ్రెండ్‌ను అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు

Vinod Kambli: టీమిండియా  క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్  మిత్రుడు, గతంలో అతడితో కలిసి ఆడిన   వినోద్ కాంబ్లీ  మరసారి వార్తల్లో నిలిచాడు.   అతడు తప్పతాగి  వచ్చి తన భార్యపై దాడికి పాల్పడ్డాడు. 

2 Min read
Author : Srinivas M
Published : Feb 05 2023, 12:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ మరో వివాదంలో చిక్కుకున్నాడు.   సోయి లేకుండా తాగి వచ్చి  భార్యను  దాడి చేసినందుకు గాను  కాంబ్లీని  ముంబై పోలీసులు అరెస్టు చేశారు.    కాంబ్లీ భార్య  ఆండ్రియా  హెవిట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు  పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

వివరాల్లోకి వెళ్తే...  ప్రస్తుతం భార్య, ఒక కుమారుడితో కలిసి  కాంబ్లీ  ముంబైలోని బాంద్రా  ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు.  రెండ్రోజుల క్రితం  ఇంట్లోనే   బాగా తాగాడు. మధ్యాహ్నం  పూటే సోయి లేకుండా తాగాడు.  ఇదే క్రమంంలో ఆండ్రియాతో గొడవపడ్డాడు.   ఆ తర్వాత  మద్యం మత్తులో  భార్యపై దాడికి దిగాడు. 

36

కాంబ్లీని నిలువరించడానికి తన కొడుకు యత్నించినా అతడిని కూడా   తోసేసి  వంట గదిలో ఉన్న పాన్  హ్యాండిల్ తో  ఆండ్రియాపై విచక్షణరహితంగా  దాడికి  పాల్పడ్డాడు.   దీంతో ఆమె దెబ్బలకు తాళలేక   పోలీసులకు ఫోన్ చేసింది. ఆండ్రియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాంద్రా పోలీసులు కాంబ్లీని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.  తీవ్రంగా గాయాలపాలైన  ఆండ్రియా.. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నది.

46

కాగా  కాంబ్లీకి ఇలాంటి వివాదాలు కొత్త కాదు.   గతేడాది   ఫిబ్రవరిలో  తను  ఉండే అపార్ట్‌మెంట్ లోని ఇతరులతో గొడవపడటంతో  పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.  గతంలో కాంబ్లీ  బాగా తాగి  కార్ నడిపి యాక్సిడెంట్ చేశాడని వార్తల్లో నిలిచాడు.   

56

భారత జట్టు తరఫున సచిన్, కాంబ్లీలు దాదాపు ఒకే సమయంలో అరంగేట్రం చేశారు.  టీమిండియా తరఫున  17 టెస్టులు,  104 వన్డేలు ఆడిన కాంబ్లీ.. తన వ్యవహారశైలితో  టీమ్ లో చోటు కోల్పోయాడు.  ఆట నుంచి తప్పుకున్నాక  సినిమాల్లో యత్నించి అక్కడా సక్సెస్ కాకపోవడంతో  కోచింగ్ బాధ్యతలు తీసుకున్నాడు. ప్రస్తుతం ముంబై క్రికెట్ అసోసియేషన్ లో సభ్యుడిగా ఉన్నాడు.

66

సచిన్ కు స్నేహితుడైన కాంబ్లీ..  తన స్నేహితుడు   అగ్రస్థానాలకు వెళ్లి రికార్డులు  చెరిపేసి   భారత క్రికెట్ లో మహోన్నతుడిగా అవతరిస్తే మరోవైపు కాంబ్లీ మాత్రం  తన దురలవాట్లతో  కెరీర్ పాడుచేసుకున్నాడనే వాదనలు ఉన్నాయి. వాటికి కొనసాగింపా అన్నట్టుగా  కాంబ్లీ  నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. 

About the Author

SM
Srinivas M
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Afghanistan vs India: ఆప్ఘ‌న్‌పై టీమిండియా ఘ‌న విజ‌యం.. శాంస‌న్ సునామీ ఇన్నింగ్స్, సిరీస్ కైవ‌సం
Recommended image2
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Recommended image3
Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved